
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే పై కేసు
కొల్లాం: ప్రముఖ నటుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ముఖేశ్‌పై కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ నేపధ్యంలో ఈ కేసుపై వివాదం చెలరేగింది. అయితే దీనిని ముఖేశ్ ఖండించారు. తాను నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ముఖేశ్ తన నియోజక వర్గానికి రావడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసును పొరపాటుగా నమోదు చేశామని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. కేసు నమోదు చేసే సమయంలో పోలీసులు అన్ని విషయాలు తెలుసుకోవాలని ముఖేశ్ వ్యాఖ్యానించారు.