వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్‌బాస్ షో కాస్తా రసవత్తరంగానే సాగుతోంది. కొత్త, పాత నీరు కలవడంతో పోటాపోటీగా హౌస్‌లో హల్‌చల్ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ టైమ్‌లో అయితే కంటెస్టెంట్స్ ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ గొడవ మొదలైనట్లే. అలా ఈ వారంలో గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు.
ఇక నామినేషన్స్ గోల ముగియడంతో ఈ రోజు టాస్క్‌ల గోల మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పానిపట్టు యుద్ధం అంటూ హౌస్‌మేట్స్‌కు సరికొత్త పోటీ పెట్టాడు బిగ్‌బాస్. నీళ్ల ట్యాంకుల టాస్క్ ఇవ్వడంతో హౌస్‌మేట్స్ పోటాపోటీగా పాల్గొన్నారు. ఇక టాస్క్‌లో భాగంగా నిఖిల్ రెచ్చిపోయాడు. యష్మితోపాటు ఇద్దరి చేతులను పట్టుకుని లాగాడు. దీంతో గౌతమ్ నీకసలు బుద్ది ఉందా? అంటూ నిఖిల్‌ను హెచ్చరించాడు. సంచాలక్‌కు రెస్పెక్ట్ ఇవ్వరా? అంటూ యష్మి మండిపడింది.
టాస్క్ కాస్తా దారి మళ్లీ గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. నీకసలు సెన్స్ ఉందా? అంటూ గౌతమ్ అనడంతో నిఖిల్ మరింత ఫైరయ్యాడు. ఆపు నీ ఓవర్ యాక్టింగ్ అని నిఖిల్ చెప్పడంతో.. నీది ఓవర్ యాక్టింగ్ గౌతమ్ మీదికి దూసుకెళ్లాడు. ఈ గొడవ ఇద్దరు చివరికీ కొట్టుకునే దాకా వెళ్లడంతో అవినాశ్, పృథ్వీ వారిని నిలువరించారు. ఈ టాస్క్ గోల పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment