24 రోజుల్లోనే షూటింగ్‌.. రియల్‌ స్టోరీ ఆధారంగా వస్తోన్న చిత్రం! | Market Mahalakshmi Movie Releasing Worldwide In Theaters On April 19th | Sakshi
Sakshi News home page

Market Mahalakshmi Movie: రియల్‌ స్టోరీ ఆధారంగా వస్తోన్న 'మార్కెట్ మహాలక్ష్మి'!

Published Tue, Apr 16 2024 9:00 PM | Last Updated on Wed, Apr 17 2024 9:21 AM

Market Mahalakshmi Movie is releasing worldwide in theaters on April 19th - Sakshi

కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి  వియస్ ముఖేశ్  దర్శకత్వం వహించారు. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో  బిజీగా ఉంది. ఈ సందర్భందా డైరెక్టర్‌ ముఖేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ముకేశ్ మాట్లాడుతూ..'నేను వందకుపైగా షార్ట్ ఫిల్మ్స్ తీశా. మార్కెట్ మహాలక్ష్మి స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేశాం. ఆ కొత్త పాయింట్   అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. పార్వతీశం నాకు మంచి స్నేహితుడు. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు. ఈ సినిమా ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించా. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గట్టిగా నమ్ముతున్నా' అని అన్నారు.

షూటింగ్ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేశాం. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వల్ల త్వరగా షూటింగ్ పూర్తయింది. చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేశాం. పార్వతీశం, ప్రణీకాఅన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతనికి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నా. మాకు చాలా ఓటీటీ ఆఫర్‌లు వచ్చాయి. కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement