కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ! | Bigg Boss Telugu Latest Promo Of Season 8 Out Now | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ!

Published Sun, Oct 27 2024 3:58 PM | Last Updated on Sun, Oct 27 2024 4:13 PM

Bigg Boss Telugu Latest Promo Of Season 8 Out Now

తెలుగు బుల్లితెర రియారిటీ షో బిగ్‌బాస్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ సారి దీపావళి ఫెస్టివల్ కావడంతో సన్‌డే ఎపిసోడ్‌ను కాస్తా ఫన్‌డే మార్చేశారు. ఇంటి సభ్యులతో సరదా పంచులు, డైలాగ్స్‌తో సందడి చేశారు. ఇవాల్టి ఎపిసోడ్‌లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గెస్ట్‌గా వచ్చాడు. హౌస్‌మేట్స్‌పై తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరించాడు. విష్ణు ప్రియ, టేస్టీతేజ, ముక్కు అవినాశ్, రోహిణితో సహా పలువురిపై పంచ్ డైలాగ్స్‌ వేశాడు.

తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్‌మేట్స్‌కు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు. ఇ‍ద్దరు హౌస్‌మేట్స్‌ను పిలిచి వారి కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించాడు. వారిలో ఒక్కరికి మాత్రమే తన ఫ్యామిలీ సభ్యులు పంపిన మేసేజ్ చూసే అవకాశముందని నాగార్జున చెప్పాడు. దీంతో గంగవ్వ, టేస్టీ తేజకు  మీలో ఎవరో ఒకరే తేల్చుకోవాలంటూ ఆదేశించాడు.

దీంతో గంగవ్వ, టేస్టీ తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. గంగవ్వను పట్టుకుని ఏడ్చేశాడు. టేస్టీ తేజను సైతం గంగవ్వ ఓదారుస్తూ కనిపించింది. ఫుల్‌ ఫన్ ఎపిసోడ్ అంటూ చివరికీ వచ్చేసరికి హౌస్‌మేట్స్‌ను ఏడ్పించేశాడు బిగ్‌బాస్‌. చివరికీ ఏ హౌస్‌మేట్‌ తన కుటుంబ సభ్యులు పంపిన సందేశం చదివారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పుడైతే ఈ ‍ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement