వృషభ రిలీజ్‌ డేట్‌ వచ్చేది అప్పుడే! ఆ సన్నివేశాలు హైలైట్‌! | Mohanlal Vrushabha Release Date Will be Out Soon | Sakshi
Sakshi News home page

Vrushabha Movie: వృషభ రిలీజ్‌ డేట్‌ వచ్చేది అప్పుడే!

Published Sun, Oct 15 2023 5:29 PM | Last Updated on Sun, Oct 15 2023 5:54 PM

Mohanlal Vrushabha Release Date Will be Out Soon - Sakshi

మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జాతీయస్థాయి నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తాజాగా ఈయన నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం వృషభ: ది వారియర్స్‌ అరైస్‌. రోషన్‌ మేకా, షనాయా కపూర్‌, సహారా ఎస్‌ ఖాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

కనెక్ట్‌ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్‌ ఏవీఎస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై వరుణ్‌ మందుర్‌, సౌరవ్‌ మిశ్రా, ఏక్తా ఆర్‌ కపూర్‌, శోభాకపూర్‌, విశాల్‌ కుర్నానీ, జూసీ పరేక్‌ మేతా, అభిషేక్‌ వ్యాస్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమవగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ తండ్రి కొడుకుల మధ్య డ్రామా, ఎమోషన్‌, ప్రేమ, పగ, ప్రతీకారంతో కూడిన పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందన్నారు.

చిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయన్నారు. ఇది 2024లో విడుదలయ్యే అత్యంత భారీ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర విడుదల తేదీని నవరాత్రి సందర్భంగా వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళం, హిందీ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు.

చదవండి: మ్యాచ్‌ చూసేందుకు వెళ్లి గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement