మీ పేరు అదేనా?.. అయితే ఆ సినిమా టికెట్ ఫ్రీ! | Market Mahalakshmi Team Gives Free Tickets Who Have This Name | Sakshi
Sakshi News home page

Market Mahalakshmi Movie: ఆ పేరు ఉన్న వారికి బంపరాఫర్.. సినిమా టికెట్ ఫ్రీ!

Published Mon, Mar 18 2024 7:00 PM | Last Updated on Mon, Mar 18 2024 7:08 PM

Market Mahalakshmi Team Gives Free Tickets Who Have This Name - Sakshi

కేరింతఫేమ్‌ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్‌ మహాలక్ష్మి. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. 

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పేరుతో ఉన్నవారికి 200 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? అంటూ హీరో, హీరోయిన్స్‌ ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్‌ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాప్-200 మహాలక్ష్ములకు మార్కెట్ మహాలక్ష్మి టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మహాలక్ష్ములు ఉంటే వెంటనే వాట్సాప్ చేసి టికెట్స్ ఉచితంగా పొందండి. కాగా.. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement