డేట్‌ గుర్తు పెట్టుకుంటారా? | Ek Ladki Ko Dekha Toh Aisa Laga is set to release on February 1, 2019 | Sakshi
Sakshi News home page

డేట్‌ గుర్తు పెట్టుకుంటారా?

Published Sun, Jul 29 2018 1:32 AM | Last Updated on Sun, Jul 29 2018 1:32 AM

Ek Ladki Ko Dekha Toh Aisa Laga is set to release on February 1, 2019 - Sakshi

అనిల్‌ కపూర్

నాటి తరం ప్రేమకథతో పాటు ఈ తరం ప్రేమకథను కూడా ఒకే షోలో చూడండి అంటున్నారు ‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఏసా లగా’ టీమ్‌. అందుకోసం డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్, సోనమ్‌ కపూర్, రెజీనా, రాజ్‌కుమార్‌ రావ్, జూహీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం రెజీనా, సోనమ్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సినిమాలో తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి తొలిసారి నటిస్తున్నారు సోనమ్‌ కపూర్‌. అనిల్‌ కపూర్‌కు ప్రేయసిగా జూహ్లీ చావ్లా నటించారట. అలాగే రెజీనాకు బీటౌన్‌లో ఫస్ట్‌ మూవీ ఇది. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌కు జోడీగా రెజీనా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్‌గా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘ఫిబ్రవరి 1, 2019 డేట్‌ను మర్చిపోవద్దు. మా సినిమాను అదే రోజున రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు సోనమ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement