మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రీసెంట్‌గా ఓ నివేదిక సమర్పించింది. ఇందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడి రాజీనామా చేశారు.
(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)
అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు మోహన్ లాల్ తొలుత రాజీనామా చేయగా.. పాలక మండలిలోని మిగిలిన సభ్యులందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఈ మేరకు 'అమ్మ' సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో వీళ్లంతా నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. అలానే రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి, కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.
అమ్మ సంఘంలో నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మలయాళ చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment