Market Mahalakshmi Movie
-
ఓటీటీలోకి యూత్‌ను మెప్పించిన 'మార్కెట్ మహాలక్ష్మీ' సినిమా
'కేరింత'ఫేమ్ పార్వతీశం హీరోగా నటించిన తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మీ. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయమయింది. బి2పి స్టూడియోస్ ద్వారా అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలలో మెప్పించారు. థియేటర్లో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.చిన్న సినిమాగా వచ్చిన మార్కెట్ మహాలక్ష్మీ థియటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్‌కు మొదటి సినిమానే అయినా కూడా తన నటనతో యూత్‌ను ఆకట్టుకుందని ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ ఆహాలో జులై 4న స్ట్రీమింగ్ కానుందని ఆ సంస్థ ప్రకటించింది.సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో పార్వతీశం, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే పాత్రలో ప్రణీకాన్వికా తమ నటనతో మెప్పించారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..? కుమారుడి వల్ల కట్నం వస్తుందని ఆశించిన తండ్రిని ఎలా మెప్పించాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి పార్వతీశం ఎలాంటి స్కెచ్ వేశాడు..? వంటి అంశాలు బాగా కనెక్ట్ అవుతాయి. మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్‌తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్‌గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్‌గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
24 రోజుల్లోనే షూటింగ్.. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న చిత్రం!
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి వియస్ ముఖేశ్ దర్శకత్వం వహించారు. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భందా డైరెక్టర్ ముఖేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముకేశ్ మాట్లాడుతూ..'నేను వందకుపైగా షార్ట్ ఫిల్మ్స్ తీశా. మార్కెట్ మహాలక్ష్మి స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేశాం. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. పార్వతీశం నాకు మంచి స్నేహితుడు. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు. ఈ సినిమా ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించా. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గట్టిగా నమ్ముతున్నా' అని అన్నారు. షూటింగ్ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేశాం. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వల్ల త్వరగా షూటింగ్ పూర్తయింది. చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేశాం. పార్వతీశం, ప్రణీకాఅన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతనికి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నా. మాకు చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం' అని అన్నారు. -
హీరో చెంప పగలగొట్టిన స్టార్ యాంకర్.. వీడియో వైరల్!
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. బీ2పీ స్టూడియోస్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మహాలక్ష్మి అన్న పేరు ఉంటే వారికి 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ శ్రీముఖితో చిత్రబందం ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హీరో పార్వతీశం వెళ్లి శ్రీముఖిని చూసి' మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ' అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి హీరో చెంపపై ఒక్కటి ఇస్తుంది. 'మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంది. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow! మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo — Mukesh G (@MukeshG39549544) March 21, 2024 -
మీ పేరు అదేనా?.. అయితే ఆ సినిమా టికెట్ ఫ్రీ!
కేరింతఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయమవుతోంది. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పేరుతో ఉన్నవారికి 200 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? అంటూ హీరో, హీరోయిన్స్ ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాప్-200 మహాలక్ష్ములకు మార్కెట్ మహాలక్ష్మి టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మహాలక్ష్ములు ఉంటే వెంటనే వాట్సాప్ చేసి టికెట్స్ ఉచితంగా పొందండి. కాగా.. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by VS MUKKHESH (@vsmukkhesh) -
'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ ట్రైలర్ వేడుక (ఫొటోలు)
-
‘మార్కెట్ మహాలక్ష్మి’తో పార్వతీశం సక్సెస్ అందుకోవాలి: బీవీఎస్ రవి
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' ని డైరెక్టర్ & రైటర్ బీవీఎస్ రవి ఎక్స్(ట్విటర్) ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని 'మార్కెట్ మహాలక్ష్మి' తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే వ్యక్తుల్లో 'బివిఎస్ రవి' గారు ఒకరు. మా సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయమని అడగగానే, ఓకే చెప్పి మా టీమ్ ని బ్లెస్స్ చేసినందుకు చాలా సంతోషం ఉంది’ అని డైరెక్టర్ వియస్ ముఖేష్ అన్నారు. Extremely happy to release the motion poster of MarketMahaLakshmi starring my dear Parvateesam who entertained us before. All the best to the whole team who has good wit and great talent. #MarketMahalakshmi #MM@VSMukkhesh31 @Akhileshkalaru@parvateesam_u #Praneekaanvikaa… pic.twitter.com/mCotatxiKb — BVS Ravi (@BvsRavi) January 31, 2024 -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి'
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫెమ్ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం' కి తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను’అన్నారు. 'మార్కెట్ మహాలక్ష్మి'చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి’అని బెక్కం వేణుగోపాల్ అన్నారు.