
లైడియన్ నాదస్వరం, మోహన్‌లాల్
మోహన్‌లాల్ దర్శకుడిగా మారబోతున్నారు. ‘బారోజ్’ అనే ఫ్యాంటసీ సినిమాలో నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా లైడియన్ నాదస్వరం అనే పదమూడేళ్ల పిల్లాడిని పరిచయం చేయడం విశేషం. లైడియన్ అమెరికా టాలెంట్ షో ‘ద వరల్డ్స్ బెస్ట్’లో విజేతగా నిలిచాడు. తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ కుమారుడే లైడియన్ నాదస్వరం.
రెండేళ్ల వయసులోనే డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు లైడియన్. నిమిషంలో 325 బీట్స్ ప్లే చేసి ఓ షోలో అందర్నీ ఆశ్చర్యపరిచాడీ బుడతడు. ‘బారోజ్’ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం గోవాలో జరగనుంది. మలయాళ పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే సినిమా ఇదని ప్రచారంలో ఉంది. ఇంత భారీ సినిమాకు ఓ చిన్న బాలుడికి సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం.