లిమా (పెరూ): ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్ ఖాతాలో 11వ స్వర్ణ పతకం చేరింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నెలవల్లి, రాజ్‌వర్ధన్ పాటిల్, హర్‌సిమర్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 1722 పాయింట్లతో పసిడి పతకాన్ని దక్కించుకుంది. ముకేశ్, రాజ్‌వర్ధన్ 579 పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... హర్‌సిమర్ 564 పాయింట్లు సాధించాడు.
ముకేశ్, రాజ్‌వర్ధన్ వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ పోటీపడ్డారు. ఆరుగురి మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజ్‌వర్ధన్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా... ముకేశ్ 10 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ ఈ టోరీ్నలో నిలకడగా రాణించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో భారత్ 11 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment