
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. బీ2పీ స్టూడియోస్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.
ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మహాలక్ష్మి అన్న పేరు ఉంటే వారికి 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ శ్రీముఖితో చిత్రబందం ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో హీరో పార్వతీశం వెళ్లి శ్రీముఖిని చూసి' మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ' అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి హీరో చెంపపై ఒక్కటి ఇస్తుంది. 'మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంది. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow!
మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo— Mukesh G (@MukeshG39549544) March 21, 2024