parvatheesam
-
24 రోజుల్లోనే షూటింగ్.. రియల్ స్టోరీ ఆధారంగా వస్తోన్న చిత్రం!
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి వియస్ ముఖేశ్ దర్శకత్వం వహించారు. బి2పి స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భందా డైరెక్టర్ ముఖేశ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముకేశ్ మాట్లాడుతూ..'నేను వందకుపైగా షార్ట్ ఫిల్మ్స్ తీశా. మార్కెట్ మహాలక్ష్మి స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఆడియన్స్ కి తెలియని ఒక కొత్త పాయింట్‌ను టచ్ చేశాం. ఆ కొత్త పాయింట్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. పార్వతీశం నాకు మంచి స్నేహితుడు. ఒక కొత్త దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాతే స్టార్స్ అవకాశాలు ఇస్తారు. ఈ సినిమా ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నిజ జీవితంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. రియల్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించా. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గట్టిగా నమ్ముతున్నా' అని అన్నారు. షూటింగ్ గురించి మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో 6 పాటలు, ఒక ఫైట్‌తో సహా మొత్తం షూటింగ్ భాగాన్ని 24 రోజుల్లో పూర్తి చేశాం. ముందు నుంచే ప్రీ-ప్రొడక్షన్ మీద కూర్చోవడం వల్ల త్వరగా షూటింగ్ పూర్తయింది. చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసి షూట్ చేశాం. పార్వతీశం, ప్రణీకాఅన్విక ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అతనికి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని భావిస్తున్నా. మాకు చాలా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా టీమ్ థియేట్రికల్ రిలీజ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం' అని అన్నారు. -
హీరో చెంప పగలగొట్టిన స్టార్ యాంకర్.. వీడియో వైరల్!
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. బీ2పీ స్టూడియోస్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీమ్ ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మహాలక్ష్మి అన్న పేరు ఉంటే వారికి 200 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ శ్రీముఖితో చిత్రబందం ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో హీరో పార్వతీశం వెళ్లి శ్రీముఖిని చూసి' మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ' అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీముఖి హీరో చెంపపై ఒక్కటి ఇస్తుంది. 'మార్కెట్ మహాలక్ష్మీ ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు' అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతుంది. తాజాగా రిలీజైన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow! మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo — Mukesh G (@MukeshG39549544) March 21, 2024 -
మీ పేరు అదేనా?.. అయితే ఆ సినిమా టికెట్ ఫ్రీ!
కేరింతఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయమవుతోంది. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పేరుతో ఉన్నవారికి 200 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? అంటూ హీరో, హీరోయిన్స్ ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాప్-200 మహాలక్ష్ములకు మార్కెట్ మహాలక్ష్మి టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మహాలక్ష్ములు ఉంటే వెంటనే వాట్సాప్ చేసి టికెట్స్ ఉచితంగా పొందండి. కాగా.. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by VS MUKKHESH (@vsmukkhesh) -
న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్ స్టోరీగా ‘తెలుసా..మనసా’
‘కేరింత’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పార్వతీశం. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా ఈ యంగ్ హీరో నటింస్తున్న తాజా చిత్రం ‘తెలుసా..మనసా..’. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జష్విక హీరోయిన్గా నటిస్తోంది. వైభవ్ సినిమా బ్యానర్ పై వర్ష ముదాడ, మాధవి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే అందులో రోహిణి హట్టంగడి మంచంపై కూర్చుని ఉంటే ఆమె పక్కనే హీరోయిన్, ఓ చిన్న బాబు కూర్చుని ఉన్నారు. మంచం పక్కనే దానికి అనుకుని పార్వతీశం కూర్చుని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నారు. ‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఓ గ్రామంలో బెలూన్స్ అమ్ముకునే యువకుడు (పార్వతీశం), అదే ఊర్లో పని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత (జశ్విక)ను ప్రేమిస్తాడు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ వారిద్దరూ ఆ ప్రేమను వ్యక్తం చేసుకోరు. మల్లి బాబు పలు సందర్భాల్లో తన ప్రేమను సుజాతతో చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ చెప్పలేకపోతాడు. అయితే ఉన్నట్లుడి మల్లి బాబు కలలు కూలిపోతాయి. సుజాతకు దూరం కావాల్సి వస్తుంది. మరి వారిద్దరూ కలుసుకున్నారా! అనేదే ఈ సినిమా కథ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. -
క్యూట్ లవ్‌స్టోరీ
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, సిమ్రాన్ జంటగా పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వక్కడ నేనిక్కడ’. తాని గంగిరెడ్డి, కీర్తన వెంకటేష్ నిర్మాతలు. తొలి సన్నివేశానికి నిర్మాత కేకే రాధామోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత, పంపిణీదారుడు పారస్ జైన్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ఆర్బీ చౌదరి పూజలో పాల్గొన్నారు. పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘చాలా గ్యాప్ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యూత్‌ఫుల్ కథాంశంతో క్యూట్ లవ్‌స్టోరీగా రూపొందిస్తున్నాం. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిది. కామెడీ హీరోగా మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు పార్వతీశం. ‘‘డైరెక్టర్ని, కథను నమ్మి నిర్మిస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆచంట రాంబాబు. ∙సిమ్రాన్, పార్వతీశం -
మా రోజులు మారాయి
జిల్లావాసుల ఆదరణ మరువలేనిదని, తమ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తమ చిత్రయూనిట్ ఎంతగానో రుణపడి ఉందని, ఈ చిత్రంతో ‘మా రోజులు మారాయి’ అని అన్నారు ‘రోజులు మారాయి’ చిత్ర హీరోలు, హీరోయిన్. ఆ చిత్ర యూనిట్ బుధవారం కాకినాడ, రాజమహేంద్రవరంలలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చిన హీరోలు పార్వతీశం, చేతన్‌మద్దినేని, హీరోయిన్ కృతిక, దర్శకుడు మురళీకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. సినిమా విశేషాలు వెల్లడించారు. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను సందర్శించిన చిత్రయూనిట్‌కు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలతో అభినందించింది. చిత్ర కథానాయిక కృతిక మాట్లాడుతూ హాస్యం, సస్పెన్స్ తో నిర్మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. తనకు ‘దృశ్యం’ చిత్రం బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. ‘కేరింత’ నూకరాజని పిలుస్తున్నారు రోజులు మారాయి హీరో పార్వతీశం ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : తనను ఇప్పటి వరకు ప్రేక్షకులు ‘కేరింత’ నూకరాజుగానే గుర్తిస్తున్నారని, అదే తనపేరైందని ‘రోజులు మారాయి’ హీరో పార్వతీశం పేర్కొన్నారు. స్థానిక ఆనందరీజెన్సీ హోటల్లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : స్వగ్రామం, పెరిగింది ఎక్కడ? పార్వతీశం : స్వగ్రామం పలాస, బెంగళూరులో పెరిగా. అక్కడే బీటెక్ చదివా, యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్ వచ్చేశా. సాక్షి : ఇప్పటి వరకు చేసిన సినిమాలు? పార్వతీశం : కేరింత, రోజులు మారాయి చిత్రాలు చేశాను. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ‘నాన్నా.. నేను నా బాయ్‌ప్రెండ్స్’ చిత్రం చేస్తున్నా. హెబ్సాపటేల్ హీరోయిన్గా చేస్తుంది. సాక్షి : రోజులు మారాయి చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోంది? పార్వతీశం : రోజులు మారాయి చిత్రానికి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. మేము వెళుతున్న ప్రతి థియేటర్లో ఈ సినిమాలో పీటర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరింత నూకరాజు అనేవారు పీటర్ అంటూ పిలుస్తున్నారు. సినిమాలోని డైలాగులు నాకంటే ముందే ప్రేక్షకులు చెప్పేస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది. సాక్షి : ఏ పాత్రలు చేయాలని అనుకుంటున్నారు? పార్వతీశం : ప్రకాష్‌రాజ్, నాని, అమీర్‌ఖాన్‌లు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల పాత్రలలో నటించాలన్నదే తన ఆకాంక్ష. ‘తొలి సినిమాకే ఆదరణ చూపిస్తున్నారు’ రోజులు మారాయి హీరో చేతన్ మద్దినేని తాను నటించిన మొదటి సినిమా ‘రోజులు మారాయి’కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా హీరో చేతన్ మద్దినేని పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ‘‘మా స్వగ్రామం విశాఖపట్నం. 15 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు యూఎస్‌లో సెటిల్అయ్యారు. యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్‌లో ఉంటున్నా. రోజులుమారాయి నా మొదటి సినిమా. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ‘గల్ఫ్’సినిమాలో నటించాను. మూడు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రోజులు మారాయి చిత్రం నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. ప్రతి థియేటర్లో నన్ను ఈజీగానే గుర్తుపట్టారు. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. మేము చెప్పే డైలాగులను ముందుగానే ప్రేక్షకులు చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అన్ని రకాల పాత్రలను చేస్తాను. అంతేకాకుండా దర్శకుడు మారుతి చిత్రాల్లోనే నటిస్తా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. ఆయన వల్లే చిత్రసీమకు వచ్చా. ‘మా అమ్మమ్మ వాళ్లది రాజమహేంద్రవరమే’ రోజులు మారాయి దర్శకుడు మురళీకృష్ణ ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ‘మా స్వగ్రామం కృష్ణాజిల్లా గుడివాడైనా.. అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరమే’ అని రోజులు మారాయి చిత్ర దర్శకుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : ఇప్పటివరకు సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. రోజులు మారాయి నా మొదటి చిత్రం. సాక్షి : ఏయే సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : నాన్న, చిన్నారి, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. మూడింటికీ ఉత్తమ సీరియల్స్‌గా నంది అవార్డులు అందుకున్నా. అలాగే నాన్న, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది. సాక్షి : రోజులు మారాయి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? మురళీకృష్ణ : వెళ్లిన ప్రతి చోట ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్టైైనర్ సినిమా. ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది. సాక్షి : కొత్తగా దర్శకత్వం వహించే సినిమాలు మురళీకృష్ణ : నిర్మాతలు దిల్‌రాజు, జి.శ్రీనివాసరావుల తో కలిసి కొత్తగా ఒక సినిమా చేద్దామని అన్నారు. త్వరలోనే మొదలు పెడతాం. సాక్షి : సెలవులకు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఏం చేసేవారు? మురళీకృష్ణ : అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట. చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడు సైకిల్ తొక్కుకుంటూ గోదావరి గట్లపై తిరుగుతూ ఉండేవాడిని. ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పటి కీ మరిచిపోలేని అనుభూతి. మరలా రాజమహేంద్రవరం ‘రోజులు మారాయి’ విజయోత్సవ ర్యాలీకి రావడం ఆనందంగా ఉంది.