లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
హైదరాబాద్ : లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మొబైల్ చోరీ కేసులో గురువారం ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్ యాదవ్ స్నేహితుడు ముఖేష్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయితే పోలీసుల వేధింపులు తాళలేకే ముఖేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుశీల్ అనే స్నేహితుడు ఇచ్చిన పార్టీకి తరుణ్ యాదవ్, ముఖేష్లు హజరయ్యారు. ఆ సమయంలో సుశీల్ ట్యాబ్ పోయింది. ఈ నేపథ్యంలో సుశీల్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆ క్రమంలో తన అనుమానం తరుణ్, ముఖేష్లపై ఉన్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఆ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన తరుణ్ గురువారం ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే శుక్రవారం ముఖేశ్ శుక్రవారం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు.