
మోహన్‌లాల్, నయనతార, ముఖేష్ ముఖ్య తారలుగా రూపొందిన మలయాళ చిత్రం ‘విస్మయతుంబతు’. నాగార్జునతో ‘కిల్లర్’ మూవీ తెరకెక్కించిన ఫాజిల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాని ఓం శ్రీ నమో లలితాంబ క్రియేషన్స్‌పై కె.కస్తూరి (లవ్లీ), సి.హెచ్. సరోజ గంగారామ్ తెలుగులో ‘మహాతంత్రం’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
‘‘మనుషుల్లో ఉన్న రాక్షసత్వాన్ని పోగొట్టడానికి, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి, ప్రియురాలిని కాపాడటం కోసం ఓ వ్యక్తి ఎలాంటి తంత్రం ఉపయోగించాడన్న కథతో తెరకెక్కిన చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్ అయినట్లుగానే తెలుగులోనూ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి నిర్వహణ: కె.ఐశ్వర్య, చిరంజీవి, సమర్పణ: వర్మ.
Comments
Please login to add a commentAdd a comment