ఆర్చ... అదరహా | Marakkar released on march 26 | Sakshi
Sakshi News home page

ఆర్చ... అదరహా

Published Mon, Jan 20 2020 12:51 AM | Last Updated on Mon, Jan 20 2020 12:51 AM

Marakkar released on march 26 - Sakshi

మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్‌ మలయాళ మూవీ ‘మరక్కర్‌: అరబికడలింటే సింహం’. ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్‌ అనే నావికుడి జీవితం ఆ«ధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మోహన్‌లాల్‌ యంగ్‌ పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్‌. ఆమె క్యారెక్టర్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్చ లుక్‌ ఆదరహా అంటోంది మాలీవుడ్‌. ఈ ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement