సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు కానీ హీరోలు మాత్రం అలాగే ఉంటారు. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. ఈ క్రమంలో వారి వయసుకు తగ్గ కథానాయికలతో కాకుండా కుర్ర హీరోయిన్లతోనూ స్టెప్పులేస్తున్నారు. అయితే ఇందులో తప్పే లేదంటున్నాడు మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal).
అందులో తప్పేం లేదు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటినుంచో మన ఇండస్ట్రీ ఇలాగే ఉంది. తెలుగు (Tollywood), తమిళంలోనూ ఇదే కొనసాగుతోంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద ఏళ్లు వచ్చినా సరే యాక్ట్ చేయొచ్చు. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నావనేది నీ చేతిలో ఉంటుంది. నీకు అసౌకర్యంగా అనిపిస్తుందంటే అలాంటి అవకాశాలను వదిలేసుకోవడమే మంచిది. కానీ జనాలు మిమ్మల్ని ఆయా పాత్రల్లో ఇష్టపడుతుంటే వాటిని అంగీకరించడంలో తప్పేం లేదు. యాక్టింగ్ అనేది ఒక పర్ఫామెన్స్ అంతే! దానికి వయసుతో సంబంధం లేదు. కేవలం అక్కడ ఎటువంటి పాత్ర చేస్తున్నావన్నది నీపై ఆధారపడి ఉంటుంది అన్నాడు.
చదవండి: 2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!
ఏదీ ఆలోచించలేదు
భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు.. ఏదీ చేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలు (Movies) చేస్తున్నాను. కాబట్టి ఇంకా దేని గురించీ ఆలోచించట్లేదు. ఒకవేళ ఏదైనా జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. జీవితం అనేది ఒక ప్రవాహం.. అది ఎటు తీసుకెళ్తే అటు సాగిపోతూ ఉండాలి అని చెప్పుకొచ్చాడు.
అదే పెద్ద మార్పు
సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. కాలం వేగంగా గడుస్తోంది. అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ, వీఎఫ్‌ఎక్స్ వల్ల సినిమాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే అన్నింటికంటే పెద్ద మార్పు. కానీ ఏ గ్యాడ్జెట్ కూడా ఎమోషన్స్‌ను మార్చలేవు. మన ఎమోషన్స్ మన చేతిలోనే ఉన్నాయి అని మోహన్‌లాల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ
Comments
Please login to add a commentAdd a comment