టెలికాం కంపెనీలకు షాకిస్తూ ఇటీవలే రిలయన్స్ ఫ్యామిలీలో చేరిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను ముకేశ్ అంబానీ వెల్లడించారు. గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన యూజర్లపై వరాల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు దేశంలో జియో సేవలను అందుబాటులోకి తెస్తున్నామంటూ ముకేశ్ ప్లాన్ వివరాలను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సర్వీసులను అంకితం చేయనున్నట్టు తెలిపారు. తమ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్ కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్గా రూపాంతరం చెందబోతోందన్నారు. ఈ క్రమంలో తమ జియో పాత్ర కీలకమనిచెప్పారు.వచ్చే ఏడాది లోగా దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
Published Thu, Sep 1 2016 3:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
Advertisement