Varalaxmi Sharath Kumar First Look From Aadya Movie Revealed: తెలుగు ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్ కుమార్ సపరిచితమే. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. క్రాక్, నాంది సినిమాలతో సూపర్ హిట్ అందుకోవడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఆమె కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అలాగే 'హనుమాన్' సినిమాలోని ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
ఇవే కాకుండా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోన్న మరో తాజా చిత్రం 'ఆద్య'. ఆమెతో పాటు హెబ్బా పటేల్, ఆశిష్ గాంధీ తదితరులు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎం. ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం (మార్చి 5) ఆమె పుట్టిన రోజు సందర్భంగా వరలక్ష్మీ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఆమె క్రీడాకారిణిగా పవర్ఫుల్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి 11న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచడం విశేషం.
Varalaxmi Sharath Kumar: క్రీడాకారిణిగా పవర్ఫుల్గా వరలక్ష్మీ శరత్ కుమార్.. పోస్టర్ వైరల్
Published Sat, Mar 5 2022 9:17 PM | Last Updated on Sat, Mar 5 2022 9:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment