పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం | man entered into The lion enclosure hyderabad nehru zoo park | Sakshi
Sakshi News home page

పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం

Published Sun, May 22 2016 7:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం - Sakshi

పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఓ మందబాబు హల్చల్ చేశాడు. రాజస్థాన్కు చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం జూ పార్క్ సందర్శనకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఒక్కసారిగా పులి ఇంక్లోజర్లోనికి దూకేశాడు. అదృష్టవశాత్తు పులి అతన్ని గమనించలేదు. ఇంతలో సందర్శకుల అరుపులు, కేకలతో పులి డెన్లోనికి వెళ్లిపోయింది.

వెంటనే గమనించిన జూలాజికల్ పార్క్ అధికారులు సమయస్ఫూర్తితో పులులను డెన్లోకి తీసుకువెళ్లారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో జూకు వచ్చిన సందర్శకులు ఈ పరిమాణంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. జూ అధికారులు అతన్ని అదుపులోకి స్థానిక పోలీసులకు అప్పగించారు. బతుకు దెరువు కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. సందర్శకుడు సురక్షితంగా బయటపడడంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement