బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. సోషల్ మీడియా నుంచి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లలో యాంకరింగ్ చేసే స్థాయికి ఆమె చేరుకుంది. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి ఒక పోస్ట్ చేసింది. తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొంది. దీంతో తన అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి తన అనారోగ్యం గురించి ఇలా చెప్పింది. 'నేను అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పలేదు,కేవలం అవగాహన కోసం మాత్రమే ఇలా చెబుతున్నాను. ముఖ్యంగా 'ఆడవారి కోసం' చెబుతున్నాను. 35 నుంచి 40 రోజులుగా నాకు విపరీతమైన బ్లీడింగ్ అవుతూనే ఉంది.రకరకాల మెడిసిన్ వాడాను,డాక్టర్‌ని డైరెక్ట్‌గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేపించుకోలేదు. ఒక రోజు షూటింగ్ ఉదయం 6:45 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2:45 వరకు జరిగింది. దీంతో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాను.
అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని ,వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, గతంలో మాదిరి నేను పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు రావాలంటే కనీసం 4 నుంచి 5 వారాలు పడుతుంది. ఇదే విషయాన్ని వైద్యులు సూచించారు. షూటింగ్ లేదా మీ ఇతర పనుల కోసం అని ఎక్కువ సమయం కేటాయించకండి. అనారోగ్యంతో పనిలోకి వెళ్లడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరగొచ్చు. మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే.. మీ అరోగ్యానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వండి. నిర్లక్ష్యం చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి.ఇవన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి.' అని ఆమె పేర్కొంది. స్రవంతి గర్భాశయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.
రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్ స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం. బిగ్‌బాస్ స్టేజీపై కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన స్మైల్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
Comments
Please login to add a commentAdd a comment