‘కేరింత’ఫేమ్‌ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి' | Market Mahalakshmi Title Poster Released By Hero Sivaji | Sakshi
Sakshi News home page

‘కేరింత’ఫేమ్‌ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి'

Published Fri, Jan 19 2024 2:49 PM | Last Updated on Fri, Jan 19 2024 2:49 PM

Market Mahalakshmi Title Poster Released By Hero Sivaji - Sakshi

‘కేరింత’ఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.  హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫెమ్ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం' కి తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను’అన్నారు.  'మార్కెట్ మహాలక్ష్మి'చూసినప్పుడు నాకు శేఖర్‌ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి’అని బెక్కం వేణుగోపాల్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement