
సోనమ్ కపూర్, జూహీ చావ్లా
పెళ్లి తర్వాత ఇన్ని రోజులు ఫ్యామిలీ మోడ్‌లో టైమ్ స్పెండ్ చేసిన సోనమ్ కపూర్ తిరిగి వర్క్‌మోడ్‌లోకి వచ్చేశారు. హిందీ చిత్రం ‘ఏక్ లడకీ కో దేఖా తో ఏసా లగా’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. షెల్లీ చోప్రా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్, రెజీనా ముఖ్య తారలుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో తొలిసారి తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు సోనమ్. ప్రస్తుతం జూహీ చావ్లా, సోనమ్ కపూర్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో సోనమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment