
రెజీనా తెలుగు సినిమాల్లో కనిపించి ఏడాది కావస్తోంది. ‘అ!’ తర్వాత తెలుగులో రెజీనా కనిపించలేదు. తను సినిమాలేవీ చేయడం లేదా అంటే.. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలానే వేరే ఇండస్ట్రీల్లో తన లక్‌ను టెస్ట్ చేసుకుంటున్నారు రెజీనా. ఈ ఏడాది ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారామె. ఆ సినిమా ఫర్వాలేదనిపించింది. లేటెస్ట్‌గా మాలీవుడ్‌కు హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారట. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రం ‘బిగ్ బ్రదర్’ సినిమాలో హీరోయిన్‌గా రెజీనాను ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. మలయాళంలో రెజీనా చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. సిద్ధికీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రెజీనా నటించిన తమిళ చిత్రాలు ‘పార్టీ, 7’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment