డ్యాన్సర్‌గా... | Ittymaani Made in China First Look Poster mohanlal movie | Sakshi
Sakshi News home page

డ్యాన్సర్‌గా...

Published Sun, May 19 2019 4:25 AM | Last Updated on Sun, May 19 2019 4:25 AM

Ittymaani Made in China First Look Poster mohanlal movie - Sakshi

మోహన్‌లాల్‌

మూడువందలకుపైగా సినిమాలు చేసినప్పటికీ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ కుర్రహీరోలను పరోక్షంగా చాలెంజ్‌ చేస్తున్నారు. మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్టిమాని: మేడ్‌ ఇన్‌ చైనా’. ఈ సినిమాలోని మోహన్‌లాల్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌లుక్‌ను చూస్తుంటే మోహన్‌లాల్‌ డ్యాన్సర్‌గా చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

పురాతన క్రిస్టియన్‌ డ్యాన్సెస్‌లో ఒకటైన ‘మార్‌క్కంగళి’ డ్యాన్స్‌ చేసే త్రిసూర్‌ ప్రాంత వాస్తవ్యుడిగా మోహన్‌లాల్‌ పాత్ర ఉంటుందని మాలీవుడ్‌ టాక్‌. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటికీ ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ గత నెలలో ప్రారంభం అయింది. జిబి అండ్‌ జోజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ త్రిసూర్‌లో జరగనుంది. కొన్ని సన్నివేశాలను సింగపూర్‌లో ప్లాన్‌ చేశారట టీమ్‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement