
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పంపిస్తూ ఫుల్ ఎమోషనల్ వీక్‌గా మార్చేశారు. తాజాగా మరో కంటెస్టెంట్ కుటుంబ సభ్యుడు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశాడు. హౌస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్రేరణ భర్త ఇవాళ హౌస్‌లో అడుగుపెట్టాడు. తన భర్తను చూసి ఆనందంలో గంతులేసింది ప్రేరణ.
(ఇది చదవండి: 40 రోజులుగా బ్లీడింగ్.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి)
ఆ తర్వాత చాలా బాగా అడుతున్నావంటూ ప్రేరణను మరింత ఎంకరేజ్ చేశాడు ఆమె భర్త. నువ్వు విన్నర్‌గా తిరిగి రావాలంటూ భార్యకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ జంట హౌస్‌లో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. చివర్లో భార్య, భర్తలిద్దరితో గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇవాళ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment