Vikram Prabhu Rathamum Sadhaiyum Movie First Look Released Pic Inside - Sakshi
Sakshi News home page

Vikram Prabhu: 'పోలీసోడు' హీరో మరో కొత్త చిత్రం.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Published Wed, May 25 2022 11:01 AM | Last Updated on Wed, May 25 2022 11:45 AM

Vikram Prabhu Rathamum Sadhaiyum First Look Released - Sakshi

చెన్నై సినిమా: తమిళ యాక్టర్ విక్రమ్‌ ప్రభు కథా నాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి 'రత్తముమ్‌ సదైయుమ్‌' అనే టైటిల్‌ను నిర్ణయించారు. కార్తీక్‌ మూవీ హౌస్‌ పతాకంపై కార్తీక్‌ అడ్విత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హరేందర్‌ బాలచందర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల 'టానాక్కారస్‌' చిత్రంలో నటనకు గాను సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్న విక్రమ్‌ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ఇది. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని, ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్‌ వర్గాలు తెలిపారు. కాగా చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మంగళవారం (మే 24) విడుదల చేశారు. టానాక్కారస్‌ చిత్రాన్ని తెలుగు వెర్షన్‌లో పోలీసోడు పేరుతో ఏప్రిల్‌ 8న విడుదల చేశారు. ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ మూవీ అశేష ప్రేక్షకాదరణ పొందింది. 

చదవండి: 👇

బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్‌ చేయించారు: డైరెక్టర్‌
రజనీ కాంత్‌తో ఇళయరాజా భేటీ.. కారణం ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement