బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు. ఈరోజు (మంగళవారం) ఉదయం దర్భంగా జిల్లాలోని బిరౌల్‌లోని ఆయన నివాసంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని పిలిపించారు. ఎస్డీపీఓ మనీష్ చంద్ర చౌదరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్య జరిగిన సమయంలో వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని ముంబైలోని తన కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన దర్భంగాకు బయలుదేరారు.
మాజీ మంత్రి ముఖేష్ సాహ్నీకి ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ హత్య గురించి బీజేపీ నేత అజయ్ అలోక్ మాట్లాడుతూ జరిగిన ఘటన అత్యంత ఘోరమని అన్నారు. 72 గంటల్లో హంతకుడిని పట్టుకుంటామన్నారు. నేరాలను ఎలా అరికట్టాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment