
మన దగ్గర కొత్త సినిమా రిలీజ్ ఉందనగా చాలామంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలామంది హీరోలకు ఇది సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఇలానే ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కేరళలోని శబరిమల కొండని కాలినడకన ఎక్కారు. భుజాన ఇరుముడి కూడా కనిపించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)
18 మెట్లు ఎక్కి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న మోహన్ లాల్.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అయితే ఇదంతా కూడా త్వరలో రిలీజ్ కాబోతున్న తన సినిమా 'ఎల్ 2: ఎంపురన్' కోసమే అని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ భారీ స్థాయిలో మార్చి 27న రిలీజ్ కానుంది.

గతంలో 'లూసిఫర్' అనే సినిమా వచ్చింది కదా! దీనికి సీక్వెల్ 'ఎల్2' మూవీ. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్.. దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలోనూ నటించాడు. ఈ సినిమాపై అటు మోహన్ లాల్, ఇటు పృథ్వీరాజ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
(ఇదీ చదవండి: సగం బాలీవుడ్ 'ఐపీఎల్' కోసం.. ఒక్క రాత్రి ఖర్చు ఎంతంటే?)
శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్‌లాల్.#Mohanlal #Aadhantelugu #Sabarimala #AyyappaTemple pic.twitter.com/MXkX48lfra
— Aadhan Telugu (@AadhanTelugu) March 19, 2025
சபரிமலைக்கு திடீர் விசிட் அடித்த நடிகர் மோகன்லால்; நடிகர் மம்முட்டி பெயரில் சிறப்பு பூஜை! #Mohanlal #Mammootty #Sabarimala #Kerala pic.twitter.com/2YMtwZYgrj
— Idam valam (@Idam_valam) March 19, 2025
Comments
Please login to add a commentAdd a comment