- ఆగస్టు 15 నుంచి కొత్త పథకం అమలు
- బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ ముఖేష్
సాక్షి, సిటీబ్యూరో: వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా నగరంలోని ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. రెండు ఖాతాల్లో ఒకటి కుటుంబ పెద్దకు, మరొకటి తప్పనిసరిగా మహిళకు ఉండాలన్నారు.
బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంపూర్ ్ణ విత్తియే సమావేశన్(ఎస్‌వీఎస్) పేరిట ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలులోకి రానుందని, ఈలోగా క్షేత్రస్థాయిలో అవసరమైన పనులు పూర్తి చేయాలని బ్యాంక ర్లను కోరారు.
జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని, సొమ్ము జమ చేయాలని ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులు వస్తే సదరు బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన కలెక్టర్ హెచ్చరించారు. సబ్సిడీ రుణాలు ఇచ్చేయండి వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం వివిధ సంక్షేమ శాఖలు విడుదల చేసిన సబ్సిడీ మేరకు ఆగస్టు 15లోగా లబ్ధిదారులకు రుణాల మంజూరును పూర్తి చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. సబ్సిడీ విడుదల కాని సంక్షేమ రుణాల కోసం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు.
యువజన సంక్షేమ విభాగం యాక్షన్ ప్లాన్ మేరకు 908 మందికి త్వరితగతిన రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీవైడబ్ల్యూఓను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిధిలో గత ఏడాది మంజూరైన రుణాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కోరారు. గురువారం పదవీ విరమణ చేయనున్న ఎల్డీఎం భరత్‌కుమార్‌ను కలెక్టర్ మీనాతో పాటు పలు సంక్షేమ శాఖల అధికారులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఈడీలు సత్యనారాయణ, ఖాజా నిజామ్ అలీ, అక్రమ్ అలీ తదితరులు పాల్గొన్నారు.
రూ.5 లక్షలు ఇవ్వాల్సిందే..
స్వయం సహాయక సంఘాల మహిళలను బ్యాంకర్లు నిరుత్సాహ పరుస్తున్నారని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ఇతర జిల్లాల్లో గ్రామీణ పొదుపు సంఘాలకు మూడో లింకేజీ కింద రూ.5 ల క్షల చొప్పున రుణాలు ఇస్తుంటే, నగరంలో మాత్రం కేవలం రూ.2 లేదా రూ.3 లక్షలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పొదుపు సంఘాల మహిళల పట్ల వివక్ష కనబరచడం సరికాదన్నారు. వెంటనే రూ.5 లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని కోరారు.