
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించిన ఎల్ 2: ఎంపురన్ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల కోసం అన్ని చోట్లకు తెగ తిరిగేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మోహన్ లాల్ కాలినడకన శబరిమల కొండ కూడా ఎక్కాడు. తోటి హీరో మమ్ముట్టి (Mammootty) పేరిట ప్రత్యేక పూజలు చేయించాడు. దీంతో వివాదం మొదలైంది. ఇప్పుడు దానిపై మోహన్ లాల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
(ఇదీ చదవండి: పరువు పోతుందని భయపడ్డాను.. ఒకప్పటి హీరోయిన్ సుహాసిని)
మమ్ముట్టి స్వతహాగా ముస్లిం. ఇతడి పేరిట శబరిమల (Sabarimala) దేవాలయంలో పూజలు చేయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. చెన్నై ప్రెస్ మీట్ లోనూ మోహన్ లాల్ కి ఎదురైంది. దీంతో.. 'అందులో తప్పేముంది? అతడు నా స్నేహితుడు. అందుకే ప్రత్యేక పూజ చేయించాను. అయినా నా ఫ్రెండ్ కోసం పూజా చేయించడం నా వ్యక్తిగత విషయం' అని చెప్పుకొచ్చాడు.
మమ్ముట్టి ఆరోగ్యం గురించి మాట్లాడిన మోహన్ లాల్.. అతడికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందరికీ ఇలాంటివి సాధారణమే. భయపడాల్సినంతగా ఏం లేదు అని రూమర్స్ పైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో మమ్ముట్టి ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మమ్ముట్టికి క్యాన్సర్ అనే పుకార్లు వచ్చాయి. దీన్ని ఆయన టీమ్ ఖండించింది. ఇది జరిగిన కొన్నిరోజులకు మమ్ముట్టి గురించి మోహన్ లాల్.. శబరిమలలో పూజ చేయించడం హాట్ టాపిక్ అయింది.
(ఇదీ చదవండి: ఐసీయూలో తల్లి.. IPLకు నో చెప్పిన హీరోయిన్)