Rejina
-
ఒక్కరా.. ఇద్దరా?
ఆ అబ్బాయి పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీకా? కృష్ణమూర్తా? వంటి సస్పెన్స్ అంశాలతో రూపొందిన చిత్రం ‘సెవెన్’. హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కింది. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటించారు. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 5న విడుదలకానుంది. శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపొద్దోయ్ నన్నే..., పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు...’ పాటలను ఇప్పటికే రిలీజ్ చేయగా, తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రమేష్ వర్మ మాట్లాడుతూ–‘‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. కథ నేనే అందించాను. అభిషేక్ పిక్చర్స్ సంస్థ మా సినిమాని విడుదల చేస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లా సినిమా కూడా కొత్తగా ఉంటుంది’’ అని హవీష్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సహనిర్మాత: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
మాలీవుడ్‌కు హాయ్
రెజీనా తెలుగు సినిమాల్లో కనిపించి ఏడాది కావస్తోంది. ‘అ!’ తర్వాత తెలుగులో రెజీనా కనిపించలేదు. తను సినిమాలేవీ చేయడం లేదా అంటే.. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలానే వేరే ఇండస్ట్రీల్లో తన లక్‌ను టెస్ట్ చేసుకుంటున్నారు రెజీనా. ఈ ఏడాది ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారామె. ఆ సినిమా ఫర్వాలేదనిపించింది. లేటెస్ట్గా మాలీవుడ్‌కు హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారట. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రం ‘బిగ్ బ్రదర్’ సినిమాలో హీరోయిన్గా రెజీనాను ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. మలయాళంలో రెజీనా చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. సిద్ధికీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రెజీనా నటించిన తమిళ చిత్రాలు ‘పార్టీ, 7’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
నవ్వుల పార్టీ
జై, రెజీనా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్‌రాజ్, శివ, చంద్రన్ ముఖ్య తారలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పార్టీ’. అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మించారు. ప్రేమ్‌జీ అమరన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘సత్యరాజ్సార్ లాగా చాలా రోజుల తర్వాత డ్యూయెట్లు పాడాను. సినిమా మొత్తం నవ్వుతూ చేశాం. ప్రేక్షకులు కూడా నవ్వుకునేలా ఈ సినిమా సరదాగా ఉంటుంది’’ అన్నారు. ‘‘పార్టీ’ లాంటి ఒక మంచి చిత్రాన్ని తీశానని ఆనందపడుతున్నాను. ఈ డైరెక్టర్‌తో మరిన్ని సినిమాలు చెయ్యడానికి రెడీ’’ అన్నారు టి. శివ. ‘‘పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులతో ‘పార్టీ’ చిత్రం తెరకెక్కింది. ప్రధానమంత్రి మోదీగారి స్పీచ్‌తో మొదలవుతుంది. ఇదే బ్యానర్లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వెంకట్ ప్రభు అన్నారు. ‘‘రమ్యకృష్ణగారిని రియల్‌గా చూడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నా కూడా నేను చూడలేకపోతున్నా.. భయం కాదు కానీ బిడియంగా ఉంది’’ అన్నారు ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి. ‘‘పార్టీ’ చిత్రం ద్వారా మా మనవడిని పరిచయం చేస్తున్నారు. తప్పక ఆదరించాలి. కట్టప్ప క్యారెక్టర్ కేవలం సినిమాల వరకే. ఒరిజినల్‌గా అలా ఉండను’’ అన్నారు సత్యరాజ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్‌జీ, నటి సంచిత తదితరులు పాల్గొన్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. కృష్ణ నటించిన ‘కిలాడి కృష్ణుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ నటి ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) రాధ డి) రాధిక 2. ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) రామ్ చరణ్ సి) ఎన్టీఆర్ డి) అల్లు అర్జున్ 3. మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ‘బిందాస్’. ఈ చిత్రంలో ముద్దుకృష్ణ పాత్రలో నవ్వులు పండించిన హాస్య నటుడెవరు? ఎ) బ్రహ్మానందం బి) శ్రీనివాసరెడ్డి సి) యం.యస్. నారాయణ డి) ‘వెన్నెల’ కిశోర్ 4.‘స్నేహగీతం’ చిత్రంలోని ముగ్గురు హీరోలలో ఓ హీరోగా నటించిన నటుడు ఇప్పుడు దర్శకుడు. ఎవరా దర్శకుడు? ఎ) సందీప్ కిషన్ బి) వెంకీ అట్లూరి సి) రాహుల్ రవీంద్రన్ డి) వరుణ్ సందేశ్ 5. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’లో దుల్కర్ సరసన నటించిన ఆ బంగారం ఎవరు? ఎ) అదితీరావు బి) తులసీ నాయర్ సి) నిత్యామీనన్ డి) కార్తీకా నాయర్ 6. రామ్ హీరోగా నటించి విజయం సాధించిన ‘నేను ౖÔð లజ’ చిత్రంలో శైలజ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) కీర్తీ సురేశ్ డి) రాశీ ఖన్నా 7. మొదటి సినిమాతోనే పాటల రచయితగా నంది అవార్డు అందుకున్న రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) శ్రీమణి డి) చంద్రబోస్ 8. శర్వానంద్, ‘అల్లరి’ నరేశ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గమ్యం’. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) భాస్కర్ సి) జి. నాగేశ్వర్ రెడ్డి డి) పరశురామ్ 9. ‘ముద్దబంతి పూవులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు...’ ‘అల్లుడుగారు’ చిత్రంలోని ఈ పాటకు స్వరకర్త ఎవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) కోటి సి) కేవీ మహ దేవన్ డి) మణిశర్మ 10. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ్ రీమేక్‌లో నటిస్తున్న హీరో పేరు ధ్రువ్. ఆయన ఏ ప్రముఖ నటుని కుమారుడో తెలుసా? ఎ) కార్తీక్ బి) విక్రమ్ సి) మురళీ డి) ప్రభు 11. తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఏ చిత్రంలో హీరోయిన్ సదా నటించారో చూడండి? ఎ) శివాజీ బి) బాయ్స్ సి) అపరిచితుడు డి) రోబో 12.‘నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్’ అవార్డును సాధించిన నటునికి భారత ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంతో తెలుసా? ఎ) 50000 బి) 100000 సి) 25000 డి) 75000 13. రీమా లంబా ఈ నటి అసలు పేరు. ఈ బాలీవుడ్ బ్యూటీ స్క్రీన్ పేరేంటి? ఎ) పూజాభట్ బి) రవీనా టాండన్ సి) సోనాలీ బింద్రే డి) మల్లికా శెరావత్ 14. సుధీర్‌బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘శివ మనసులో శ్రుతి’. ఆ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) ప్రణీత బి) రెజీనా సి) క్యాథరిన్ థెరిస్సా డి) లావణ్యా త్రిపాఠి 15. హను రాఘవపూడి దర్శకత్వంలో తయారవుతున్న నూతన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నితిన్ డి) నాని 16. ముంబై మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్‌కు ఓనర్స్‌లో ఒకరు సునీల్ గవాస్కర్. మరో ఓనర్ ఈ ప్రముఖ హీరో. ఎవరతను? ఎ) వెంకటేశ్ బి) రానా సి) చిరంజీవి డి) నాగార్జున 17.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘గ్రహణం’. ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన నటి ఎవరు? ఎ) ప్రగతి బి) రేవతి సి) లక్ష్మీ డి) జయలలిత 18.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ఓ హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) నివేథా థామస్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ 19.ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) కీర్తి చావ్లా బి) గజాలా సి) జెనీలియా డి) అంకిత 20. కింది ఫొటోలోని చిన్నారి ఎవరు? చిన్న క్లూ: తను మలయాళ హీరోయిన్ ఎ) నిత్యామీనన్ బి) సాయి పల్లవి సి) అనుపమ డి) నజ్రియా నజీమ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) ఎ 2) ఎ 3) డి 4) బి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) బి 11) సి 12) ఎ 13) డి 14) బి 15) బి 16) డి 17) డి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
అర్థం కాని అందం
చూడచక్కగా ఉంటారీ బ్యూటీ. కేవలం బ్యూటీ అని పొరబడితే మేకప్ కిట్టులో కాలేసినట్టే. బ్యూటీ విత్ బ్రెయిన్. వేసే ప్రతీ అడుగు చాలా తెలివిగా వేస్తారట. అసలు అర్థం కాని ఒక వెరైటీ క్యారెక్టర్. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే పోషిస్తున్నారు రెజీనా. తమిళంలో రెజీనా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసమే ఈ డిఫరెంట్ రోల్. అరవింద స్వామితో దర్శకుడు రాజా పాండీ తెరకెక్కిస్తున్న ఓ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రెజీనా. కేవలం పాటల్లో వచ్చి కాలు కదిపే విధంగా కాకుండా కథను మలుపు తిప్పేలా రెజీనా పాత్రను దర్శకుడు రూపొందించారట. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర కావడంతో రెజీనా వెంటనే ఈ పాత్రను ఒప్పుకున్నారట. ఈ చిత్రంలో రెజీనా రోల్ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అరవింద స్వామి పక్కన కొత్త జోడీ ఉండాలనుకున్నాం. ఫిట్‌గా కూడా ఉండాలనుకున్నాం. రెజీనా పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. 70 శాతం షూటింగ్ చెన్నైలో జరపనున్నాం’’ అని పేర్కొన్నారు. -
కిరి కిరి
పబ్లిసిటీ పరుగెత్తాలంటే ఏం చెయ్యాలి? పరుగెత్తే కార్లోంచి దూకి, పరుగున డాన్స్ చెయ్యాలి. ఎన్ని వంకర్లు తిరిగితే అన్ని షేర్లు. ఎన్ని టింకర పనులు చేస్తే అన్ని లైకులు. నలుగురికి సాయం చేసో.. పదిమందికి అన్నం పెట్టో.. ఒకరికి చదువు చెప్పో.. ఒక అన్యాయాన్ని ఎదిరించో..అబ్బో.. అంత వద్దులెండి. కనీసం ఒక ప్లకార్డునైనా పట్టుకున్నా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది కానీ.. ఈ కీకీ లేమిటి? కిరికిరిలేమిటి? అమాయకమైన ఓ యువకుడి ఫొటో.. దండ వెళ్లాడుతూ! కింద ‘ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ కేకే.. లవింగ్ బాయ్‌ఫ్రెండ్ టు కీకీ.. డైడ్ వైల్ డూయింగ్ ది షిగ్గి.. (ఫిబ్రవరి 1995 – జూలై 2018) (కేకే ప్రేమస్మృతిలో కీకీ ప్రియతముడు.. షిగ్గీని చేస్తుండగా దుర్మరణం)’ అని రాసి ఉంది. దానికో రైటప్.. ‘డోంట్ చాలెంజ్ డెత్. బీ వైజ్.. కీప్ అవే ఫ్రమ్ సిల్లీ స్టంట్స్ అండ్ అడ్వైజ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ టు స్టే సేఫ్.(మృత్యువును సవాల్ చెయ్యకండి. తెలివిగా ఉండండి. వెర్రి విన్యాసాలకు దూరంగా ఉండండి. క్షేమంగా ఉండమని మీ స్నేహితులకు కూడా చెప్పండి.) ఇన్అవర్ఫీలింగ్స్#కీకీకిల్స్#ఇన్‌మైఫీలింగ్స్#కీకీచాలెంజ్#జైపూర్పోలీస్#సేఫ్జైపూర్సోషల్ మీడియాలో జైపూర్ పోలీస్‌లు పెట్టిన పోస్ట్ ఇది. ఇప్పుడు సంచలనం రేపుతోంది.. కీకీ చాలెంజ్‌కు కౌంటర్‌గా! ఏంటీ కిరి కిరి?! అరే.. ఈ దేశం.. ఆ దేశమని కాదు.. ఏ దేశంలోనైనా.. ఈ కారు ఆ కారని కాదు.. నానో నుంచి మెర్సిడెజ్‌బెంజ్ దాకా.. నడుస్తున్న కారు లోంచి దూకి.. ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ పాటకు డ్యాన్స్ చేయడం.. స్మార్ట్ ఫోన్‌తో షూట్ చేసుకోవడం.. ఆ వీడియోలను మీ టూ అంటూ కీకీ చాలెంజ్‌కు ట్యాగ్ చేసుకోవడం! ఇదీ కీకీ హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్ లేదా ఇన్‌మైఫీలింగ్స్ చాలెంజ్. ఇప్పుడు లోకమంతా పిచ్చిపట్టినట్లు అవుతోంది దీని కోసమే. సోషల్ మీడియాలో వైరల్‌గా అంతా అవే పోస్ట్‌లు. సగటు మనుషుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ పిచ్చిగా ఫాలో అవుతోంది దీన్నే. మొన్నటికి మొన్న రెజీనా కసాండ్రా, అమ్రపాలీ కాస్ట్యూమ్స్‌లో ఆదా శర్మ.. కదులుతున్న కార్లోంచి దూకి పాటకు స్టెప్పులేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ ఏమీ తక్కువ అడుగులేయలేదు. కరిష్మా శర్మ తన్మయత్వంతో చిందేసింది. నోరా ఫతేహి, వరుణ్ శర్మ (ఫక్రే ఫేమ్) తమ తిక్కను నడుస్తున్న ఆటోలోంచి దూకి చూపించుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్డే కాదు కోలీవుడ్, శాండల్‌వుడ్ సహా హాలీవుడ్‌తోపాటు పాప్ ప్రపంచానికీ ఈ కీకీ చాలెంజ్ వెర్రి పాకేసింది. పోలీసులకూ సవాలే లైఫ్ బిందాస్‌గా ఉండాలి. ఆడుతూపాడుతూ రోజు గడవాలి. ఎప్పుడూ కొత్తగా ఉండాలి. దానికోసం ఎలాంటి వెర్రినైనా తలకెక్కించుకుంటాం.. ఎంతటి పాగల్ పనికైనా తెగబడతామని జనాలు చాలెంజ్ చేస్తే ‘ఊరుకోం’ అంటూ, పట్టుకెళ్లి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. సందులు, వీధులు, కూడళ్లు, రోడ్లు, హైవేలు.. ఎక్కడైనా చాలెంజ్‌కి రెడీ అంటూ.. నడుస్తున్న కార్లలోంచి దూకి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకోవడం ట్రాఫిక్‌కు అంతరాయంగా మారుతోంది. మరీ కొంతమందైతే రెడ్ సిగ్నల్స్‌ను కూడా లెక్కచేయట్లేదట. ఈ చాలెంజ్ ఆట పోలీసులకు ప్రాణసంకటంగా మారింది. ఈ స్టంట్స్ చేస్తున్నవాళ్లకే కాదు ఇతర వాహనదారులకూ ప్రమాదాలను తెచ్చిపెడ్తోంది. పీక్‌కి వెళ్లిన ఈ పిచ్చిని ఆపడానికి ముంబై, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, యూపీ పోలీసులు తమ స్టిక్స్‌కి స్ట్రిక్ట్‌గానే పనిచెప్పనున్నారట. ఎవరైనా అలా నడుస్తున్న వాహనాల్లోంచి దూకి గంతులు వేస్తే అరెస్ట్ ఖాయమని.. హెచ్చరికలూ జారీ చేశారు. నిఘా కెమెరాలూ పనిచేస్తున్నాయి. మన పోలీసులు కూడా పేపర్లలో, టీవీల్లో, ఎఫ్ఎమ్ రేడియోల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండువైపులా పదునైన వేదిక సోషల్ మీడియా.. ఉద్యమాలను (ఉదా : జాస్మిన్ విప్లవం) పుట్టించి ప్రభుత్వాలను ఉరుకులు పెట్టించగలదు.. ‘మీ టూ’ లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను సృష్టించి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలదు. ఐస్ బకెట్ చాలెంజ్‌తో జబ్బుల మీద (మోటర్ న్యూరోస్ డిసీజ్) అవగాహన తెప్పించగలదు.. రైస్ బకెట్‌తో సామాజిక బాధ్యతను గుర్తుచేయగలదు. దేనికైనా తీవ్రంగా రియాక్ట్ కాగలదు.. దేన్నయినా లైట్‌గా కొట్టిపారేయగలదు. సీరియస్ పాలసీలను ప్యాక్ చేసి దాచేయగలదు.. వినోదాన్ని పంచి పెద్దగా స్ప్రెడ్ చేయగలదు. అదీ సోషల్ మీడియా ఐడెంటిటీ! ‘కీకీ’ కూడా అదే డయాస్‌గా వైరల్ అయింది. ఎక్కడిదీ కిర్రాక్? కెనడా ర్యాప్ సింగర్ డ్రేక్ తెలుసు కదా? ఆయన పాడిందే ‘కీకీ డు యు లవ్ మీ’. ఆయన లేటెస్ట్ ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’తో సాగుతుందీ పాట. అయితే చాలెంజ్ విసిరింది మాత్రం డ్రేక్ కాదు. బౌన్స్ ట్రాక్‌లో చాలా హుషారుగా సాగే ఈ సాంగ్ ప్రముఖ ఇంటర్నెట్ కమెడియన్ షిగ్గీకి తెగ నచ్చింది. ఉన్నదాన్ని దేన్నయినా తన స్టయిల్లో పాపులర్ చేయడమే కదా షిగ్గీ పని. అందుకే వీధుల్లో.. ఈ పాటకు డ్యాన్ చేసి.. ఈ ఎంజాయ్మెంట్ను మీరూ చాలెంజింగ్‌గా తీసుకోండి అంటూ ఆ వీడియోను జూన్ 30 న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. షిగ్గీ చాలెంజ్ హ్యాష్‌ట్యాగ్, డూ ది షిగ్గీ హ్యాష్‌ట్యాగ్‌తో. ఈ వీడియోలో ఎక్కడా ఏ వెహికిలూ లేదు. కాని కొన్ని రోజులకు ఓడెల్ బెక్‌హమ్ (ఎన్ఎఫ్ఎల్ స్టార్) ఈ చాలెంజ్‌ను కార్లోంచి(ఆగి ఉన్న కారే) దిగి చేశాడు. ఆ తర్వాత కొంత మంది కదులుతున్న కార్లోంచి దిగి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కీకీ చాలెంజ్‌ను కదులుతున్న కార్లోంచి దిగి చేయడం మొదలుపెట్టారంతా. అమెరికన్ యాక్టర్ విల్ స్మిత్ అయితే ఇంకాస్త ముందుకెళ్లి డ్రోన్ కెమెరాలను పెట్టుకొని బుడాపెస్ట్ బ్రిడ్జి మీద డ్యాన్స్ చేశాడు. జరిమానాలు..అరెస్ట్‌లు అలా ఈ వెర్రి వయా హ్యాష్‌ట్యాగ్ ఖండాలన్నిటికీ వ్యాపించింది. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తెచ్చిపెట్టింది. దాంతో అన్ని దేశాల పోలీసులు కన్నెర్ర చేయక తప్పలేదు. అబుదాబీలో కీకీ చాలెంజ్ కోసం రోడ్డు ఎక్కితే జైలు, జరిమానా రెండూ విధిస్తున్నారు. దుబాయ్‌లో రెండువేల దిరమ్స్ ఫైన్, 23 బ్లాక్ పాయింట్స్ పనిష్మెంట్. అంతేకాదు అరవై రోజుల పాటు ఆ వెహికిల్ జప్తులో ఉంటుంది. అమెరికాలో అయితే రిమాండ్‌కు తరలిస్తున్నారట. స్పెయిన్‌లో నడ్డి విరిగే చార్జీలు విధిస్తున్నారట. కొన్నాళ్ల కిందట మన దగ్గర కొలవెర్రి కూసింది. ఇప్పుడు కీకీ కేకేస్తోంది. ఎక్సయిట్మెంట్ ఉండాలి.. ఎంజాయ్‌మెంటూ కావాలి. అవి జీవితంలో ఉత్సాహం నింపాలి కాని లైఫ్‌ను కిర్రాక్ చేయొద్దు. కదులుతున్న కారు కాదు.. నేను కదలని కార్లోంచే దిగి కీకీ చాలెంజ్ చేశాను. షూటింగ్లో ఉన్నాను కాబట్టి.. గ్యాప్ దొరికినప్పుడు ఆ కాస్ట్యూమ్స్తోనే డ్యాన్స్ చేశానంతే. కదులుతున్న కారులోంచి దూకి చేయలేదు కాబట్టి నేను రూల్స్‌ని, లాని వయలేషన్ చేయలేదనే అనుకుంటున్నా. గవర్నమెంట్ విల్ బి వెరీ హ్యాపీ విత్ మి. – అదా శర్మ, నటి కీకీ జోలికెళ్లొద్దు కీకీ చాలెంజ్ ఫన్ కోసమే అయినా క్షేమం కాదు. ప్రాణాలతో చెలగాటమే. ట్రాఫిక్ రూల్స్‌కి విరుద్ధం కూడా. ఇలాంటి వాటి జోలికి వెళ్లొద్దు. – లావణ్య త్రిపాఠి చట్ట వ్యతిరేక చర్యే కీకీ చాలెంజ్ పేరుతో నడుస్తున్న కారులోంచి దూకి స్టెప్పులేస్తుండటం క్షణికానందాన్ని కలిగించినా మన దగ్గర వాళ్లకు మాత్రం కన్నీటి శోకాన్ని మిగులుస్తుంది. అలా డ్యాన్స్ చేయడం వల్ల కారు ప్రమాదానికి గురై ప్రాణాలు పోతాయి. కొన్ని సందర్భాల్లో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల వారు కూడా ప్రమాదం బారిన పడే అవకాశముంది. దీనికితోడు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలా చేయడం కూడా చట్టవ్యతిరేక చర్యే. సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 70(బీ), మోటారు వెహికల్ యాక్ట్ సెక్షన్ 184, 188ల కింద కేసు నమోదు చేస్తాం. – మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకోండి కదులుతున్న కార్లోంచి బయటకు దూకి రోడ్లపై డ్యాన్స్‌లు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి చాలెంజ్‌లు అనుసరించే బదులు యువత జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకొని ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వాటితో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎవరిని ఉద్ధరించడానికి! ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ చాలెంజ్? ఏదైనా పనికొచ్చేవి చేసినా ప్రయోజనముంటుంది. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్ తీసుకోండి.. దేశం పచ్చగానైనా మారుతుంది. గిఫ్ట్ ఎ హెల్మెట్‌తో ప్రమాదాలు తగ్గుతాయి. ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ పెరుగుతుంది. అంతేకాని ఈ పిచ్చి చాలెంజ్లేంటి? వీటిని అరికట్టాలి. – మంచు లక్ష్మి, నటి, ప్రొడ్యూసర్ – శరాది -
డేట్ గుర్తు పెట్టుకుంటారా?
నాటి తరం ప్రేమకథతో పాటు ఈ తరం ప్రేమకథను కూడా ఒకే షోలో చూడండి అంటున్నారు ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ టీమ్. అందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రెజీనా, రాజ్‌కుమార్ రావ్, జూహీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెజీనా, సోనమ్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు సోనమ్ కపూర్. అనిల్ కపూర్‌కు ప్రేయసిగా జూహ్లీ చావ్లా నటించారట. అలాగే రెజీనాకు బీటౌన్‌లో ఫస్ట్ మూవీ ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావ్‌కు జోడీగా రెజీనా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్గా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘ఫిబ్రవరి 1, 2019 డేట్‌ను మర్చిపోవద్దు. మా సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు సోనమ్. -
వర్క్ మోడ్
పెళ్లి తర్వాత ఇన్ని రోజులు ఫ్యామిలీ మోడ్‌లో టైమ్ స్పెండ్ చేసిన సోనమ్ కపూర్ తిరిగి వర్క్‌మోడ్‌లోకి వచ్చేశారు. హిందీ చిత్రం ‘ఏక్ లడకీ కో దేఖా తో ఏసా లగా’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్, రెజీనా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు సోనమ్. ప్రస్తుతం జూహీ చావ్లా, సోనమ్ కపూర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. -
గాయకులుగా...
మన టాలీవుడ్‌కి మోస్ట్ ఫేవరెట్ బ్రదర్స్ సూర్య, కార్తీ. ఈ ఇద్దరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కలిసి యాక్ట్ చేస్తారు? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి టైమ్ ఉంది. కానీ త్వరలో కలిసి వినిపించనున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పార్టీ’. జై, రెజీనా, రమ్యకృష్ట ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. నటుడు ప్రేమ్‌జీ అమరన్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఈ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► ‘అతడు’ సినిమాలో మహేశ్‌బాబు తాతగా నాజర్ నటించారు. కానీ ఆ పాత్రకు మొదట అనుకొన్నది ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోని. ఎవరా హీరో? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) శోభన్‌బాబు సి) కృష్ణ డి) కాంతారావు ► ‘ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్‌గానే ఉంటుంది. కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది’ అనే ౖyð లాగ్ రాసిన రచయిత ఎవరు?( చిన్న క్లూ... ఈ ౖyð లాగ్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలోనిది) ఎ) బుర్రా సాయిమాధవ్ బి) పరుచూరి బ్రదర్స్ సి) క్రాంతిమాధవ్ డి) రత్నంబాబు ► ‘ఛమక్ ఛమక్ ఛం చుట్టుకో చుట్టుకో చాన్స్ దొరికెరో ఛయ్యా’ అంటూ సాగే ఈ పాటను ‘ఇంటిలిజెంట్’ సినిమాలో రీమిక్స్ చేశారు యస్.యస్. తమన్. ఈ పాటకు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) కేవీ మహదేవన్ సి) రాజ్–కోటి డి) దేవా ► ‘కళ్లు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామెన్? ఎవరతను? (చిన్న క్లూ అతను ‘సిరిÐð న్నెల’ చిత్రానికి కెమెరామెన్) ఎ) వీయస్సార్ స్వామి బి) ఛోటా. కె నాయుడు సి) యం.వి. రఘు డి) ఎస్. గోపాల్‌రెడ్డి ► ‘దశావతారం’ చిత్రంలో కమల్‌హాసన్ పది పాత్రలు పోషించిన సంగతి అందరికి తెలిసిందే. కానీ ఇందులో 7 పాత్రలకు డబ్బింగ్ చెప్పారు ఈ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎవరతను? ఎ) సాయికుమార్ బి) యస్పీ బాలసుబ్రమణ్యం సి) శివాజీ డి) జీవీజీ రాజు ► యస్.యం.యస్ (శివ మనసులో శ్రుతి) చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు సధీర్బాబు. అదే చిత్రం ద్వారా తెలుగులో ఆరంగేట్రం చేసిన హీరోయిన్ ఎవరు? ఎ) కేథరిన్ బి) రెజీనా సి) ప్రణీత డి) నిత్యామీనన్.7 ► ‘వీరబాహు సత్యధర్మ శివ శంకర రామ బాలు మహేంద్ర’...ఇది సుకుమార్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో హీరో పాత్ర పేరు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) అల్లు అర్జున్ బి) రామ్ సి) నాగచైతన్య డి) రాజ్‌తరుణ్ ► హీరో నాగచైతన్య పక్కన హీరోయిన్గా మూడుసార్లు ఒక హీరోయిన్ మాత్రమే నటించారు. ఎవరా హీరోయిన్? ఎ) తమన్నా బి) అమలాపాల్ సి) కాజల్ అగర్వాల్ డి) సమంత9 ► ‘పరేషానురా పరేషానురా’ అంటూ ‘ధృవ’ చిత్రంలో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ నటించారు. ఆ పాట రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) చంద్రబోస్ బి)‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిసి) వరికుప్పల యాదగిరి డి) రామజోగయ్య శాస్త్రి ► యస్.యస్.రాజమౌళి తన కెరీర్లో ఒకే ఒక చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సినిమా పేరేంటి? ఎ) స్టూడెంట్ నం.1 బి) సై సి) మగధీర డి) రాజన్న ► ప్రముఖ నటి శ్రియ ఏ నాట్య విభాగంలో విధ్యన భ్యసించారో తెలుసా? ఎ) కూచిపూడి బి) భరతనాట్యం సి) కథక్ డి) కథక్కళి ► ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు.. ఈ మూడు సినిమాలు 2000 సంవత్సరంలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ఆ మూడు సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే. ఎవరా బాలీవుడ్ భామ? ఎ) మనీషా కొయిరాలా బి) సొనాలీ బింద్రే సి) నమ్రతా శిరోద్కర్ డి) టబు ► హీరోయిన్ శ్రీదేవి నటించిన ‘మామ్’ ఆమెకు ఎన్నో సినిమానో తెలుసా? ఎ) 300 బి) 200 సి) 250 డి) 350 ► నటుడు సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు? తెలుగులో నటించిన టాలీవుడ్ నటుడెవరో లె లుసా? ఎ) చిరంజీవి బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) బాలకృష్ణ ► శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘అనామిక’ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటించారో గుర్తుందా? ఎ) శ్రియ బి) అంజలా జవేరి సి) నయనతార డి) కమలినీ ముఖర్జీ ► ‘కళ్లు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామెన్? ఎవరతను? (చిన్న క్లూ అతను ‘సిరిÐð న్నెల’ చిత్రానికి కెమెరామెన్) ఎ) వీయస్సార్ స్వామి బి) ఛోటా. కె నాయుడు సి) యం.వి. రఘు డి) ఎస్. గోపాల్‌రెడ్డి ► పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రంలో హీరో పేరేంటో తెలుసా? ఎ) ఆకాశ్ బి) వరుణ్‌తేజ్ సి) సత్య డి) రోషన్ ► నటుడు సూర్య ఆర్థికంగా లేనివారు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ పేరేంటి? ఎ) అగరం ఫౌండేషన్ బి) హెల్ప్ ఫౌండేషన్ సి) ఏకం ఫౌండేషన్ డి) స్వామినాథన్ షౌండేషన్ ► కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ స్టిల్ ఏ సినిమాలోదో కనుక్కోండి? ఎ) సాగర సంగమం బి) స్వాతిముత్యం సి) సిరిసిరిమువ్వడి) శంకరాభరణం ► ఈ పై ఫొటోలోని బుడతడు ఇప్పుడు టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరో. ఇతనెవరబ్బా? ఓ నిమిషం ఆలోచించండి? ఎ) రామ్‌చరణ్ బి) సాయిధరమ్ తేజ్ సి) యన్టీఆర్ డి) వరుణ్‌తేజ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) ఎ 4) ఎ 5) బి 6) బి 7) సి 8) డి 9) సి 10) డి 11) సి 12) బి 13) ఎ 14) బి 15) సి 16) సి 17) ఎ 18) ఎ 19) సి 19) సి 20) డి -
అందుకే నిర్మాతగా మారా!
‘‘తెలుగులో కొత్త సినిమాలు, కొత్త కథలు రావడం లేదని అందరూ అంటున్నారు. నేనూ అలా అనుకోవడం ఎందుకు? మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేనే ముందుగా చేస్తే బాగుంటుంది కదా? అనుకొని ‘అ’ చిత్రం తీశా’’ అని హీరో నాని అన్నారు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అ’. ప్రశాంత్ వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని సమర్పణలో టి. ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని పంచుకున్న విశేషాలు.. ► ప్రశాంత్ వర్మ చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. తనకు నిర్మాతలు లేరని నేనే ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కథ వినమని చెప్పా. కానీ కమర్షియల్ సినిమాలు తీస్తున్న వారు ఇలాంటి కథ తీసేందుకు ముందుకు రారు. అటువంటప్పుడు ప్రశాంత్‌ని ఎందుకు నిరుత్సాహపరచడం. పైగా కథ వైవిధ్యంగా ఉంది కాబట్టి నేనే నిర్మిస్తానని చెప్పా. తనకు అవసరమైన నటీనటులు, టెక్నీషియన్స్‌ని ఇచ్చా. ► హీరోగా కూల్‌గా ఉంటాను. నిర్మాతగానూ టెన్షన్ లేదు. నిర్మాతగా ‘అ’ సినిమా చూసినప్పుడు నటుడిగా నా తొలి సినిమా ‘అష్టా చమ్మా’ చూసిన ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ. అయితే ‘నానీకి ప్రొడక్షన్ అవసరమా?’ అంటారేమో అని చిన్న భయం. టాలీవుడ్‌కి ‘అ’ లాంటి సినిమాల అవసరం ఉంది. పైగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త సినిమాలు కోరుకుంటున్నారు. అందుకే నాకు ప్రొడక్షన్ అవసరం. ► ఓవైపు హీరోగా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నా. మరోవైపు ‘అ’ సినిమా పనుల్లో ఉండటంతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా. సినిమా అంటే నాకు పిచ్చి. ఓ ఎగై్జట్‌మెంట్. అందువల్లే నాకు నటన, ప్రొడక్షన్ కష్టం అనిపించలేదు. ‘అ’ చిత్రంతో నిర్మాతల కష్టాలేంటో పూర్తి స్థాయిలో తెలిసాయి. ► ‘అ’ కమర్షియల్ సినిమా కాదు. నాపై నమ్మకంతో సినిమా కొనే డిస్ట్రిబ్యూటర్లను ఎందుకు రిస్క్‌లో పడేయడం? సినిమాపై నాకు నమ్మకం ఉంది. ఆ రిస్క్ ఏదో నేనే పడదామనుకుని సొంతంగా రిలీజ్ చేస్తున్నా. తమిళ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. ► మా 18 మంది కజిన్స్లో యూజ్లెస్ ఫెలో నేనే. అటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది సినిమా. నా వద్ద ఉన్న ప్రతి రూపాయి సినిమా ఇచ్చిందే. ఆ డబ్బుని తిరిగి సినిమాపై పెట్టేందుకు నేను వెనకాడను. ► ‘అ’ సినిమా కమర్షియల్‌గా హిట్ సాధించకున్నా పర్లేదు. కానీ.. ఓ ఇరవై ఏళ్ల తర్వాత.. తెలుగులో వైవిధ్యమైన సినిమాలకు ‘అ’ సినిమాతోనే మార్పు ప్రారంభమైంది అంటే చాలు. మా లక్ష్యం నెరవేరినట్లే. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్లో కొత్త తరహా చిత్రాలే వస్తాయి. అందుకు రెండు మూడేళ్లు అయినా పట్టొచ్చు. ► నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నా దర్శక–నిర్మాతలే కారణం. సొంత బ్యానర్ పెట్టాను కదా. నా సినిమాలు నేనే చేసుకుంటానంటానేమో? అనుకుంటారు. నేనెప్పుడూ నటుణ్ణే. నా బ్యానర్లో నేనెప్పుడూ నటించను. ‘అ’ విషయంలో నేను నిర్మాతనే. కాజల్, నిత్య, రెజీనా, అవసరాల నటులే. మేమంతా ఫ్రెండ్స్ కదా అని రెమ్యునరేషన్ తగ్గించలేదు. డేట్స్‌ని బట్టి తీసుకున్నారు. ► ఏడాదికి మూడు సినిమాలతో బిజీ. నేను హీరోగా చేయడంతో పాటు నా పాత జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. నా డైరెక్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటున్నా. యాక్టర్‌గా నా పేరు వేయకున్నా పర్లేదు.. డెరెక్షన్ డిపార్ట్మెంట్లో నా పేరు వేయమని చెబుతుంటా (నవ్వుతూ). ► శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను సినిమాలు చేస్తున్నానన్నది అవాస్తవం. మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం చేస్తున్నా’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునగారు, నేను చేయబోయే సినిమా పూజ ఈ నెల 24న ఉంటుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత కిశోర్ తిరుమల, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమాలు చేస్తా. -
‘థాంక్స్ రెజీనా.. ఫర్ ది కోఆపరేషన్’
సాక్షి, చెన్నై: సినిమాకు కోఆపరేషన్, ఆపరేషన్ రెండూ జరుగుతుంటాయి. కోఆపరేషన్ చేస్తే ప్రశంసలు, ఆపరేషన్ అయితే ఫిర్యాదులు, కేసులు ఉంటాయి. ఇందులో హీరోయిన్ రెజీనా మొదటి కోవకు చెంది ప్రశంసలను అందుకుంది. అయితే అదేమిటో చూద్దాం. హీరోయిన్ రెజీనా కోలీవుడ్‌లో అడపాదడపానే మెరుస్తోంది. ఎక్కువగా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తుందని అపవాదు కోలీవుడ్ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం రెజీనా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు కర్తీక్, ఆయన కొడుకు గౌతమ్ కర్తీక్ కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్టు ప్రణాళిక వేగంగా జరుపుకుని గురువారంతో పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ధనుంజయన్ తెలిపారు. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కేక్‌పై ‘థాంక్స్ రెజీ ఫర్ ది కోఆపరేషన్’ ఒన్ మోర్ డే ప్లీజ్ అంటూ పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. వృతిపై భక్తి కలిగిన నటి రెజీనా అని పేర్కొన్నారు. అంకితభావంలోనూ, నటనలనూ తనకు సాటి తనేనని పొగిడారు. ఈ చిత్రానికి ఆమె సహకారం చాలా ఉందని నిర్మాత చెప్పారు. -
చంద్రమౌళి మనిషి కాదు!
కార్తీక్ ఒకప్పటి లవర్‌బాయ్. ‘అభినందన’ సినిమా ఒక్కటి చాలు.. కార్తీక్‌ని గుర్తు చేయడానికి. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న కార్తీక్ ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మణిరత్నం ‘కడలి’ చిత్రం ద్వారా ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా పరిచయమయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే సినిమాలో నటిస్తున్నారు. టైటిల్ రోల్ తండ్రి చేశారా? కొడుకా? అన్నది ఏప్రిల్‌లో తెలిసిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే.. అసలు చంద్రమౌళి మనిషి కాదనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ పోస్టర్లో టైటిల్ లోగో కింద కారు సింబల్ ఉండటంతో ఈ సినిమా కథ అంతా కారు చూట్టూ తిరుగుతుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ కారు పేరు చంద్రమౌళి అన్నది కొందరి ఊహ. అన్ని ఊహలకు ఏప్రిల్ 27న సమాధానం దొరికేస్తుంది. ఆ రోజే ఈ సినిమా విడుదల కానుంది. తిరు కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రెజీనా, వరలక్ష్మీ శరత్‌కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
15 తగ్గించేశారు!
బందేవ్ను చూశారా? అదేనండీ... తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హాథీ మేరే సాథీ’ సినిమాలో హీరో రానా లుక్ గురించి చెబుతున్నాం. చాలా స్లిమ్ అయ్యారని అందరూ అంటున్నారు. అయితే... హౌ భల్లాలదేవ బగయా బందేవ్ (సినిమాలో రానా పాత్ర పేరు బందేవ్) అంటే.. ఇలా అని పేర్కొన్నారు రానా. ‘‘బాహుబలి’ తర్వాత నెక్ట్స్ నేను చేయబోయే సినిమాల్లోని క్యారెక్టర్స్ కోసం బరువు తగ్గాల్సిందే. అందుకే.. ఆ ప్రాసెస్‌ను స్లోగా అప్పుడే స్టార్ట్ చేశాను. ‘హాథీ మేరే సాథీ’ సినిమాలోని బందేవ్ లుక్ కోసం నేను ఆరు వారాలుగా నాన్ వెజ్ తినడం లేదు. ప్రొటీన్ ఫుడ్‌ను దూరం పెడుతున్నా. బరువు పెరిగే ఎక్సర్‌సైజ్‌లను ఆపేశాను. మజిల్స్ పెరిగే విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు రానా. ‘‘నాలుగేళ్లుగా రానా కొన్నిసార్లు బరువు పెరిగారు. మరికొన్నిసార్లు తగ్గారు. ఇందుకోసం స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతున్నారాయన. లేటెస్ట్ లుక్ కోసం రానా 15కేజీలు తగ్గారు. ఇదివరకు ఎవ్రీ టు అవర్స్‌కు రానా ఏదో ఒకటి తినేవారు. ఇప్పుడు నార్మల్‌గా ఎవ్రీడే మూడుసార్లు మాత్రమే తినేలా ప్లాన్ చేశాం’’ అన్నారు ట్రైనర్ కునాల్. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సగంతి ఇలా ఉంచితే... రానా, రెజీనా జంటగా సత్యశివ దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ సినిమా ‘1945’. ఈ సినిమాను ఈ ఏడాది మేలో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమచారం. -
ఎవరో కనుక్కోండి?
‘‘డిసెంబర్లో నా బర్త్‌డేకి ఓ సర్ప్రైజ్’’ అని గత నెల ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రెజీనా అన్నారు. అన్నట్లుగానే అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారం ఓ వెరైటీ లుక్‌లో కనిపించారు. ఇక్కడ మీరు చూస్తున్న లుక్ అదే. హెయిర్ స్టైల్, వీపు, చేతి మీద ట్యాటూ, వేళ్ల మీద స్నేక్ సింబల్.. టోటల్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత వెరైటీగా కనిపిస్తున్నారు కదూ. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తోన్న ‘అ’లోనే రెజీనా ఇలా కనిపించనున్నారు. పలు షార్ట్ ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నిత్యామీనన్, శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బా, కాజల్ అగర్వాల్.. ఇలా భారీ తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది. ఒక్కొక్కరి లుక్‌ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు. ట్యాటూకి 12 గంటలు – ప్రశాంత్ వర్మ బుధవారం రిలీజ్ చేసిన రెజీనా లుక్ వెనక కహానీ ఏంటని దర్శకుడు ప్రశాంత్ వర్మని అడిగితే... ‘‘ఈ క్యారెక్టర్ కోసం రెజీనా తన హెయిర్‌ని ట్రిమ్ చేసుకున్నారు. మూడు డిఫరెంట్ షెడ్యూల్స్ కోసం మూడు సార్లు ఆమె ట్రిమ్ చేసుకోవాల్సి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా హెయిర్ కట్ చేయించుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ‘మో’ అనే ఆర్టిస్ట్ రెజీనాకి ట్యాటూ వేశారు. ఈ ట్యాటూ వేయడానికి 12 గంటలు పట్టేది. చెరిపేయడానికి పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఎక్కువ నీళ్లతో కడిగితే చాలు. సినిమా మొత్తం దాదాపు ఈ లుక్‌లోనే కనిపిస్తారు రెజీనా. కాస్ట్యూమ్ డిజైనర్ శాంతి క్రియేషన్ సూపర్బ్. దాదాపు 12 రోజులకు పైగా రెజీనా పాత్ర చిత్రీకరణకు పట్టింది. ట్యాటూలో ఉన్న చిన్న చుక్కకి కూడా స్టోరీ ఉంటుంది. అసలు రెజీనా క్యారెక్టరైజేషన్, సినిమా బ్యాక్‌స్టోరీ ఈ ట్యాటూలోనే ఉంటుంది’’ అన్నారు. లుక్ టెస్ట్‌కి 24 గంటలు – రెజీనా బర్త్‌డే బేబి రెజీనాని ‘ఏం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారు?’ అని అడిగితే – ‘‘ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. మంచి స్టఫ్ ఉందనిపించింది. ప్రశాంత్ ‘అ’ కథ చెప్పగానే, ‘తప్పకుండా చేస్తాను. కానీ, ఈ పాత్ర అయితేనే చేస్తాను. బ్రహ్మాండంగా చేస్తాను’ అన్నా. కోరుకున్న పాత్రనే ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ క్యారెక్టర్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారో చెబుతారా? అన్నప్పుడు – ‘‘కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్ స్టైల్‌తో సహా మొత్తం రెడీ అయ్యి, లుక్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ డే 24 గంటలు, తర్వాత రోజు 12 గంటలు పట్టింది. మంచి సినిమా చేస్తున్నప్పుడు ‘ఎన్ని అవర్స్ కష్టపడ్డాం’ అని ఆలోచించకూడదు’’ అన్నారు. -
చంద్రమౌళి ఎవరు?
రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు. కానీ, తమిళ సినిమాల్లో హూ ఈజ్ మిస్టర్ చంద్రమౌళి? స్క్రీన్‌పై అతని కథ ఏంటి? అంటే.. ఇప్పుడే చెబితే కిక్ ఏముంటుంది? సినిమాకు ఇప్పుడేగా కొబ్బరికాయ కొట్టాం. గుమ్మడికాయ కొట్టి, దిష్టి తీసి థియేటర్లో బొమ్మ వేసేంత వరకూ ఆగండి అంటున్నారు రెజీనా. అయినా చంద్రమౌళితో రెజీనాకు రిలేషన్ ఏంటి? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. తిరుకృష్ణమూర్తి దర్శకత్వంలో తండ్రి కార్తీక్, తనయుడు గౌతమ్ కార్తీక్, రెజీనా ముఖ్య పాత్రల్లో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని కోలీవుడ్ ఖబర్. -
కథనం కొత్తగా ఉంటుంది!
నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. బి. మహేంద్రబాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మాతలు. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘ఎప్పట్నుంచో కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ప్రతిసారి నేను ఒక కొత్త తరహా కథతో వస్తానని ప్రేక్షకులు నమ్ముతారు. బట్.. ఈ ఒక్కసారికి నన్ను క్షమిండచండి. ఈ సిన్మా కథ పాతదైనా... కథనం కొత్తగా ఉంటుంది. మణిగారు మంచి సంగీతం ఇచ్చారు. పృథ్వీగారి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రతి విషయంలోనూ రోహిత్ తోడుగా ఉన్నారు. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు పవన్ మల్లెల. ‘‘సిన్మా చూశా. కామెడీ సూపర్‌గా వర్కౌట్ అయ్యింది. రోహిత్ నటన సూపర్. పవన్ బాగా తెరకెక్కించారు’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘రోహిత్ ఫస్ట్‌టైమ్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్టవ్వాలి. కమర్షియల్ హీరోగా నారా రోహిత్‌కు మంచి పునాది పడాలని కోరుకుంటున్నాను. పవన్‌కు మంచి పేరు రావాలి’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఈ వేడుకలో హీరోయిన్ రెజీనా, నటుడు ‘వెన్నెల’ కిశోర్‌లతో పాటు చిత్రబృందం పాల్గొంది. -
భల్లాలదేవ... బిజ్జలదేవ... కట్టప్ప... మళ్లీ కలిశారప్పా!
మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిస ఎవరు? కట్టప్ప. కుట్ర, కుతంత్రాలతో మాహిష్మతి మహారాజుగా పట్టాభిషేకం చేసింది ఎవరు? భల్లాలదేవ. అతని తండ్రి బిజ్జలదేవ. మహారాజుఆజ్ఞలు శిరసావహించినా... భల్లాలదేవ, బిజ్జలదేవ అంటే కట్టప్పకు కోపమే. అటువంటి వ్యక్తులతో కట్టప్ప మళ్లీ చేతులు కలిపాడు! ఈ ముగ్గురూ మళ్లీ కలిశారు. అయితే... ఇదేదో‘బాహుబలి–3’ కథ అనుకుని ‘కటప్పా... ఇదేంటప్పా’ అనుకోవద్దు. అసలు విషయం ఏంటంటే... సత్యశివ దర్శకత్వంలో ‘1945’ అనే సినిమాలో రానా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో బిజ్జలదేవ అలియాస్ నాజర్, కట్టప్ప అలియాస్ సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వాళ్లిద్దరి పాత్రలు ఎలా ఉంటాయనేది సస్పెన్స్.కొన్ని రోజులుగా కొచ్చిలో జరుగుతున్న షూటింగులో ముగ్గురూ పాల్గొంటున్నారట! ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అని ఓ సినిమాలో హీరో హీరోయిన్లు పాడుకున్నట్టు... ‘ఎన్నెన్ని సినిమాల బంధమో మనది’ అని ముగ్గురూ పాడుకుంటున్నారేమో! ఇక్కడ మరో విశేషం ఏంటో తెలుసా? మొన్నటి ‘బాహుబలి’, ఇప్పుడీ ‘1 945’... రెండూ యుద్ధ నేపథ్యంలో సినిమాలే. రాజులు, యుద్ధాల కథతో ‘బాహుబలి’ తెరకెక్కితే... రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 1945లో జరిగిన ప్రేమకథగా ‘1945’ రూపొందుతోంది. ‘బాహుబలి’లో భల్లాలదేవ ప్రేమకథ సక్సెస్‌కాలేదు. ఎందుకంటే... విలన్ కదా! ‘1945’లో రానా హీరో. సో, ఈ ప్రేమకథకు హ్యాపీ ఎండింగే ఉంటుంది. కానీ, ఆ ప్రేమ యుద్ధం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఇందులో రెజీనా హీరోయిన్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేస్తామని రానా పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. రానా రాయల్ రైడ్! 1945 కాలంనాటి కథతో సినిమా అంటే... సినిమాలో ప్రతి సీన్ 1945లో తీసినట్టుండాలి. అంటే... హీరో లుక్, హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి హీరో ఉపయోగించే ప్రతి వస్తువూ, సినిమాలోకనిపించే ప్రతి ఏరియా 1945ను తలపించాలి. అందుకోసం చిత్రబృందం కృషి చేస్తుందనడానికి ఉదాహరణే... మీరు చూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బండి. ‘1945’లో రానా రైడ్ చేయనున్న బండి ఇదే. -
గతంలో నేనొకరిని ప్రేమించా : హీరోయిన్
చెన్నై: గతంలో నేనొకరిని ప్రేమించా. ఆ కారణంగానే ఇలా మాట్లాడుతున్నా.. అంటోంది హీరోయిన్ రెజీనా కసంద్రా. కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో చాలా క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళ చిత్రాలు ఆమెకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్ంలో ఎస్జే. సూర్యతో నటించిన నెంజమ్ మరప్పదిల్లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు. ‘జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించినది ఇది. అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ తొందర పడటం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడటానికి కారణం ఏమిటీ, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడటానికి అదే కారణం. అయినా ఆ విషయోల్లోకి వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. హీరోయిన్గా చిన్న గ్యాప్ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమైనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనసుపూర్తిగా నిర్ణయించుకున్నాను’ అని తన విషయాలను పంచుకుంది. -
హాయ్ రాజమండ్రి..
రాజమహేంద్రవరంలో రెజీనా సందడి దానవాయిపేట (రాజమహేంద్రవరం) : ప్రముఖ సినీ నటి రెజీనా కాసేండ్ర ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన నీరూస్ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి, షోరూమ్‌లోని పలు కౌంటర్ల వద్ద ఉంచిన ప్రత్యేక డిజైనర్ చీరలను తిలకించింది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, నగరంలో ఇది నీరూస్ మొదటి షోరూమ్ అని, దీనిని సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారని అన్నారు. మహిళలు, చిన్నారులకు కావలసిన అన్ని రకాల డిజైనర్ వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడు నూతన షోరూమ్‌లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒకటి, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ హరీష్‌కుమార్, డైరెక్టర్లు నీరూస్ కుమార్, అవినాష్‌కుమార్, సింగార్ సింధు, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.రాజ్‌కిషోర్, కాంట్రాక్టర్ తోట సుబ్బారావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
'శౌర్య' మూవీ రివ్యూ
టైటిల్ : శౌర్య జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : మంచు మనోజ్, రెజీనా, ప్రకాష్ రాజ్, నాగినీడు, సుబ్బరాజు సంగీతం : వేద దర్శకత్వం : దశరథ్ నిర్మాత : మల్కాపురం శివకుమార్ కరెంటు తీగ లాంటి హిట్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ సరికొత్త అవతారంలో శౌర్యగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎక్కువగా ఎనర్జిటిక్ రోల్స్‌లోనే కనిపించిన మనోజ్, ఈ సినిమాలో డీసెంట్ లుక్‌తో, సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే తీసిన దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమాతో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానుల మెప్పించడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్ తో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న శౌర్య థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్‌ను ఆ స్ధాయిలో థ్రిల్ చేశాడా..? కథ : శౌర్య( మంచు మనోజ్), నేత్ర (రెజీనా) చాలా కాలంగా ప్రేమించుకుంటుంటారు. వీరి పెళ్లికి నేత్ర తండ్రి సత్యమూర్తి(నాగినీడు), బాబాయి కృష్ణమూర్తి(సుబ్బరాజు) ఒప్పుకోలేదన్న కారణంతో తన గోల్‌ను కూడా వదులుకొని యుకె వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న శౌర్య, చివరిసారిగా నేత్ర మొక్కు చెల్లించటం కోసం శివరాత్రి జాగరం చేయటానికి ఆమె సొంత ఊరికి వస్తారు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో నేత్ర మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. శౌర్య పక్కన ఉండగానే ఎవరో నేత్ర గొంతుకోసి పారిపోతారు. ఆ నేరం, ఆమెతోనే ఉన్న శౌర్య మీద పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారు. ఇంతకీ నేత్ర మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు..? ఆ కేసు శౌర్య మీదకు ఎందుకు వచ్చింది..? శౌర్య ఈ కేసు నుంచి బయటపడి అసలు నేరస్థులను ఎలా పట్టించాడు..? అన్న అంశాన్ని ఆసక్తి కరమైన మలుపులతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కించారు. నటీనటులు : ప్రతీ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే మనోజ్ ఈ సినిమాతో సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు యాంగిల్స్‌ను పర్ఫెక్ట్గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. రెజీనా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. నాచురల్ యాక్టింగ్‌తో కథను ముందుకు నడిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రకు ధీటుగా పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, శియాజీ షిండేలు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్ శీను కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. సాంకేతిక నిపుణులు : మంచి కథను ఆసక్తికర మలుపులతో రాసుకున్న దర్శకుడు దశరథ్, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా నడవటంతో థ్రిల్లర్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఆ లోటును కవర్ చేస్తూ సెకండాఫ్‌లో కథలో వేగం పెంచటంతో పాటు మంచి ట్విస్ట్‌లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌కు మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగించాడు. వేదా అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, నేపథ్య సంగీతం మాత్రం బాగానే వచ్చింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫిలు పరవాలేదు. సినిమాకు కీలకమైన ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ప్లస్ పాయింట్స్ : కథ క్లైమాక్స్ మంచు మనోజ్, ప్రకాష్ రాజ్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ పాటలు ప్రొడక్షన్ వాల్యూస్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్. -
రెజీతో ఈజీగా...
-
'సుబ్రమణ్యం ఫర్ సేల్' రివ్యూ
టైటిల్ : సుబ్రమణ్యం ఫర్ సేల్ జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామ తారాగణం : సాయి ధరమ్ తేజ్, రెజీనా, ఆదాశర్మ, నాగబాబు, సుమన్, రావు రమేష్ దర్శకత్వం : హరీష్ శంకర్ సంగీతం : మిక్కీ జె మేయర్ నిర్మాత : దిల్‌రాజు 'పిల్లా నువ్వులేని జీవితం' లాంటి సూపర్‌హిట్ సినిమా తరువాత మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ అదే బ్యానర్లో అదే హీరోయిన్‌తో చేసిన సినిమా కావటంతో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' రిలీజ్‌కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా 'రామయ్యా వస్తావయ్యా' లాంటి ఫెయిల్యూర్ తరువాత హరీష్ శంకర్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాడు. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకొని సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. మరి 'సుబ్రమణ్యం ఫర్ సేల్' హీరో సాయికి, డైరెక్టర్ హరీష్ శంకర్‌కు ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం. కథ: కర్నూలులోని ఓ పెద్ద కుటుంబానికి చెందిన సీత (రెజీనా) తన తండ్రి రెడ్డప్ప (సుమన్) ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడన్న కోపంతో ఇంట్లో నుంచి పారిపోతుంది. కుటుంబానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో అమెరికా చేరిన సీతకు, తన జీవితంలోని ప్రతి నిమిషాన్ని డాలర్లుగా మార్చాలన్న కసితో ఉన్న సుబ్రమణ్యం (సాయి ధరమ్ తేజ్ ) పరిచయం అవుతాడు. అదే సమయంలో వారితో కలిసిన చింతకాయ్ (బ్రహ్మనందం), రెజీనా, సుబ్బులు మంచి మిత్రులవుతారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్న కోపంతో సీతను కుటుంబసభ్యులు ద్వేషిస్తుంటారు. అదే సమయంలో తన చెల్లెలు (తేజస్వి) పెళ్లికి రావాలనుకున్న సీత... సుబ్బును తన భర్తగా నటించమంటుంది. అలా తిరిగి కర్నూలు చేరిన కథ ఎలాంటి మలుపు తిరిగింది. సుబ్బుకు అప్పటికే గోవింద్ (అజయ్), అతని చెల్లెలు దుర్గ (ఆదాశర్మ)లతో ఉన్న శతృత్వం ఏంటన్నదే మిగతా కథ. నటన: తొలి సినిమాతోనే తానేంటో రుజువు చేసుకున్న సాయి ధరమ్‌తేజ్ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. అయితే ఎక్కువ సన్నివేశాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల బాడీలాంగ్వేజ్, డైలాగ్ మాడ్యూలేషన్లను ఇమిటేట్ చేయటంతో ఒరిజినాలిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ రెజీనా గ్లామర్‌తో పాటు నటిగా కూడా ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్, కామెడీ సీన్స్‌లో కూడా తన మార్క్ చూపించి సీత క్యారెక్టర్‌కు తనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ప్రూవ్ చేసుకుంది. నాగబాబు, సుమన్, రావు రమేష్ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు: పాత కథను సరికొత్తగా వెండితెర మీద ఆవిష్కరించటంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు, ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసి మంచి ఎంటర్టైనర్ను తెరకెక్కించాడు. ఇక హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయటంలో, హీరోయిజం బిల్డప్ చేయటంలో తనకు తిరగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. పంచ్ డైలాగులు, యాక్షన్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించాడు. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం, రామ్ లక్ష్మణ్ స్టంట్స్ మరింత ప్లస్ అయ్యాయి. విశ్లేషణ: విడుదలకు ముందు నుంచి చెపుతున్నట్టుగానే దొంగమొగుడు, బావగారు బాగున్నారా.., పరుగు, బృందావనం లాంటి సినిమాల ఇన్స్పిరేషన్తో ఈ సినిమా కథను రెడీ చేసినట్టుగానే కనిపిస్తుంది. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినా హరీష్ తన టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా స్టార్టింగ్‌లో కథలోకి వెళ్లడానికి కాస్త ఆలస్యం అయినట్టు అనిపిస్తుంది. పాత్రలను ఎస్టాబ్లిష్ చేయటంలో తన మార్క్ చూపించిన దర్శకుడు, సాయి ధరమ్‌తేజ్ ఎనర్జీని బాగా ప్రజెంట్ చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. తొలి భాగం అంతా ఎక్కువగా సాయి, రెజీనా లవ్ సీన్స్ మీదే దృష్టిపెట్టడంతో బోర్ ఫీలింగ్ వస్తుంది. కథ కర్నూలు చేరాక వచ్చిన కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. బ్రహ్మనందం కామెడీతో పాటు, మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్స్ కమర్షియల్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటాయి. ప్లస్ పాయింట్స్ సాయిధరమ్‌తేజ్ రెజీనా సెకండాఫ్ కామెడీ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ ఫస్టాఫ్లొ కొన్ని సీన్స్ ఓవరాల్‌గా సుబ్రమణ్యం ఫర్ సేల్ రొటీన్ ఫార్ములాతో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ -
‘పిల్లా నువ్వు లేని జీవితం’ సందడే సందడి
అనకాపల్లి రూరల్ : అనకాపల్లి పట్టణంలోని సత్యసాయి, పర్తిసాయి థియేటర్లలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. మధ్యాహ్నం ఆట సమయంలో వచ్చిన యూనిట్ బృందం సినిమా డైలాగ్‌లు చెపుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ తన మొదటి చిత్రాన్ని పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ ప్రేక్షకదేవుళ్లకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తన తదుపరి చిత్రం హరీష్ శంకర్ డెరైక్షన్లోసాయి ధరమ్‌తేజ్ హీరోగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కేరింత సినిమా నిర్మిస్తున్నామన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి, నటి హేమ పాల్గొన్నారు. -
పిల్లా.. నువ్వు లేని జీవితం టీమ్‌తో ముచ్చట్లు!
-
సుబ్రమణ్యం ఫర్ సేల్
‘‘ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ నెల 27 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి మార్చి వరకూ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాం. ఏప్రిల్ నుంచి అమెరికాలో షూటింగ్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘‘మిరపకాయ్’ టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. ‘గబ్బర్‌సింగ్’ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది’’ అని హరీశ్‌శంకర్ తెలిపారు. మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సాయిధరమ్‌తేజ్ అన్నారు. ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళ్తామా అని ఎదురు చూస్తున్నానని రెజీనా చెప్పారు. చిత్రబృందం కూడా సమావేశంలో పాల్గొన్నారు. -
'చక్కిలిగింత' ఫస్ట్ లుక్ లాంఛ్
-
లిప్ లాక్స్ లో రెజీనా టాప్!
చెన్నై నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన హీరోయిన్ రెజీనా ఇక్కడ ప్రతి హీరోతో లిప్‌లాక్ సీన్లలో నటిస్తూ దుమ్ముదులిపేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ప్రతి చిత్రంలో లిప్ లాక్ సీన్స్‌కు గ్రీన్ సిగ్నెల్స్ ఇచ్చేస్తోంది. ప్రతి హీరోకి లిప్ లాక్స్ వేసి యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాంతో హిట్, ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటుంది. రొటీన్ లవ్ స్టోరీ, రా..రా..కృష్ణయ్య, పవర్ చిత్రాలలో ఈ అమ్మడు సందీప్ కిషన్, రవితేజల లిప్ కిస్‌లు అందుకుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్‌లో కూడా అదే తరహాలో రొమాన్స్‌ని ఘాటుగా పండించడానికి సిద్ధంగా ఉంది. చిన్న సినిమాల్లో నటిస్తూ ఈ బ్యూటీ అభిమానుల గుండెల్లో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది. లో బడ్జెట్, హై బడ్జెట్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ ముద్దుల గుమ్మ నటించిన ఏ మూవీకి సక్సెస్ టాక్ రాలేదు. అయినా రెజీనా అందం మాత్రం కుర్రకారుకి తెగ నచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో రెజీనా చేరిపోయింది. ** -
‘కొత్త జంట’ ఆడియో ఆవిష్కరణ
-
‘కొంత్త జంట’ మూవీ స్టిల్స్