mukesh
-
జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్యలో విస్తుగొలిపే విషయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవినీతి జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కక్షగట్టి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను చంపేసిన ఉదంతంలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. పోస్ట్‌మార్టమ్ నివేదికలో విస్మయకర వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముకేశ్‌ను చిత్రవధ చేసి అంతంచేశారని, చంపేశాక మృతదేహంపైనా తమ పట్టరాని ఆవేశాన్ని చూపించారని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొంది. ముకేశ్ మృతదేహాన్ని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని చఠాన్పారా బస్తీ ప్రాంతంలోని ప్రధాన నిందితుడికి చెందిన ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం హంతకులు మృతదేహం నుంచి గుండెను వేరేచేసి, కాలేయాన్ని నాలుగు ముక్కలుచేశారు. తలలో 15 చోట్ల విరిగిన గుర్తులున్నాయి. మెడ విరిగిపోయింది. ఐదు పక్కటెముకలు, మెడ ఎముకలు విరిగిపోయాయి. చేయి విరిచేశారు. తల, ఛాతి, వీపు, పొట్టపై తీవ్రమైన గాయాలున్నాయి. ఇనుప రాడ్డు వంటి బలమైన ఆయుధంతో కొట్టిన గుర్తులున్నాయి. చేతిపై ఉన్న ఒకే ఒక్క పచ్చబొట్టు సాయంతో మృతదేహం ముకేశ్‌దే అని గుర్తించగలిగారు. తమ 12 ఏళ్ల పోస్ట్‌మార్టమ్ కెరీర్లో ఇంతటి దారుణమైన హత్యను చూడలేదని వైద్యులు తెలిపారు. ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు రితేశ్ చంద్రకర్, దినేశ్ చంద్రకర్, మహేంద్రలను అరెస్ట్‌చేశారు. ప్రధాన నిందితుడు సురేశ్ సైతం మృతుడికి దూరపు బంధువుకావడం గమనార్హం. బీజాపూర్ రోడ్డు పనులపై నోరు మెదపకుండా ఉండేందుకు మాట్లాడాలంటూ సురేశ్ సోదరుడు రితేశ్ ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యాక ముకేశ్ కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ స్విచ్చాఫ్ వస్తోందని ముకేశ్ అన్న యుకేశ్ డిసెంబర్ 25న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేయగా హత్య విషయం బయటికొచ్చింది.ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లో అరెస్ట్వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్‌చేసింది. హత్య జరిగిన జనవరి ఒకటో తేదీ నుంచి తప్పించుకు తిరుగుతున్న సురేశ్‌ను అతని డ్రైవర్‌కు చెందిన ఇంట్లో ఎట్టకేలకు అరెస్ట్చేశామని సిట్ ఇన్చార్జ్ పోలీసు అధికారి మయాంక్ గుర్జార్ సోమవారం వెల్లడించారు. సురేశ్‌ను బీజాపూర్‌కు తీసుకొచ్చామని, విచారణ కొనసాగుతోందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ చెప్పారు. నిందితులు రితేశ్, దినేశ్‌లు హతుడు ముకేశ్‌కు వరసకు సోదరులుకాగా మహేంద్ర రామ్‌టెకె సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గొడవపడి ఈ ముగ్గురూ చంపేశారని తెలుస్తోంది. తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి సిమెంట్‌తో కప్పేశారు.సొంత యూట్యూబ్ చానల్బీజాపూర్లో దాదాపు రూ.120 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయని ఎన్డీటీవీ టీవీఛానెల్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా చేసే 33 ఏళ్ల ముకేశ్ సొంతంగా ‘బస్తర్ జంక్షన్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను విజయవంతంగా నడుపుతున్నాడు. 2021లో బీజాపూర్‌లో తకల్గూడలో భద్రతాబలగాలపైకి మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. సీఆర్పీఎఫ్ జవాను, కోబ్రా కమాండర్ అయిన రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను బంధించి మావోలు తీసుకెళ్లగా చర్చలు జరిపే ఏప్రిల్‌లో విడిపించడంలో ముకేశ్ కీలకపాత్ర పోషించారు. ముకేశ్ మరణవార్త తెల్సి మహర్ వర్గీయులు సోమవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళులర్పించారు. నిందితులకు కఠిన శిక్ష అమలుచేయాలని డిమాండ్‌చేశారు. రాయ్‌పూర్ ప్రెస్‌క్లబ్‌లో వందలాది పాత్రికేయులు ధర్నాచేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సైతం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. కేసు వివరాలను నివేదిక ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని పీసీఐ ఛైర్పర్సన్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ ఆదేశించారు. ది ప్రెస్ అసోసియేషన్ అండ్ ది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సైతం పారదర్శక దర్యాప్తునకు డిమాండ్‌చేశాయి. -
ముకేశ్ ఖాతాలో నాలుగో స్వర్ణం
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో 11వ స్వర్ణ పతకం చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నెలవల్లి, రాజ్వర్ధన్ పాటిల్, హర్సిమర్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1722 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ముకేశ్, రాజ్వర్ధన్ 579 పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... హర్సిమర్ 564 పాయింట్లు సాధించాడు. ముకేశ్, రాజ్వర్ధన్ వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ పోటీపడ్డారు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజ్వర్ధన్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ముకేశ్ 10 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ ఈ టోరీ్నలో నిలకడగా రాణించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో భారత్ 11 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
Bihar: వీఐపీ అధినేత తండ్రి హత్య
బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు. ఈరోజు (మంగళవారం) ఉదయం దర్భంగా జిల్లాలోని బిరౌల్లోని ఆయన నివాసంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిపించారు. ఎస్డీపీఓ మనీష్ చంద్ర చౌదరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్య జరిగిన సమయంలో వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని ముంబైలోని తన కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన దర్భంగాకు బయలుదేరారు.మాజీ మంత్రి ముఖేష్ సాహ్నీకి ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ హత్య గురించి బీజేపీ నేత అజయ్ అలోక్ మాట్లాడుతూ జరిగిన ఘటన అత్యంత ఘోరమని అన్నారు. 72 గంటల్లో హంతకుడిని పట్టుకుంటామన్నారు. నేరాలను ఎలా అరికట్టాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. -
24 రోజుల్లోనే షూటింగ్.. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న చిత్రం!
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి వియస్ ముఖేశ్ దర్శకత్వం వహించారు. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భందా డైరెక్టర్ ముఖేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముకేశ్ మాట్లాడుతూ..'నేను వందకుపైగా షార్ట్ ఫిల్మ్స్ తీశా. మార్కెట్ మహాలక్ష్మి స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేశాం. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. పార్వతీశం నాకు మంచి స్నేహితుడు. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు. ఈ సినిమా ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించా. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గట్టిగా నమ్ముతున్నా' అని అన్నారు. షూటింగ్ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేశాం. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వల్ల త్వరగా షూటింగ్ పూర్తయింది. చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేశాం. పార్వతీశం, ప్రణీకాఅన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతనికి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నా. మాకు చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం' అని అన్నారు. -
హీరోగా ‘గుప్పెడంత మనసు’ రిషి సర్.. ఫోటోస్ వైరల్
-
ప్రేమలో గీతాశంకరం
ముఖేష్ గౌడ, ప్రియాంకా శర్మ జంటగా కె.దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ మాట్లాడుతూ– ‘‘సీరియల్స్‌లో పేరు సంపాదించుకున్నట్లే ఈ సినిమాతో వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడం నా లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘ఇరవై కథలు విన్నాం. కానీ రుద్ర చెప్పిన ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నెల 14న కొత్త షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు దేవానంద్. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు రుద్ర. ఈ చిత్రానికి సంగీతం: అబు, కెమెరా: ఉదయ్ ఆకుల. -
చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం కన్నుమూశారు. ఈ విషయం ఒకరోజు తర్వాత అంటే మంగళవారం బయటకొచ్చింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!) మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడంటే తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. గతంలో హిందీలో 'ప్రతిబంధ్', 'ద జెంటిల్‌మ్యాన్' సినిమాలు చేశారు. వీటితోపాటు తెలుగులో 'ఎస్పీ పరశురాం' చిత్రం చేశారు. వీటికి నిర్మాతగా వ్యవహరించింది ముకేశ్ ఉద్దేశినే. నిర్మాతగా పలు మూవీస్ తీసిన ఈయన.. ఆ తర్వాత కొన్నాళ్లకు లైన్ ప్రొడ్యూసర్ అయ్యారు. గో గోవా డాన్, ద విలన్, ద షౌకీన్స్, బ్రేక్ కే బాద్, సారీ భాయ్, కిడ్నాప్, ప్యార్ మైన్ ట్విస్ట్, చష్మే బద్దూర్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా చేశారు. గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన్ని ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారు. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశారు. కానీ ఇంతలోనే ఇలా ముకేశ్ చనిపోవడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) RIP #MukeshUdeshi Ji. Producer. A thorough gentleman. Kind. Very good company. Spent a lot of time with him in Mauritius. Huge loss to the industry. pic.twitter.com/xOnuH99Wqe — kunal kohli (@kunalkohli) September 12, 2023 -
ముఖేష్ ఉపాధ్యాయ కు పాలతో స్నానం
-
ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేష్
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి రాష్ట్ర ప్రభుత్వ సహకారం భేషుగ్గా ఉందని ఆ సంస్థ డైరెక్టర్, సీఈవో డాక్టర్ ముఖేశ్ త్రిపాఠి చెప్పారు. ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని వివరించినట్టు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఎయిమ్స్‌కు శాశ్వత నీటిసరఫరా పనులను ఈ ఏడాది జూలైలోగా పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినట్టు తెలిపారు. రహదారి సౌకర్యానికి సంబంధించి కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు లభించాయని, ఆర్అండ్బీ శాఖ రోడ్డు వేయడానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎయిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఎంవోయూ చేసుకున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద గత నవంబర్ నుంచి ఇప్పటివరకు 710 మంది రోగులు ఉచితంగా వైద్యసేవలు అందుకున్నారన్నారు. 2019 మార్చి 12వ తేదీన రోగుల సంరక్షణ సేవలు ప్రారంభించామని, ఈ నాలుగేళ్లలో 9,67,192 మంది ఓపీ, 7,477 మంది ఐపీ సేవలు అందుకున్నారని వివరించారు. ఇప్పటివరకు 2,590 మేజర్, 29,486 మైనర్ సర్జరీలు నిర్వహించామన్నారు. 37 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకోసం వైద్యుల నియామకం చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రోజకు సగటున 2,500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నట్టు చెప్పారు. ఇన్‌పెషంట్స్ కోసం 555 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం, పరీక్షలకు రూ.వంద ఖర్చవుతుంటే.. తమవద్ద రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. ఆస్పత్రిలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలవుతోందని ఈ క్రమంలో ప్రజలు ఆన్లైన్లో ఓపీడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో పారామెడికల్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రూ.1,680 కోట్లతో చేపట్టిన ఎయిమ్స్ ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయని ఆయన తెలిపారు. చికిత్స పొందిన పలువురు రోగులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తమకు వైద్యసేవల్లో ఎయిమ్స్ చూపుతున్న చొరవను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు ప్రశంసించారు. సంఘం తరఫున డైరెక్టర్, డీన్లకు జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ల ఎయిమ్స్ ప్రస్థానంపై రూపొందించిన బ్రోచర్‌ను డైరెక్టర్, డీన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జాయ్ ఎ ఘోషల్, డాక్టర్ శ్రీమంతకుమార్ దాస్, డాక్టర్ దీప్తి వేపకొమ్మ, డాక్టర్ వినీత్ థామస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకరన్, మీడియా సెల్ ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
నటుడికి విడాకులివ్వనున్న రెండో భార్య!
Methil Devika Divorce with Mukesh: పాపులర్ మలయాళ జంట ముఖేశ్, మెతిల్ దేవిక విడాకులు తీసుకోనున్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డ్యాన్సర్ దేవిక మీడియాముఖంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ముఖేశ్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపింది. పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొంది. అందుకే అతడితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యానని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల నేను, నా భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఈ విషయంలో ముఖేశ్ అభిప్రాయమేంటో నాకు తెలియదు. కానీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని రాద్దాంతం చేయకండి. నేను అతడి పరువు తీయాలనుకోవడం లేదు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించేంత అవసరం, ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలా అని నేనేమీ ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదు' అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విడాకులకు సంబంధించి తనకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని ముఖేశ్ పేర్కొన్నాడు. కాగా నటుడు, నాయకుడైన ముఖేశ్‌కు గతంలో నటి సరితతో పెళ్లైంది. అయితే ముఖేశ్ తాగుబోతు అని, పలువురు మహిళలతో అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలతో సరిత 2011లో భర్తకు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత 2013లో ముఖేశ్ డ్యాన్సర్ దేవికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ జంట కూడా ఇప్పుడు విడాకులకు సిద్ధమవుతుండటంతో అభిమానులు షాకవుతున్నారు. -
ప్రతీకారం తీరిందా?
మోహన్‌లాల్, నయనతార, ముఖేష్ ముఖ్య తారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘విస్మయతుంబతు’. నాగార్జునతో ‘కిల్లర్’ మూవీ తెరకెక్కించిన ఫాజిల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాని ఓం శ్రీ నమో లలితాంబ క్రియేషన్స్‌పై కె.కస్తూరి (లవ్లీ), సి.హెచ్. సరోజ గంగారామ్ తెలుగులో ‘మహాతంత్రం’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ‘‘మనుషుల్లో ఉన్న రాక్షసత్వాన్ని పోగొట్టడానికి, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి, ప్రియురాలిని కాపాడటం కోసం ఓ వ్యక్తి ఎలాంటి తంత్రం ఉపయోగించాడన్న కథతో తెరకెక్కిన చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్ అయినట్లుగానే తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి నిర్వహణ: కె.ఐశ్వర్య, చిరంజీవి, సమర్పణ: వర్మ. -
సుప్రీంను ఆశ్రయించిన ‘నిర్భయ’ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ హత్య కేసులో దోషిగా తేలిన ముకేశ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలని కోర్టును కోరాడు. ఈ కేసులో మే 5న నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో, ఆ తరువాత అప్పీల్ కోర్టులో తాను లేవనెత్తిన పలు విషయాలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదని అతడు తన తాజా పిటిషన్లో ఆరోపించాడు. -
మరో నటుడిని ప్రశ్నించనున్న పోలీసులు!
కొచ్చి: సంచలనం రేపిన ప్రముఖ మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మరో నటుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధం ఉన్న కేరళకు చెందిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముకేశ్‌ను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. నటిని అపహరించి.. కారులో లైంగిక వేధించిన ప్రధాన నిందితుడు పల్సర్ సుని గతంలో ముఖేశ్ డ్రైవర్ కావడం గమనార్హం. నటిపై అఘాయిత్యానికి కుట్ర పన్నిన సమయంలోనూ ముఖేశ్ డ్రైవర్‌గా పల్సన్ సుని పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. దిలీప్ సినిమా 'సౌండ్ థోమా' షూటింగ్ కొనసాగుతున్న సమయంలో ముఖేశ్ డ్రైవర్‌గా సుని ఉన్నాడు. 2013లో ఎర్నాకుళంలో జరిగిన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ సంఘం (అమ్మ) షోలోనూ ముఖేశ్ డ్రైవర్‌గా సుని హాజరయ్యాడు. ఈ వివరాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ముఖేశ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ కేసులో ప్రధాన కుట్రకు కారణంగా భావిస్తున్న నటుడు దిలీప్ సోదరుడు అనూప్‌ని కూడా మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నటుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. -
సింహం వదిలినా.. చట్టం వదల్లేదు!
సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముకేశ్‌కు జైలు హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహాన్ని రమ్మంటూ హల్చల్ చేసిన ముకేశ్‌కు కోర్టు శనివారం జైలు శిక్ష ఖరారు చేసింది. ఎర్రమంజిల్ కోర్టు న్యాయమూర్తి.. నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. వివరాలను దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బిహార్ ప్రాంతానికి చెందిన ముకేశ్(35) బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఈ ఏడాది మే 22న జూపార్కుకు వచ్చి సింహాల ఎన్క్లోజర్ను చూస్తూ మద్యం మత్తులో అందులోకి దూకాడు. జూ సిబ్బంది పాపయ్య, బషీర్, సింగ్, సారుు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శివలు చాకచాక్యంగా వ్యవహరిస్తూ సింహాల దృష్టి వేరే వైపు మళ్లించి ముకేశ్‌ను రక్షించారు. పోలీసులు ముఖేశ్‌పై ఐపీసీ 448, 38 సెక్షన్లతో పాటు అటవీ యాక్ట్ 1972 చట్టం కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న అతనికి న్యాయమూర్తి శనివారం శిక్ష ఖరారు చేశారు. -
రిలయన్స్ ముకేశ్ సంచలన వరాలు
-
రిలయన్స్ ముకేశ్ సంచలన వరాలు
ముంబై : టెలికాం కంపెనీలకు షాకిస్తూ ఇటీవలే రిలయన్స్ ఫ్యామిలీలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను ముకేశ్ అంబానీ వెల్లడించారు. గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన యూజర్లపై వరాల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు దేశంలో జియో సేవలను అందుబాటులోకి తెస్తున్నామంటూ ముకేశ్ ప్లాన్ వివరాలను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సర్వీసులను అంకితం చేయనున్నట్టు తెలిపారు. తమ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్ కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్‌గా రూపాంతరం చెందబోతోందన్నారు. ఈ క్రమంలో తమ జియో పాత్ర కీలకమనిచెప్పారు.వచ్చే ఏడాది లోగా దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. నెటవర్క్, మొబైల్స్, అప్లికేషన్స్ అనే మూడు పిల్లర్స్ గా తమకార్యకలాపాలను విస్తరించనుంది. ఆధార్ కార్డ్ కాపీ తీసుకొని వస్తే కేవలం పదిహేను నిమిషాల్లో సిమ్ కార్డ్ అందిస్తామన్నారు. రిలయన్స్ సంచలన జియో సేవలు సెప్టెంబర్ 5 న గా లాంచ్, డిశెంబర్ 31 కమర్షియల్ గా లాంచ్ కానున్నట్టు తెలిపారు. డిజిటల్ ఇండియాలో విద్యార్థులకు అదనంగా డాటా ను అందజేయనున్నామని వివరించిన ముకేశ్ , స్టూడెంట్ ఐడీ కార్డ్ ఉంటే మరో 25 శాతం డేటా ఉచితంగా అందిస్తామన్నారు. దేశంలో 2017 నాటికి 90శాతం గ్రామాలకు తమ సేవలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఉన్నామన్నారు. అత్యధిక క్వాలిటీ వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీలో లీడర్లుగా ఎదుగుతామనీ, పండుగ రోజుల్లో మెసేజ్ ల బ్లాకేజ్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. 5జీ 6 జీ దిశగా అడుగులు వేస్తున్నామన్నానీ, 5 పైసలకే ఒక ఎంబీ, రూ.50కే జీబీ డేటా సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. 300 పైగా ఛాన ల్స్ లైవ్ లో చూడొచ్చు. అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, ఉచితంగా 60 వేల మ్యూజిక్ వీడియోలు , పలు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పది ప్రధాన ప్లాన్లతో ముందుకు వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించారు. -
సాయ్ హాస్టల్‌కు టైటిల్
హైదరాబాద్: హైదరాబాద్ హాకీ కప్ టైటిల్‌ను సాయ్ హాస్టల్ గెలుచుకుంది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను సాయ్ హాస్టల్ డ్రాగా ముగించింది. తెలంగాణ పోలీస్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఇరుజట్లూ గోల్స్ చేయలేకపోయాయి. అయితే ఈ టోర్నీలో వరుస విజ యాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సాయ్ హాస్టల్ జట్టు విజేతగా నిలిచింది. మరో మ్యాచ్‌లో నవభారత్ క్లబ్ 7-3 తో రాయల్ క్లబ్‌పై విజయం సాధించి టోర్నీలో రన్నరప్‌గా నిలి చింది. నవభారత్ తరఫున అరవింద్ 3, రాహుల్ రాజ్ 2, మహేందర్ కిరణ్ 2 గోల్స్ చేయగా... రాయల్ క్లబ్ తరఫున రాజు 2, యశ్వంత్ ఒక గోల్ సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రెండు సార్లు ఆసియా గేమ్స్‌లో కాంస్య పతక విజేత నిధి, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్, రాష్ట్ర హాకీ సంఘం ఉపాధ్యక్షుడు కాశీ, టోర్నమెంట్ డెరైక్టర్ ఆల్ఫోన్స్ లాజరెస్ పాల్గొన్నారు. -
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే పై కేసు
కొల్లాం: ప్రముఖ నటుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ముఖేశ్‌పై కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ నేపధ్యంలో ఈ కేసుపై వివాదం చెలరేగింది. అయితే దీనిని ముఖేశ్ ఖండించారు. తాను నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ముఖేశ్ తన నియోజక వర్గానికి రావడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసును పొరపాటుగా నమోదు చేశామని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. కేసు నమోదు చేసే సమయంలో పోలీసులు అన్ని విషయాలు తెలుసుకోవాలని ముఖేశ్ వ్యాఖ్యానించారు. -
ఎక్కడో పుట్టి...
బీహార్‌కు చెందిన ముఖేష్ హౌరామెయిల్‌లో ప్రయాణిస్తూ ప్రమాద వశాత్తూ రైలునుంచి జారిపడి మృత్యువాత పడ్డాడు. అతని ముఖం ఛిద్రమై... కనీసం గుర్తుపట్టడానికి వీలుకాని పరిస్థితుల్లో ఉంది. అంతేనా.. ఆయన ఎక్కడివారో తెలియజేసే సమాచారం కూడా లభ్యం కాకపోవడంతో కన్నవారికి సమాచారం అందడంలేదు. ఇలాంటి కేసులు నిత్యం విజయనగరం రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. ఎక్కడో పుట్టి... ఎక్కడికో ప్రయాణిస్తూ... దురదృష్టవశాత్తూ ఎంతోమంది రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గుర్తించడానికి వీలుకాని పరిస్థితుల్లో ఉంటున్న వీరి ఆచూకీ లభించడం కష్టమవుతోంది. వీరికోసం వెదుకుతున్న కన్నవారికి కన్నీరే మిగులుతోంది. విజయనగరం క్రైం: రైలులో ప్రయాణిస్తూ ఎంతోమంది దురదృష్టవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. రైలు నుంచి జారిపడి మృతిచెందిన వారి ముఖాలు కొందరివి పూర్తిగా ఛిద్రమవ్వడం, వారి జేబుల్లో కనీసం వారికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా అనాథ శవాల్లా అంతిమసంస్కారం చేసేస్తున్నారు. ఈయన కోసం ఎదురుచూసే వారి తల్లిదండ్రులకు గర్భశోకమే మిగులుతోంది. మూడేళ్లలో గుర్తించలేని మృతదేహాలు 46 గడచిన మూడేళ్లలో రైలు ప్రమాదాల్లో మరణించిన 46మందిని గుర్తించలేకపోయారు. వీరు ఎక్కడున్నారో వారి తల్లిదండ్రులకు తెలియదు. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారనే వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు తప్ప ఇలా రైలు నుంచి జారిపడి మృతిచెందారని తెలియడంలేదు. సాధారణంగా మృతి చెందినవారి జేబుల్లో ఏవైనా ఆధారాలు లభ్యమైతే రైల్వే పోలీసులు సంబంధిత వ్యక్తులకు సమాచారం అందిస్తారు. అలా ఏమీ లభ్యం కానట్టయితే మృ తుల వద్దనున్న టిక్కెట్లు, ముఖాల ద్వారా ఆయా రైల్వే పోలీసులకు ఫొటోలను పంపిస్తారు. వారి ద్వారా ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తారు. కొన్నాళ్లపాటు ఎదురుచూసి ఎవరూ రానట్టయితే అంతిమసంస్కారం చేసేస్తారు. మృతుల్లో ఎక్కువమంది పరాయిరాష్ట్రం వారే... రైలునుంచి జారిపడి మృతిచెందిన వారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. ఒరిస్సా, బీహార్, చత్తీస్‌గఢ్, బెంగళూరు, హర్యానా ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా రైలు నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారి సమాచారం తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గానే మారుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ.. రైలు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని గుర్తించలేకపోయినవారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. రైలు తలుపుల పక్కన చల్లని గాలికోసం కూర్చుని నిద్రలోకి జారి ప్రమాదవశాత్తు పడి మృతిచెందుతున్నారు. గుర్తించని మృతదేహాల ఫొటోలను డీసీఆర్బీకి పంపిస్తాం. వారు అన్నీ పరిశీలిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైల్వే పోలీసు స్టేషన్‌కు సమాచారం అందిస్తాం - ఎస్.ఖగేశ్వరరావు, ఎస్ఐ రైల్వే పోలీసు స్టేషన్ -
హాయ్ డార్లింగ్ అంటూ...
హాయ్ డార్లింగ్ అంటూ సింహాలను పలకరిస్తున్నాడు ముఖేష్‌ను కాపాడేందుకు అరగంట శ్రమించా విలేకరులతో జూపార్క్ అనిమల్ కీపర్ పాపయ్య బహదూర్‌పురా: ‘హాయ్ డార్లింగ్.. అంటూ ముఖేష్ సింహాలను పలకరిస్తూ వాటివద్దకు వెళుతున్నాడు.. సింహాల దృష్టిని మళ్లించేం దుకు సింహాలకు సైగలు చేస్తూ పక్కకు వెళ్లాలంటూ సూచించా.. అప్పుడు వెనక్కి వెళ్లాయి’ అని వివరించాడు జూపార్క్‌లోని అనిమల్ కీపర్ పాపయ్య. మద్యం మత్తులో నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముఖేశ్‌ను ప్రాణాలతో రక్షిం చేందుకు అర గంట పాటు తీవ్రంగా శ్రమించామని పాపయ్య విలేకరులకు వివరించాడు. 4.50గంటలకు సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ముఖేశ్ దిగాడు. అదే సమయంలో ఆఫ్రికా సింహాల ఎన్‌క్లోజర్ పక్కనే ఉన్న ఏషియాటిక్ సింహాలకు ఆహరం అందించి ఎన్‌క్లోజర్‌లోకి పంపించి బయటికి వస్తున్నా.. ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దిగాడంటూ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఆఫ్రికన్ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దిగిన ముఖేశ్‌ను అక్కడికి వెళ్లవద్దంటూ వారించా.. అయినా వినకుండా నీటిలో ఈదుకుంటూ సింహాలు ఉన్న వైపు వెళ్లాడు. ఆ సమయంలో రెండు సింహాలు అతనికి నాలుగైదు అడుగుల దగ్గర వరకు వచ్చాయి. సింహాలను హాయ్ డార్లింగ్ అంటూ ముఖేశ్ పలకరిస్తున్నాడు. సింహాల దృష్టిని ముఖేశ్ వైపు నుంచి మళ్లించేందుకు సింహాలకు రాధ, కృష్ణ అంటూ సైగలు చేస్తూ పక్కకు వెళ్లాలని సూచించా.. అవి 20 అడుగుల వెనక్కి వెళ్లాయి. అయినా ముఖేశ్ సింహాల నీటి మోడ్‌లో నుంచి బయటికి వచ్చేందుకు ఇష్టపడలేదు. అతన్ని బయటికి రప్పించేందుకు ఓ దొడ్డు కర్రను లోనికి విసిరారు. వెనుకకు వెళ్లిన రెండు సింహాలు తిరిగి ముఖేశ్‌కు 3 అడుగుల దగ్గరికి వచ్చాయి. మళ్లీ గట్టిగా అరుస్తూ సింహాలను వెనక్కి వెళ్లాలంటూ సైగలు చేస్తూ కట్టెలతో దృష్టి మరలించి ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే విధంగా చేశాను. తరువాత అవి ఎన్‌క్లోజర్‌లో ఉంచిన ఆహారాన్ని చూసి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాయి. దీంతో చిర్రెత్తిన ముఖేశ్ అవేమీ చేయవంటూ నేను విసిరిన కర్రను తిరిగి నాపైనే విసిరాడు. తరువాత పొడవాటి దొడ్డు కర్రను సింహాల మోడ్‌లో పెట్టి దాన్ని పట్టుకోవాలని ఐదు నిమిషాల పాటు అభ్యర్థించారు. ఎట్టకేలకు దానిని పట్టుకోవడంతో నెమ్మదిగా బయటికి లాగి ముఖేశ్‌ను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చా అని వివరించాడు పాపయ్య. పన్నెండేళ్లుగా సేవలు.. పాపయ్య 12 సంవత్సరాలుగా ఈ సింహాల ఎన్‌క్లోజర్ వద్ద సేవలను అందిస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం జూపార్కుకు ఆ జత ఆఫ్రికా సింహాలను సౌదీ అరేబియా మహారాజు బహుమతిగా అందజేశారు. జూకు వచ్చినప్పుడు ఈ సింహాల వయస్సు మూడున్నర సంవత్సరాలే. ప్రస్తుతం ఈ సింహాలు దాదాపు 10 సంవత్సరాల వయస్సు గలవి. ఇదిలా ఉండగా పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి న ముఖేశ్ అనిమల్ కీపర్ పాపయ్య చొరవతో బతికి బయట పడటం జూ చరిత్రలోనే మొదటిసారి. 2009లో జూపార్కులో ఓ పులికి బన్ను తినిపించేందుకు ఓ వ్యక్తి ఇనుప జాలీల్లో నుంచి చేయి లోపలికి పెట్టాడు. దీంతో పులి బన్ను నాకుతున్నట్లు నటించి ఒక్కసారిగా చేయి మో చేతిని కొరికి వేసింది. ఈ సంఘటనలో చేయి కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల్లోనే మృతి చెందాడు. నెహ్రూ జూలాజికల్ పార్కులో తగినంత సిబ్బంది లేకపోవడం, అనిమల్ కీపర్లకు జూ ఉన్నతాధికారులు సమన్వయ లోపం కారణంగా అనేక విషయాలు బయటికి రాకుండా ఉండిపోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖేశ్‌కు రిమాండ్ బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోని దూకి హల్చల్ సృష్టించిన రాజస్థాన్‌కు చెందిన ముఖేశ్‌పై ఐపీసీ 448, వైల్డ్ లైఫ్ యాక్ట్ 38 సెక్షన్ల కింద బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేశ్‌పై సికింద్రాబాద్ రైల్వే జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. న్యాయమూర్తి సైతం ముఖేశ్‌ను మందలించారని పోలీసులు తెలిపారు. -
సింహంతో ఆటలాడబోయిన వ్యక్తికి రిమాండ్
హైదరాబాద్: నెహ్రూ జూపార్క్‌లో ఆదివారం సాయంత్రం సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి వాటికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన వ్యక్తిపై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 448 సెక్షన్‌తోపాటు అటవీ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎల్ అండ్‌టీ కంపెనీ ఉద్యోగి ముఖేష్ ఆదివారం స్నేహితులతో కలసి జూపార్క్‌కు రాగా మద్యం మత్తులో అతడు సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దిగిన విషయం తెలిసిందే. జూ సిబ్బంది అప్రమత్తమై అతడ్ని బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. -
సింహంతో షేక్ హ్యాండ్..!
- మద్యం మత్తులో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి - సింహాలకు దగ్గరగా వెళ్లి హాయ్ చెప్పిన ముఖేశ్ - నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఘటన - క్షేమంగా బయటికి తీసుకొచ్చిన జూ కీపర్లు..అరెస్ట్ చేసిన పోలీసులు - భార్యతో గొడవల వల్లే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకానన్న ముఖేశ్ హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 4.45 నిమిషాల సమయం.. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు.. ఆదివారం కావడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్న జూపార్కు.. ఇంతలో ఒక్కసారిగా కలకలం.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. సెక్యూరిటీ కళ్లుగప్పి ఎన్ క్లోజర్లోకి ప్రవేశించిన ఆ సందర్శకుడు సింహానికి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో జూ అధికారులతో పాటు సందర్శకులు ఉలిక్కిపడ్డారు. అయితే జూ అధికారులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మొత్తం మీద సాయంత్రం 4.45 గంటలకు ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన ముఖేశ్‌ను సాయంత్రం 5.15 గంటలకు బయటికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ముఖేశ్(35) ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం జూపార్కు సందర్శనకు ముఖేశ్ వచ్చాడు. సాయంత్రం 4.45 గంటలకు సింహాల ఎన్‌క్లోజర్ వద్దకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారించడంతో కొంతసేపు అక్కడే తచ్చాడాడు. ఇంతలో సందర్శకులు ఎక్కువ మంది ఎన్‌క్లోజర్ వద్దకు పోటెత్తారు. అదే సమయంలో ముఖేశ్ ఒక్కసారిగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. ఎన్‌క్లోజర్‌లోని నీటి మోడ్‌లో ఈదుకుంటూ సింహాలు ఉన్న వైపు వెళ్లి హాయ్ అంటూ పలకరించాడు. అతడిని చూసి ఒక సింహం వెనకడుగు వేయగా.. మరో సింహం అతడిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న జూ కీపర్లు పాపయ్య, బషీర్ సింహాల దృష్టిని మళ్లించి.. సింహాలను ఎన్‌క్లోజర్ గేట్ లోపలికి తీసుకువెళ్లారు. పొడవాటి చెక్కను ఎన్‌క్లోజర్‌లోకి పెట్టి ముఖేశ్‌ను సురక్షితంగా బయటికి రప్పించారు. అనంతరం ముఖేశ్‌ను అదుపులోకి తీసుకున్న జూ అధికారులు అతడిని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ముఖే శ్ ఎన్‌క్లోజర్‌లోకి దూకే సమయానికి మద్యం సేవించి ఉన్నాడని అధికారులు తెలిపారు. ముఖేశ్‌పై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భార్యతో ఉన్న చిన్నచిన్న గొడవల వల్లే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకానని ముఖేశ్ పేర్కొన ్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇలా.. గతంలో కూడా జూపార్కులో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఓ సందర్శకుడు పులికి బన్ను తినిపించేందుకు ప్రయత్నించగా.. అతడి చేతిని పులి కొరికేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ వారం తర్వాత మృతిచెందాడు. జూపార్క్‌లోని పులుల ఎన్‌క్లోజర్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ల ఎత్తు తక్కువ గా ఉండడంతో ఓ పులి బయటికి వచ్చింది. పులికి మత్తు మందు ఇచ్చి సురక్షితంగా జూలోకి పంపించారు. ఈ ఘటన తర్వాత రెయిలింగ్ ఎత్తును పెంచారే తప్ప.. సెక్యూరిటీ గార్డ్లను ఏర్పాటు చేయలేదు. జూలో క్రూర మృగాల ఎన్క్లోజర్ల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉన్నా.. జూ అధికారులు గాలికి వదిలేసి నాలుగైదు ఎన్క్లోజర్లకు కలపి ఒక గార్డును ఏర్పాటు చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అదే విధంగా గతంలో ఢిల్లీ జూలో ఓ సందర్శకుడు పులి పంజా బారిన పడి దుర్మరణం చెందిన విషయం విదితమే. -
పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఓ మందబాబు హల్చల్ చేశాడు. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం జూ పార్క్ సందర్శనకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఒక్కసారిగా పులి ఇంక్లోజర్లోనికి దూకేశాడు. అదృష్టవశాత్తు పులి అతన్ని గమనించలేదు. ఇంతలో సందర్శకుల అరుపులు, కేకలతో పులి డెన్లోనికి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన జూలాజికల్ పార్క్ అధికారులు సమయస్ఫూర్తితో పులులను డెన్లోకి తీసుకువెళ్లారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో జూకు వచ్చిన సందర్శకులు ఈ పరిమాణంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. జూ అధికారులు అతన్ని అదుపులోకి స్థానిక పోలీసులకు అప్పగించారు. బతుకు దెరువు కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. సందర్శకుడు సురక్షితంగా బయటపడడంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంత పని చేశావు తల్లీ?
గుత్తి(అనంతపురం): వారిద్దరు. వారికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. చిన్ని కుటుంబం. చింతల్లేకుండా సాగిపోతోంది. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి మరో మహిళ దెయ్యంలా ప్రవేశించింది. వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ఆమె భర్తను తనవైపు తిప్పుకుని ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను అతను నిర్లక్ష్యం చేసేలా చేసింది. తమ వైవాహిక జీవితంలో ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ఆమె నాలుగేళ్ల కిందట ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత భర్తను మార్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇక ఈ జీవితం వద్దనుకుందా ఇల్లాలు. తనతో పాటే తన ఇద్దరూ బిడ్డలనూ తీసుకెళ్లింది. గుత్తిలో మంగళవారం జరిగిన ఈ విషాద సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గుత్తికి చెందిన రఘుబాబు భార్య నేత్రావతి(28) తన ఇద్దరు కుమారులైన మురారి(6), ముఖేశ్(4)ను ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసి చంపేసింది. ఆ తరువాత తానూ ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. బెంగళూరుకు చెందిన నేత్రావతి వివాహం గుత్తి మున్సిపల్ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రఘుబాబుతో ఎనిమిదేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు మగపిల్లలు. వివాహేతర సంబంధం వద్దన్నా... హాయిగా సాగిపోతున్న నేత్రావతి, రఘుబాబు జీవితంలోకి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓ మహిళ ప్రవేశించింది. ఈ విషయం తన చెవిలో పడినా నేత్రావతి నమ్మలేకపోయింది. భర్త కదలికలపై నిఘా పెట్టింది. చివరకు తన భర్త అసలు రూపం తెలుసుకుంది. వివాహేతర సంబంధం మంచిది కాదని, తనతో పాటు పిల్లలను బాగా చూసుకోవాలని భర్తను కోరింది. అతనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆ కామాంధుడు మారలేకపోయాడు. భార్యా పిల్లలకంటే ఉంపుడుగత్తే తనకు ప్రధానంగా భావించాడు. ఇక ఇలాగైతే కుదరదునుకున్న నేత్రావతి నేరుగా భర్తను నిలదీసింది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు ప్రారంభమయ్యాయి. ‘నువ్వు మారకపోతే పిల్లలను చంపి, నేనూ చస్తా’నంటూ ఆమె హెచ్చరించింది. దాన్ని అతను తేలిగ్గా తీసుకున్నాడు. ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా అతనిలో మార్పు రాలేదు. మొదట పిల్లలకు ఉరేసి.. ఇంట్లోనే ఫ్యాన్‌కు రెండు చున్నీలు వేసిన నేత్రావతి, వాటి సహాయంతో కుమారులు మురారి, ముఖేశ్‌కు ఉరివేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఊయల కోసం వేసిన ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికొచ్చిన రఘుబాబు తలుపులు వేసి ఉండటంతో భార్యను పిలిచాడు. ఎంతసేపైనా పలకలేదు. అనుమానంతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా భార్య, పిల్లలు ఫ్యాన్‌కు వేలాడుతుండటం గమనించి గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని కిందకు దింపారు. అప్పటికే ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ప్రాణం ఉందేమోనని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మరణించినట్లు నిర్ధారించారు. మురారి గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్ పాఠశాలలో ఒకటో తరగతి, ముఖేశ్ చందమామ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కేసు నుంచి బయటపడేందుకు భర్త రఘుబాబు పోలీసులకు మరోలా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన భార్య బెంగళూరులో కాపురం పెట్టాలని తరచూ తనతో గొడవ పడుతోందని అందులో పేర్కొన్నాడు. అందుకు తాను అంగీకరించకపోవడంతో ఇలా చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికుల మృతి
అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూమకుంట వద్ద బుధవారం మధ్యాహ్నం కారు ఢీకొని ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తూమకుంట పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు ముఖేశ్, బిలాల్ బైక్‌పై వెళుతూ డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయారు. అదే సమయంలో వచ్చిన కారు వారిని ఢీకొనగా ఇద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెందారు. హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రపంచ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు..!
♦ ముకేశ్, ప్రేమ్‌జీ, దిలీప్ సంఘ్వీలకు చోటు ♦ 50 మందితో వెల్త్ ఎక్స్ జాబితా విడుదల న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితాలో ముగ్గురు భారతీయులు స్థానం పొందారు. వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ, సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ ఉన్నారు. వెల్త్ఎక్స్ టాప్-50 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్ల సంపదతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 16.5 బిలియన్ డాలర్ల సంపదతో 43వ స్థానంలో, సన్ ఫార్మా అధిపతి దిలీప్ సంఘ్వీ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో 44వ స్థానంలో ఉన్నారు. టాప్-50 ధనవంతుల మొత్తం సంపద 1.45 ట్రిలియన్ డాలర్లు. ఇది ఆస్ట్రేలియా జీడీపీతో సమానం. వెల్త్ఎక్స్ సంపన్నుల జాబితాలో 29 మంది అమెరికన్లు, నలుగురు ైచె నీయులు, ముగ్గురు భారతీయులు ఉన్నారు. అలాగే ఈ సంపన్నుల్లో టెక్నాలజీ రంగానికి చెందిన వారే అధికంగా (12 మంది) ఉండటం గమనార్హం. టాప్-50 బిలియనీర్లలో అత్యంత పిన్న వయస్కుడు ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (31 ఏళ్లు). ఈయన 42.8 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నలుగురు మహిళలు స్థానం పొందారు. -
లాలాగూడలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మొబైల్ చోరీ కేసులో గురువారం ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్ యాదవ్ స్నేహితుడు ముఖేష్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల వేధింపులు తాళలేకే ముఖేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుశీల్ అనే స్నేహితుడు ఇచ్చిన పార్టీకి తరుణ్ యాదవ్, ముఖేష్‌లు హజరయ్యారు. ఆ సమయంలో సుశీల్ ట్యాబ్ పోయింది. ఈ నేపథ్యంలో సుశీల్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ క్రమంలో తన అనుమానం తరుణ్, ముఖేష్‌లపై ఉన్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించారు. ఆ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన తరుణ్ గురువారం ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే శుక్రవారం ముఖేశ్ శుక్రవారం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. -
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
-
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
హైదరాబాద్: సెక్రటేరియట్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్‌లో జరుగుతున్న మరమ్మతుల్లో గురువారం చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్‌లో రంగులు వేస్తున్న పెయింటర్ ముఖేశ్ ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి సెక్రటేరియట్‌లోని వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ముఖేశ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. -
అమ్మో.. ఆ పాప అల్లరి గడుగ్గాయి
ముంబయి: బజరంగి భాయీజాన్ చిత్రంలో నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా అలాంటి ఇలాంటి పాప కాదంట. బాగా అల్లరి గడుగ్గాయట. ఒక్కచోట కూర్చునేది కాదని, నిశ్శబ్దంగా ఉండటం తనకు అస్సలు నచ్చదని ఆమెకు దుస్తుల అలంకరణ చేసిన ముఖేశ్ చెప్పినట్లు హర్షాలీ తల్లి కాజల్ మల్హోత్రా తెలిపింది. ఎంత చెబుతున్నా.. వినకుండా తనకు నచ్చిన పనే చేస్తూ అల్లరితో ఆగమాగం చేసేదని ముఖేశ్ చెప్పేవాడని ఆమె వివరించింది. బజరంగీ భాయీజాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ పక్కన నటించిన ఈ పాప సినిమా చూసిన వారందరి హృదయాలను తన నటనతో కదిలించింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కంటతడి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాప గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ముఖేశ్ పంచుకున్నాడు. ఆ పాప ఎంత అల్లరి చేస్తున్నా చిరాకు అనిపించకుండా ముచ్చటేసేదట, తన ఎనర్జీ చూసి ఔరా అనిపించేదట. ప్రతిసారి అటూఇటూ గెంతులుపెడుతుంటే ఒక్క సల్మాన్ మాత్రమే ఆ పాపను ఆడించి మిగితావారి మాట కూడా వినాలని, కుదురుగా ఉండాలని చెప్పి బుజ్జగిస్తుండేవాడట. -
పుట్టెంట్రుకలు ఇవ్వకనే ..
కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకోవాలని వెళుతున్న ఓ కుటుంబంలోని ఇద్దరిని మృత్యువు కాటేసింది. పిల్లాడి పుట్టెంట్రుకలు స్వామికి ఇవ్వాలనుకున్న ఆ కుటుంబం కోరిక నెరవేరనేలేదు. రెండేళ్ల బాలుడిని ఆర్టీసీ బస్సు బలితీసుకుంది. ఆ చిన్నారి తల్లినీ పొట్టనపెట్టుకుంది. అగరంపల్లె వద్ద శుక్రవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే... తల్లి ఇంకొంతసేపటికే మృతిచెందింది. తండ్రీకొడుకు గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. ఐరాల/చిత్తూరుఅర్బన్: మండలంలోని అగరంపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి,కొడుకు మృతిచెందారు. కాణిపాకం ఎస్ఐ మురళి కథనం మేరకు గుడిపాల మండలం రామభద్రాపురం గ్రామానికి చెందిన మురళి(35),భవిత(30), వారి కుమార్తె డింపుల్, కుమారుడు ముఖేష్(2) ద్విచక్రవాహనంపై కాణిపాకం ఆలయానికి బయలుదేరారు. అగరంపల్లె టోల్‌గేటు వద్ద మలుపు తిరుగుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భవిత తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతిచెందింది. మురళి,డింపుల్‌ను వైద్యనిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆస్పత్రిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు కాణిపాకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుం బీకులు, బంధువులతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగ ణం నిండిపోయింది. తల్లీకొడుకు భవిత, ముఖేష్ మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. తమ్ముడు కొత్త ఆటో కొనడంతో దానికి పూజలు చేసి, పిల్లాడి తలవెంట్రుకలు స్వామికి ఇవ్వడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని మురళి పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఆవరణలో చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించింది. -
నిర్భయా?నిర్ధయా?
-
మహిళపై గ్యాంగ్‌రేప్.. ఆపై అమ్మకం
రేవారి:హర్యానాలోని రేవరి జిల్లాలో 25 ఏళ్ల మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడటమే కాకుండా ఆమెను అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. బాధితురాలు కొద్దిరోజుల క్రితం ఓ రైల్వే స్టేషన్లో ముఖేష్ అనే ట్రక్ డ్రైవర్‌ను కలిసింది. అతను ఆమెను తన గ్రామమైన ఖిజురీకి తీసుకెళ్లి డిసెంబర్ 10న అతని సోదరుడు, అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె కుమారుడిని పీకనొక్కి చంపేశారు. ఆపై సూరజ్ భాన్ సైనీ వ్యక్తి సహాయంతో ఆమెను సందీప్ అనే వ్యక్తికి రూ. 40 వేలకు అమ్మేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముఖేష్ ను అతని సోదరుడు సతీష్, అతని ఇద్దరు అనుచరులు జైపాల్, హవాసింగ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
‘ప్రోత్సాహకాల' కమిటీ ఏర్పాటు
ముకేశ్, ఆరిఫ్‌లకు చోటు సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జాకు రూ. 2 కోట్లు...గగన్ నారంగ్‌కు రూ. 90 లక్షలు...మరో ప్లేయర్‌కు రూ. 50 లక్షలు... ఇలా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పలువురు క్రీడాకారులకు ‘మనసు విప్పి’ అందజేసిన నజరానాలు. ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు అందించడంలో నిబంధనలకు విరుద్ధంగా, ఇచ్ఛానుసారం వ్యవహరించిందని ప్రభుత్వంపై క్రీడా వర్గాలనుంచే విమర్శలు వచ్చాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా స్పష్టమైన విధానం రూపొందించి, ప్రదర్శనకు తగ్గ ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 10 మంది సభ్యులతో నగదు ప్రోత్సాహకాల కమిటీని ఏర్పాటు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఎండీ లవ్ అగర్వాల్ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లోగా తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి మెగా ఈవెంట్లు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, ఇన్విటేషన్ టోర్నీల మధ్య స్పష్టమైన తేడా చూపిస్తూ ప్రాధాన్యతాక్రమాలు తెలియజేసే అవకాశం ఉంది. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, ద్రోణాచార్య ఆరిఫ్‌లతో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధి, వివిధ క్రీడల కోచ్‌లు, అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఐదుగురిపై ఆరోపణలు ‘ఎంసెట్’ మెడికల్ కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్ కోటా ప్రవేశాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఐదుగురు స్పోర్ట్స్ అథారిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో ముగ్గురు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర స్పోర్ట్స్ అథారిటీకి చెందినవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ‘శాట్స్’ ఎండీ భావిస్తున్నారు. అందులో భాగంగా వీరికి చార్జ్ మెమో జారీ చేశారు. పది రోజుల్లో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోతే వీరిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ‘శాప్’ ఎండీ అందుబాటులో లేకపోవడంతో మిగతా ఇద్దరు అధికారులకు ఇంకా నోటీసులు అందలేదు. అయితే వారిపై కూడా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. -
శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న ముఖేష్ క్షేమం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థి ముఖేష్ సురక్షితంగా ఉన్నాడు. కాలేజీ క్యాంపస్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో కొట్టుకుపోయిన ముఖేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందించాడు. కాగా నిరాశ్రయుడు కావడంతో తన దగ్గర డబ్బులు లేవని, సాయం చేయాల్సిందిగా ముఖేష్ ప్రభుత్వాన్ని కోరాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నాడు. జమ్మూకాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఎన్ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ముఖేష్ వరదల్లో చిక్కుకుపోవడంతో సహ విద్యార్థులతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అతను సురక్షితంగా ఉన్నాడని సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. -
ప్రతి కుటుంబానికి రెండు ఖాతాలు
ఆగస్టు 15 నుంచి కొత్త పథకం అమలు బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ ముఖేష్ సాక్షి, సిటీబ్యూరో: వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా నగరంలోని ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. రెండు ఖాతాల్లో ఒకటి కుటుంబ పెద్దకు, మరొకటి తప్పనిసరిగా మహిళకు ఉండాలన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంపూర్ ్ణ విత్తియే సమావేశన్(ఎస్వీఎస్) పేరిట ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలులోకి రానుందని, ఈలోగా క్షేత్రస్థాయిలో అవసరమైన పనులు పూర్తి చేయాలని బ్యాంక ర్లను కోరారు. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని, సొమ్ము జమ చేయాలని ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులు వస్తే సదరు బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన కలెక్టర్ హెచ్చరించారు. సబ్సిడీ రుణాలు ఇచ్చేయండి వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం వివిధ సంక్షేమ శాఖలు విడుదల చేసిన సబ్సిడీ మేరకు ఆగస్టు 15లోగా లబ్ధిదారులకు రుణాల మంజూరును పూర్తి చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. సబ్సిడీ విడుదల కాని సంక్షేమ రుణాల కోసం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. యువజన సంక్షేమ విభాగం యాక్షన్ ప్లాన్ మేరకు 908 మందికి త్వరితగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీవైడబ్ల్యూఓను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిధిలో గత ఏడాది మంజూరైన రుణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కోరారు. గురువారం పదవీ విరమణ చేయనున్న ఎల్డీఎం భరత్‌కుమార్‌ను కలెక్టర్ మీనాతో పాటు పలు సంక్షేమ శాఖల అధికారులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఈడీలు సత్యనారాయణ, ఖాజా నిజామ్ అలీ, అక్రమ్ అలీ తదితరులు పాల్గొన్నారు. రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే.. స్వయం సహాయక సంఘాల మహిళలను బ్యాంకర్లు నిరుత్సాహ పరుస్తున్నారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ఇతర జిల్లాల్లో గ్రామీణ పొదుపు సంఘాలకు మూడో లింకేజీ కింద రూ.5 ల క్షల చొప్పున రుణాలు ఇస్తుంటే, నగరంలో మాత్రం కేవలం రూ.2 లేదా రూ.3 లక్షలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పొదుపు సంఘాల మహిళల పట్ల వివక్ష కనబరచడం సరికాదన్నారు. వెంటనే రూ.5 లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని కోరారు. -
సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్
కాలుష్య రహితం.. ఇసుక అవసరం లేదు.. అతి తక్కువ ఖర్చు రాయగడ (ఒడిశా): ఇసుక అవసరం లేదు.. కాలుష్యానికి తావులేదు.. అతి తక్కువ నీటి వినియోగం, తక్కువ వ్యయంతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వేదాంత గ్రూప్ కంపెనీ సెసా స్టెరిలైట్ శ్రీకారం చుట్టింది. పరిశోధనలు ముగించుకుని మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న గ్రీన్ సిమెంట్ గురించి సెసా స్టెరిలైట్ సంస్థ సీఈవో డాక్టర్ ముకేశ్ కుమార్ వినియోగం గురించి వివరించారు. రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో గల లంజిగడలోని సెసా స్టెరిలైట్ కంపెనీ ఐఎంఎంటీ, భువనేశ్వర్ సాంకేతిక సహకారంతో గ్రీన్ సిమెంట్‌కు రూపకల్పన చేసింది. దీని తయారీకి ఇనుము తయారీ కంపెనీల్లో వృథాగా ఉండే రెడ్‌మార్ట్ మెటీరియల్ తో పాటు పలు కంపెనీల్లో నిరర్థక పదార్థమైన బూడిదను వినియోగించారు. ఇందులో 90 శాతం బూడిద, ఒక శాతం సున్నం, మూడు శాతం కెమికల్ ఉన్నాయని ముకేశ్ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ కాంక్రీట్ పనుల్లో 21 రోజులు వాటరింగ్ చేస్తుండగా, గ్రీన్సిమెంట్తో చేపట్టే కాంక్రీట్ పనులకు ఒక్కసారి మాత్రమే నీటిని వినియోగిస్తారు. దీని వినియోగంలో నీరు వృథా కాదని తెలిపారు. సాధారణ సిమెంట్ కన్నా 30 శాతం ఖర్చు తక్కువని తెలిపారు. దీని వినియోగానికి ఇసుక అవసరం లేదని చెప్పారు. మరో 8 నెలల్లో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ముకేశ్ తెలిపారు. -
2013.. ఓ ప్రేమ కథ
-
2013.. ఓ ప్రేమ కథ
2013 జనవరి, అమెరికాలోని కాలిఫోర్నియా.. ఆడ్రియానా పెరాల్. ఆమె లైఫ్ స్టైలే వేరు. బికినీలు, హైహీల్స్.. రోజూ పార్టీలు, వైన్, విస్కీ.. తాగి తూగడం.. పొద్దున్నే జిమ్.. అంతా హైఫై. సీన్.. కట్ చేస్తే... 2014 జనవరి, హర్యానాలోని పాప్‌రాన్ గ్రామం.. ఆడ్రియానా పెరాల్. చుడీదార్, నెత్తిన కొంగు, నుదుటన సింధూరం.. పిడకల పొయ్యి మీద వంట వండుతోంది.. గేదెలను పీచుతో తోముతోంది.. అంట్లు తోముతోంది.. ఇళ్లూడుస్తోంది.. ఇక్కడ పార్టీలు లేవు. టాయిలెట్‌కు పోవాలన్నా బయటకు వెళ్లాల్సిందే.. షవర్ సంగతి సరేసరి.. స్నానానికి గేదెలకు, మనుషులకు ఒకటే బకెట్! ఏమిటీ మాయ.. అవును. ప్రేమ చేసిన మాయ. ఆడ్రియానా ప్రేమలో పడింది. అన్నీ వదిలొచ్చేసింది.. సంతోషంగా.. చిత్రంలో కనిపిస్తున్న ఆడ్రియానా, ముకేష్‌కుమార్‌ల ప్రేమ కథలోకి వెళ్తే.. 2013 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాకు చెందిన ఆడ్రియానా(40)కు ముకేష్(24) ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు చాట్ చేసుకున్నారు. ఒక్కరోజు హఠాత్తుగా ముకేష్ ఆడ్రియానాకు ఫోన్ చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆడ్రియానా నవ్వేసింది. ఏమిటీ పిచ్చిమాటలు నీ వయసెంత.. నా వయసెంత అంది. నాకు నీ వయసు కూతురుందని చెప్పింది. ముకేష్ ఒప్పుకోలేదు. కొన్ని రోజులుగా ఇదే తీరు. ఆడ్రియానా ఆలోచనలో పడింది. తర్వాత ఇద్దరూ ఇన్ లవ్. ఆడ్రియానా ముకేష్ కోసం కాలిఫోర్నియాను వదిలి భారత్‌కు వచ్చేద్దామని గతేడాది ఆగస్టులో డిసైడైంది. ఇంట్లో వాళ్లు వారించారు. కూతురైతే.. మహిళలకు భారత్ సురక్షితమైన ప్రదేశం కాదని చెప్పింది. ముకేష్ ఆన్లైన్ మోసగాడని వారించింది. ఆడ్రియానా ముకేష్‌ను నమ్మింది. వచ్చేసింది. ఎయిర్‌పోర్టులో దిగగానే ముకేష్. నేరుగా పాప్‌రాన్ గ్రామానికి.. నవంబర్‌లో సంప్రదాయరీతిలో వివాహం. అమెరికా లైఫ్‌స్టైల్‌కి.. ఇక్కడి జీవనశైలికి ఎంతో తేడా. అయితేనేం.. అలవాటుపడిపోయింది.. హిందీ మాట్లాడటం నేర్చుకుంటోంది. బట్లర్ ఇంగ్లిష్ మాట్లాడే భర్తకు ఇంగ్లిష్ నేర్పిస్తోంది. సాగులో సాయమూ చేస్తోంది. ఇక ఆడ్రియానా అత్తగారైతే.. ఆమెపై ప్రశంసలే ప్రశంసలు. -
సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేశారు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించిన నలుగురిలో ఇద్దరు పోలీసులు తమను ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని హైకోర్టులో తెలిపారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దోషులు ముఖేశ్, పవన్‌కుమార్ గుప్తాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభారాణిలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దోషుల తరఫు న్యాయవాది ఎంఎల్ శర్మ తన క్లయింట్లను పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు లేకుం డానే అరెస్టు చేశారని ధర్మాసనానికి తెలిపారు. కేవలం మీడియా వార్తల ఆధారంగా ముఖేశ్, పవన్ కుమార్ గుప్తాలను పోలీసులు అరెస్టు చేశారని, కీలక ముద్దాయి రాంసింగ్ సోదరుడైన ముఖేశ్‌ను రాజస్థాన్‌లోని ఓ గ్రామం నుంచి సంఘటన జరిగిన మరుసటి రోజు అరెస్టు చేశారని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. పోలీసులు తన కక్షిదారులను హింసించడమే కాకుండా వారికి ఉచిత న్యాయ సహాయం అందించలేదని ఆరోపించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తరువాత కూడా నిందితులకు పోలీసులు న్యాయసహాయం ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఓ బాలుడితో సహా ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాంసింగ్ తరువాత తీహార్ జైలులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు’’ అని ధర్మాసనానికి వివరించాడు. సెప్టెంబర్ 13న ఈ కేసులో ట్రయల్ కోర్టు ముఖేశ్, పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్‌లకు మరణశిక్ష విధించింది. మరణశిక్షలను ధ్రువీకరించాల్సిందిగా ట్రయల్ కోర్టు కేసును హైకోర్టుకు దాఖలు పర్చింది. -
సరిత... నేను చట్టబద్ధంగా విడిపోయాం
‘మేం చట్టబద్ధంగా విడిపోయాం’ అంటున్నారు నటి సరిత భర్త ముఖేష్. వివాహ రద్దు జరగకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటారని నటి సరిత, తన భర్త ముఖేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. నటి సరిత ఆరోపణల్ని ఖండించిన ముఖేష్, ఆమె ఆరోపణలు సత్యదూరం అన్నారు. తాము చట్టబద్ధ్దంగా విడిపోయామని, ఆ ఆధారాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించిన తర్వాతనే తాను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తగిన ఆధారాలు, డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించకుంటే రెండో వివాహానికి రిజిస్ట్రార్ అనుమతించేవారా అంటూ ముఖేష్ ప్రశ్నించారు.