ఇప్పుడు రీల్‌ డాడ్‌ అండ్‌ డాటర్‌ | Anil Kapoor and Sonam Kapoor's first film together to release on october 12 | Sakshi
Sakshi News home page

ఇప్పుడు రీల్‌ డాడ్‌ అండ్‌ డాటర్‌

Published Thu, Feb 1 2018 1:09 AM | Last Updated on Thu, Feb 1 2018 1:10 AM

Anil Kapoor and Sonam Kapoor's first film together to release on october 12 - Sakshi

అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌

‘ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఏశా లగా....’ అంటూ ‘1942 ఎ లవ్‌ స్టోరీ’ సినిమాలో మనీషా కొయిరాలా కోసం అనిల్‌ కపూర్‌ పాడిన లవ్‌ సాంగ్‌ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన 24 ఏళ్లకు అనిల్‌ కపూర్‌  ‘ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఏశా లగా’ పేరుతో సినిమా చేయడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఇందులో ఆయన ముద్దుల కూతురు సోనమ్‌ కపూర్‌ కూడా నటిస్తున్నారు. ఇంకో విశేషం కూడా ఉంది. ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌కు జోడిగా జూహీ చావ్లా నటిస్తున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్‌ డే షూటింగ్‌ క్లాప్‌ బోర్డ్‌ను పోస్ట్‌ చేసి, ‘‘ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్లకు ఫస్ట్‌ టైమ్‌ మా నాన్నగారితో కలిసి యాక్ట్‌ చేస్తున్నాను.

మీకు ‘ఆన్‌ స్క్రీన్‌ డాటర్‌’గా కనిపించబోతున్నందుకు చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను. థాంక్యూ షెల్లీ చోప్రధర్‌ (చిత్రదర్శకుడు). ఇంత ఇంట్రెస్టింగ్‌ స్టొరీ రాసినందుకు. ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు విధు వినోద్‌ చోప్రాకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు సోనమ్‌. దానికి అనిల్‌ కపూర్‌ ‘‘మనిద్దరం కలిసి యాక్ట్‌  చేద్దాం అంటే నువ్వు డైరెక్ట్‌గా రిజెక్ట్‌ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూడు.. ఎక్కడున్నామో? నీకు ఎగై్జటెడ్‌గా ఉందేమో.. నాకు మాత్రం చాలా నెర్వస్‌గా ఉంది’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. రియల్‌ లైఫ్‌లో తండ్రీ కూతురైన అనిల్, సోనమ్‌లను రీల్‌పై డాడ్‌ అండ్‌ డాటర్‌గా చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది. ఈ సినిమా అక్టోబర్‌ 12న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement