
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్‌గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment