seemantham
-
బిగ్‌బాస్ సుజాత సీమంతం 'ఫోటోలు' షేర్ చేసిన రాకింగ్ రాకేశ్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా బిగ్‌బాస్ మానస్ భార్య సీమంతం ఫంక్షన్ (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్ ఉంటుంది. ఒక్క సీరియల్ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. బుల్లితెర నటి సీమంతంఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.వేడుకల ఫోటోలు2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Swapnakondamma Varakavi (@bujjivarakavi) చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్‌మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్ ఆఫర్ -
వేడుక వేళ.. ఆనంద హేల
హీరోయిన్ అమలా పాల్ తల్లి కాబోతున్నారు. తాజాగా తన సీమంతం వేడుక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. భర్త జగత్ దేశాయ్‌తో కలిసి అమలా పాల్ గుజరాత్‌లోని సూరత్‌లో ఈ వేడుక జరుపుకున్నారు. ‘ట్రెడిషన్ అండ్ లవ్’ అనే క్యాప్షన్‌తో అమలా పాల్ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుక వేళ అమల, జగత్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక కొన్ని సంవత్సరాలు రిలేషన్షిప్ కొనసాగించి 2023లో అమలా పాల్, జగత్ దేశాయ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేశ్? ఫోటో వైరల్!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అదే వారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. అలా సుజాత.. తన మాటల ప్రవాహంతో ఫేమస్ అయింది. అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ జోర్దార్ సుజాతగా పేరు సంపాదించుకుంది. మొదట్లో టీవీ ఛానల్లో వార్తలు చదివింది. తర్వాత బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది. టీవీ షోలతో బిజీ అయింది. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్‌ను పెళ్లి చేసుకుంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో నటిగా మారింది. తాజాగా ఆమె సీమంతం జరిగిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో సుజాత.. పర్పుల్ కలర్ సారీలో నిండా నగలు ధరించి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటోను గెటప్ శ్రీను భార్య సుజాత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంటూ హ్యాపీ ఫర్ యూ.. కంగ్రాచ్యులేషన్స్ అని రాసుకొచ్చింది. అయితే సుజాత.. తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంతవరకు చెప్పనేలేదు. కానీ కొంతకాలంగా ఆమె ఏ వీడియో షేర్ చేసినా జనాలు దాని కింద మీరు ప్రెగ్నెంట్ కదా.. అని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడిలా సీమంతం చేసుకున్నట్లుగా ఫోటో బయటకు రావడంతో సుజాత ప్రెగ్నెన్సీ నిజమేనంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: వంద కోట్లకు చేరువలో క్రూ.. అంత స్పెషల్ ఏముందబ్బా? -
నందు ఇంట సెలబ్రేషన్స్ మొదలు.. సీమంతం వేడుక చూశారా?
టాలీవుడ్ టాప్ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి మాతృత్వపు మధురిమను మరోసారి అనుభవించేందుకు తహతహలాడుతోంది. నందు- గీతా దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రానుంది. ఈ విషయాన్ని గత డిసెంబర్లో వెల్లడించింది గీతా మాధురి. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. (గీతా మాధురి సీమంతం వేడుక ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీమంతం ఫంక్షన్లో గీతా.. ఆకుపచ్చ- నారింజ కాంబినేషన్లో ఉన్న చీరలో మెరిసిపోయింది. బ్యాగ్రౌండ్లో కూడా అంతా సహజంగా కనిపించేలా పూలతో డెకరేషన్ చేశారు. చదవండి: స్టార్ కమెడియన్ సంపాదించిందెంత? కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్‌కు చుక్కలు చూపించిన నటి.. బ్రేకప్‌తో శని వదిలిందంటూ.. -
Mukku Avinash Wife Anuja Baby Shower Pics: జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుకలు (ఫోటోలు)
-
Poorna Latest Photos: కేరళ సంప్రదాయంలో పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్
-
గాడిదలకు సీమంతం
-
గాడిదలకు సీమంతం.. ఆశ్చర్యంగా ఉందే..! వీడియో వైరల్
గుజరాత్: గాడిదలకు సీమంతం ఏంటి.. ఆశ్చర్యంగా ఉందే అనుకుంటున్నారా?. ప్రత్యేక జాతి అయిన హలరీ గాడిదలు అంతరించిపోయే ప్రమాద జాబితాలో ఉండటంతో వాటికి కాపాడుకునేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రజలు వినూత్నంగా ఆలోచించారు. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడంతో పాటు, గర్భం దాల్చిన వాటికి సీమంతం చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, వీటి సంఖ్యను పెంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. గుజరాత్లో ఈ జాతికి చెందిన గాడిదలు కేవలం 450 మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటి పాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో అంతరించిపోతున్న ఈ జాతి గాడిదల ధరలు ఒక్కొక్కటి సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంది. ఈవీ అంతరించిపోకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఈ జాతిని రక్షించడానికి, ప్రోత్సహించడానికి సింబయాసిస్ సంస్థ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల రాజ్‌కోట్ జిల్లా ఉప్లేటా తాలూకాలోని కోల్కి గ్రామంలో హలరీ జాతి గాడిద ఈనడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజలు చేసి, ఆహారం పెట్టారు. హలారి గదర్భ సంవర్ధన్ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆడ గాడిదలకు తిలకం, కుంకుమ, బియ్యం, గులాబీ చున్నీ (దుపట్టా), పూల దండలు సమర్పించడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా వచ్చారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగితో బీజేపీ నేత డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్.. -
తల్లి కాబోతున్న యాంకర్ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్
నటి, యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్‌గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్‌బై చెప్పింది. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య View this post on Instagram A post shared by ✨Ashwini sharma✨🧿 (@ashwinisharma_official) -
ఘనంగా ‘స్వామిరారా’ నటి పూజా రామచంద్రన్ సీమంతం..ఫోటోలు వైరల్
-
ఘనంగా ‘స్వామిరారా’ నటి సీమంతం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
ప్రముఖ నటి పూజా రామాచంద్రన్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కనుల పండుగగా జరిగిన ఈ సీమంత వేడుకలో పూజా దంపతుల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా భర్త జాన్ కూడా నటుడనే విషయం తెలిసిందే. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ వన్.. నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో అతడు విలన్ పాత్రలు పోషించాడు. కాగా పూజా తెలుగులో స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. కాగా పూజా రామ చంద్రన్- జాన్ కొకెన్ల వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందు 2017లో విజె క్రెగ్‌తో పూజా వివాహం జరిగింది. చదవండి: ‘యశోద’ లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
బుల్లితెర నటి వైష్ణవి సీమంతం ఫోటోలు వైరల్
బుల్లితెర నటి వైష్ణవి రామిరెడ్డి పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ వీడియోలతో నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇటీవలే ఆమె తల్లి కాబోతున్న శుభవార్తను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే! తాజాగా తనకు సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పింక్ కలర్ పట్టు చీరలో మెరిసిపోతున్న వైష్ణవి ముఖం కళకళలాడుతోంది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు నటికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతేడాది సురేశ్ అనే వ్యక్తిని పెళ్లాడింది వైష్ణవి. సెప్టెంబర్‌లో తాను గర్భవతినన్న విషయాన్ని బయటపెట్టింది. View this post on Instagram A post shared by Vyshnavee Gade (@i_vyshnaveeramireddy) View this post on Instagram A post shared by Vyshnavee Gade (@i_vyshnaveeramireddy) చదవండి: నా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు: సీనియర్ నటి -
సీమంతం వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన లాస్య.. వీడియో వైరల్
ప్రముఖ యాంకర్ లాస్య మంజునాథ్ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది లాస్య. తాజాగా ఆమె సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో బిగ్‌బాస్‌లో సందడి చేసిన మెహబూబా, దేత్తడి హారిక, గీతూ రాయల్ తదితరులు పాల్గొన్ని హల్ చేశారు. ఇప్పటికే లాస్య సీమంతంకు సంబంధించిన సీమంతం ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) తాజాగా లాస్య సీమంతంకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంది. అందులో లాస్య భర్త మంజునాథ్ ఆమెను స్టేజ్‌పైకి తీసుకెళ్లడం.. మెడలో దండేసి, తిలకం పెట్టి, నుదుటిపై ముద్దు ఇస్తున్నాడు. అలాగే మరో వీడియోలో ఓ హిందీ పాటకు స్నేహితులతో కలిసి లాస్య డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. 2019లో ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం ఫంక్షన్...ఫోటోలు వైరల్
-
ప్రముఖ బుల్లితెర నటి సీమంతం ఫొటోలు వైరల్
పల్లవి రామిశెట్టి.. కొన్నేళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటిగా కొనసాగుతోంది. పలు ఛానళ్లలోని సీరియల్స్‌లో తళుక్కుమని మెరిసిందీ అచ్చ తెలుగు అమ్మాయి. సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అభిమానుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందీ నటి. 2009లో కెరియర్ ప్రారంభించిన ఆమె త్వరలో తల్లి కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె సీమంతం జరుపుకుంది. ఈ వేడుకకు ఇతర బుల్లితెర నటులు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు త్వరలో తల్లి కాబోతున్న పల్లవి-దిలీప్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: లలిత్ మోదీతో డేటింగ్.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్ షూటింగ్లో ప్రమాదం.. మరోసారి హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు -
లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో తల్లి కాబోతున సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఆగష్టులో బిడ్డకు జన్మినివ్వబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కేవలం తన భర్త, సోదరి రియా కపూర్ అత్యంత సన్నిహితుల మధ్య సోనమ్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోదరి రియా కపూర్ షేర్ చేసింది. ఈ వేడుకలో సింగర్ లియో కల్యాణ్ పాట పాడుతూ అందరిని అలరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన సీమంతం వేడుకలో సోనమ్ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి క్యూట్‌గా నవ్వుతు ఫొటోలకు ఫోజులిచ్చింది. కాగా సోనమ్ ప్రస్తుతం తన భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌లో ఉంటుంది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. కాగా సోనమ్.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Leo Kalyan (@leokalyan) -
ఘనంగా నమిత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్
‘సొంతం’, ‘జెమిని’, 'బిల్లా' ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె త్వరలో తల్లి కాబోతోంది. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. భర్తతో కలిసి బేబీ బంప్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా నమితకు సీమంతం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరగ్గా 41 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం. చదవండి: హోటల్లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు కమల్ హాసన్ 'విక్రమ్' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
హీరోయిన్ ప్రణీత సుభాష్ సీమంతం ఫంక్షన్ ( ఫొటోలు )
-
హీరోయిన్ ప్రణీత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్
హీరోయిన్ ప్రణీత సుభాష్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! గత నెలలో స్కానింగ్ కాపీని చూపిస్తూ గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిందీ ప్రణీత. ఇటీవలే బేబీ బంప్ ఫొటోలను సైతం నెట్టింట షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. తాజాగా ప్రణీతకు సీమంతం జరిగింది. పసుపు పచ్చని చీరలో అందంగా ముస్తాబైన ఆమె అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సీమంతం ఫొటోలు చూసిన అభిమానులు హీరోయిన్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా సెకండ్ లాక్డౌన్లో అంటే 2021 సంవత్సరంలో మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది ప్రణీత. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఈ హీరోయిన్.. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం అదే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. తన లైఫ్‌లో జరిగే ప్రతి మంచి విషయాన్ని సైతం ఫ్యాన్స్‌కు తెలియజేస్తానంది. View this post on Instagram A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) చదవండి: షూటింగ్లో గాయాలు, వీడియో షేర్ చేసిన హీరో -
రెండోసారి గ్రాండ్‌గా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్
హీరోయిన్ సంజనా గల్రానీ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్ గత నెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో సీమంతం జరుపుకుంది. అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. తాజాగా అందరి సమక్షంలో మరోసారి గ్రాండ్‌గా సీమంతం చేసుకుంది సంజనా. ఈసారి ముస్లిం పద్ధతిలో ఈ వేడుక చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. తన యోగక్షేమాలను పట్టించుకునేవారిని మాత్రమే ఈ శుభకార్యానికి ఆహ్వానించానని తెలిపింది. అలా ఓ 300 మందికి ఆహ్వానం పంపామంది. ఈ ఫంక్షన్‌కు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫంక్షన్‌లోని మెనూలో మటన్ బిర్యానీ హైలైట్ అని చెప్పింది. మరో 20 రోజుల్లో చిన్నారి బుజ్జాయి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందంటూ తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) చదవండి: సమంత 'ఊ అంటావా మావా' పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో అక్కడికి ఎందుకు వెళ్లాలి? బాలీవుడ్‌పై మహేశ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు -
హీరోయిన్ సంజనకు సీమంతం చేసిన స్నేహితులు
బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు సహా పలు విషయాలను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సౌత్ ఇండియన్ స్టైల్లో సీమంతం జరుపుకుంది. చదవండి: బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలను సంజన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది. 'కొన్నిసార్లు కుటుంబం కంటే కొంతమంది స్నేహితులే నయమనిస్తుంది. ఎంతో ప్రేమగా నా సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ నా సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు' అంటూ పేర్కొంది. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
ఘనంగా హీరోయిన్ కాజల్ సీమంతం.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal Baby Shower Photos Viral: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య కాజల్ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ ప్రెగ్నెన్సీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన కాజల్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక రీసెంట్‌గానే కాజల్ కూడా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
ఘనంగా ఉత్తేజ్ కూతురి సీమంతం.. ఫోటోలు వైరల్
Actor Uttej Daughter Chetana Baby Shower Photos Goes Viral: నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా వైభవంగా సీమంతం వేడుక జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తేజ్ చిన్నకూతురు పాట తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. త్వరలోనే నా హీరో లేదా హీరోయిన్ వస్తున్నారు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సీమంతం వేడుకకు సింగర్స్ గీతా మాధురి, శృతి సహా నటుడు తనీష్ సైతం హాజరయ్యారు. చదవండి: నటుడు ఉత్తేజ్ కూతురు బేబీ బంప్ ఫోటోలు వైరల్ హాట్ టాపిక్‌గా మారిన కృతిశెట్టి లిప్‌లాక్ సీన్ -
భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం
సాక్షి, గోకవరం(తూర్పుగోదావరి): భద్రాచలం, ఒంటిమిట్టలలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటకు శుక్రవారం సీమంతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పండిస్తున్న ఈ కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సీమంతం జరిపారు. పొట్టదశలో ఉన్న పంటకు గాజులు, రవిక, పండ్లు, పుష్పాలు సమర్పించారు. సీతారామ అష్టోత్తర సహస్రనామార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. శ్రీరామతత్వం ప్రచారం, కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ సారి భద్రాచలంకు, 5వ సారి ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలు పంపుతుండటం సంతోషంగా ఉందన్నారు. -
ఘనంగా ‘బిగ్‌బాస్’ ఫేం నటరాజ్ భార్య సీమంతం.. బుల్లితెర తారలే దిగివచ్చి!
-
బిగ్‌బాస్: వైభవంగా నటరాజ్ మాస్టర్ భార్య నీతూ సీమంతం.. ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి నటరాజ్ మాస్టర్ భార్య నీతూ నటరాజ్ గర్భవతి అనే సంగతి తెలిసిందే. భార్య ఏడు నెలల గర్భంతో ఉన్న సయమంలో ఆమెను వదిలేసి బిగ్‌బాస్ షోలోకి వెళ్లాడు. తొలుత వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నప్పటికీ భార్య ఫోర్స్‌తోనే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు షో ప్రారంభం రోజు నటరాజ్ మాస్టర్ చెప్పారు. తన బిడ్డ లోకంలోకి రాగానే తన చూడలేకపోవచ్చు కానీ బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్తాను అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. తాజాగా నీతూకు సీమంతం జరిపారు కుటుంబ సభ్యులు. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌కి బుల్లితెర తారలునవీన, శ్రీవాణి,అంజలి పవన్, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం సీమంతంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్ మాస్టర్ టాలీవుడ్ టాప్ హీరోలు, దర్శకులందరితో కలిసి పని చేశాడు. 2009లో తన శిష్యురాలు నీతూని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను తన భార్య నీతూతో కలిసి టీవీ షోలు, ఆడియో మరియు అవార్డు ఫంక్షన్లు వంటి 200 కి పైగా కార్యక్రమాలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న ఆయన ఇప్పుడు బిగ్ బాస్ ఐదో సీజన్లోకి వెళ్లాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా సీరియల్ నటి కీర్తి సీమంతం..ఫోటోలు వైరల్
ప్రముఖ సీరియల్ నటి కీర్తి సీమంతం తన నివాసంలో ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నటి కీర్తి భర్త ధనుష్ కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాకుండా కీర్తి బావ నిరుపమ్ అదేనండీ డాక్టర్‌బాబు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఈయన భార్య మంజలా పరిటాల కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. కీర్తి-దనుష్ మొదటిసారి తల్లిదండ్రులు కానుండటంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక కన్నడ సీరియల్స్‌తో బాగా గుర్తింపు పొందిన కీర్తి తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. చదవండి : మొదటిసారి కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ ఒంటరిగానే డెలివరీకి వెళ్లా.. హరితేజ ఎమోషనల్ వీడియో -
శ్రేయా సీమంతం
శ్రేయా ఘోషల్ మంచి గాయని. హిందీ చిత్రాలతో పాటు దక్షిణాదిన పలు పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో ‘శ్రీరామరాజ్యం’లోని ‘సీతా సీమంతం..’ ఒకటి. సినిమాలో నయనతార సీమంతం వేడుకప్పుడు వచ్చే పాట ఇది. ఇప్పుడు ‘శ్రేయా సీమంతం’ జరిగే వేళ వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘బేబీ.. శ్రేయాదిత్య (శ్రేయా, ఆమె భర్త తమ పేర్లు కలిపి బిడ్డకు పెట్టాలనుకున్నారని ఊహించవచ్చు) ఈజ్ ఆన్ ఇట్స్ వే. నాకు, శిలాదిత్య (శ్రేయా భర్త పేరు)కు చాలా థ్రిల్‌గా ఉంది. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను’’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు శ్రేయా ఘోషల్. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ హరితేజ సీమంతం వేడుక
-
దుష్టశక్తుల నుంచి గర్భిణీ స్త్రీని రక్షించుకొనేందుకే
ఈ సంస్కారాన్ని కూడా గర్భిణీస్త్రీకే జరుపుతారు. సీమంతోన్నయనం అనగా కేశాలని ఎత్తికట్టడం. పాపటను ఏర్పరచడం. దీనికే ఫలస్నపనమని ఇంకొకపేరు కూడా వుంది. గర్భిణీస్త్రీని ఆవహించుకుని వుండే దుష్టశక్తుల బారినుంచి గర్భిణీ స్త్రీని రక్షించుకొనేందుకే ఈ సంస్కారం చేయాలని శాస్త్రం. పుంసవనమూ, సీమంతోన్నయనమూ ఈరెండు సంస్కారాలూ గర్భరక్షణ కోసం చేస్తారు. ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలనే దానిమీద భిన్న వాదనలున్నా, తొలిచూలులో నాలుగు/ ఆరు/ ఎనిమిదవ మాసంలో ఈ సంస్కారం జరిపించాలని శాస్త్ర వచనం. ఒకవేళ తొలిచూలులో వీలుకాకపోతే రెండవ గర్భధారణ సమయంలో చేయాలని నియమం. ఈ సంస్కారాన్ని ఆ మాసంలోని శుక్లపక్షంలో, పురుష నక్షత్రాలలో అనగా అశ్వని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర అను నక్షత్రాలలో జరిపించాలి. సంస్కార విధానం: శుభదినాన, ఉదయాన్నే, గణపతి పూజ, పుణ్యహవాచనాలను జరిపించి, సంకల్పం చెప్పుకుని రక్షాబంధనము చేసి, సంతాన ప్రదాతలగు విష్ణువుకీ, త్వష్ట ప్రజాపతికీ, ఇతర దేవతలకూ హవిస్సులర్పించి, హోమగుండానికి పడమరవైపు తూర్పుముఖంగా గర్భిణీస్త్రీని కూర్చుండబెట్టి, అత్తిపండ్లగుత్తులు, ఇతర సమిధలు కలిపి ఆమె పాపటిని రేపాలి. తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పునకు చుట్టాలి. ఆ తరువాత పాపిటను కుంకుమతో అలంకరించి, తూర్పు లేక ఉత్తరదిశగా దంపతులిద్దరూ నడచి అక్కడవున్న కోడెదూడను తాకి నమస్కరించాలి. తరువాత, ఒక రాగిపాత్రలో వడ్లనుగానీ, యవధాన్యాన్నిగానీ వుంచి, విష్ణుర్యోనింకల్పయతు త్వష్టా రూపాణిపింశతు మొదలైన ఏడు ఋగ్వేదమంత్రాలను పఠిస్తూ, భర్త, గర్భిణీస్త్రీకి ఏడు దోసిళ్ళతో ఆ నీరు తాగించాలి. తర్వాత కుటుంబాచారాలను ఆచరించి, అందరి ఆశీర్వచనాలను తీసుకుని అందరికీ యథాశక్తి భోజనాదులనో లేక ఫలతాంబూలాదులనో సమర్పించాలి. (సశేషం) -
మెరిసిన సమీరా
కొత్త మెరుపుతో సమీరా రెడ్డి మెరిసిపోయారు. ఆ మెరుపు చూసి సమీరా భర్త అక్షయ్ వార్దే మనసు మురిసింది. ఇద్దరి ఆనందానికి సాక్షిగా కుమారుడు హన్స్ మెరిశాడు. ఇప్పుడు సమీరా రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. గురువారం ఆమె శీమంతం జరిగింది. ‘‘మనం నవ్వితే మనతో పాటు ఈ సమస్తం కూడా నవ్వుతుంది. ఆరోగ్యకరమైన నవ్వు, మానసికంగా ఆనందంగా ఉంటే అదే జీవితకాలపు సంతోషం. కాంచిపురం చీర కట్టుకోగానే నాకే నేను స్పెషల్‌గా కనిపిస్తున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోలను షేర్ చేశారు. ‘జై చిరంజీవ, నరసింహుడు, అశోక్’ సినిమాలతో అలరించిన సమీరా రెడ్డి 2014లో అక్షయ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నారు. 2015లో వీరికి కుమారుడు పుట్టారు. ఇప్పుడు రెండో బేబీ రాక కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృత్యువాత
-
సీమంతం రోజునే తిరిగిరాని లోకాలకు..
యడ్లపాడు (చిలకలూరిపేట)/గుంటూరు రూరల్: పెళ్లి అయిన నెలకే ఆ ఇంట శుభవార్త.. కడుపు పండిందన్న వార్తతో ఆ రెండు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఐదో నెలలో మెట్టినింట సంతోషాల మధ్య సీమంతం నిర్వహించారు. వేడుక పూర్తి అయిన తరువాత పుట్టింటికి తిరుగు ప్రయాణమైన ఆ గర్భిణిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనపెట్టుకుంది. ఆమెతోపాటు కారులో ఉన్న ఆమె తల్లి మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం యడవల్లికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్ మండలానికి చెం దిన తంగేళ్ల శ్రీనివాసరావు, అనసూర్య కుమార్తె జయశ్రీ (19)తో ఆగస్టులో వివాహమైంది. జయశ్రీ 5 నెలల గర్భవతి కావడంతో ఆమెకు సీమంతం నిర్వహించడానికి తల్లి అనసూర్య (40), బంధువు సుంకర రమాదేవి (37), ఆమె కుమార్తె రమ్య (18) సోమవారం వెళ్లారు. పండుగ వాతావరణంలో సీమంతం నిర్వహించారు. వారిని తీసుకువచ్చేందుకు రమాదేవి కుమారుడు శ్రీకాంత్ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్ సుమారు రాత్రి 11.45కు కారులో వెళ్లారు. జయశ్రీని వెంటబెట్టుకుని గోరంట్లకు వస్తుం డగా తిమ్మాపురం జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. 12.30కు జరిగిన ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న జయశ్రీ, అనసూర్య అక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న రమాదేవి, రమ్య, డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్, అతని పక్కన కూర్చున్న ఫ్రాన్సిస్‌కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు కూడా గాయాలపాలయ్యారు. జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల, ఫ్రాన్సిస్ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో పండుగ రోజున విషాదఛాయలు అలుముకున్నాయి. అతివేగం.. విపరీతమైన మంచు.. ట్రాక్టర్ ట్రాలీకి వెనుక భాగంలో రేడియం స్టిక్కరు లేకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో సీమంతం
మండ్య: పోలీస్‌స్టేషన్‌లో మమతానురాగాలు వెల్లివిరిశాయి. గర్భిణి అయిన తమ అధికారిణికి సిబ్బంది సీమంతం నిర్వహించి పండంటి బిడ్డ పుట్టాలని దీవించారు. జిల్లాలోని పాండవపుర తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఎస్ఐగా సుమారాణి బాధ్యతలు స్వీకరించారు. కొద్ది కాలం కిత్రం వివాహం చేసుకున్న సుమారాణి ప్రస్తుతం గర్భిణి. దీంతో ఆమెకు పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా సిబ్బంది శుక్రవారం ఘనంగా సీమంతం నిర్వహించారు.సహోద్యోగులు,సిబ్బంది కుటుంబ సభ్యులుగా మారి సీమంతం చేయడంతో ఎస్ఐ సుమారాణి భావోద్వేగానికి లోనయ్యారు. -
1111 మందికి సామూహిక సీమంతాలు
సాక్షి, హైదరాబాద్: అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంపాపేట్‌లోని సామ నర్సింహా రెడ్డి గార్డెన్స్‌లో 1111 మంది గర్భిణులకు సామూహిక సీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్వీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు. గర్భిణులకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు అమ్మ ఫౌండేషన్ సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమని నర్సింహారెడ్డి అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామ స్వప్నసుందర్ రెడ్డి పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్, సినీ నటి కవిత పాల్గొన్నారు. -
ఇటు ఏడిపించి.. అటు సీమంతాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: అంగన్వాడీ ఉద్యోగులపై కనికరం లేకుండా వ్యవహరించి చిత్రహింసలు పెడుతున్న ప్రభుత్వం వారితోనే సీమంతాలు చేయిస్తూ మహిళలను ఉద్ధరిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతోంది. రాష్ట్రంలో ఉన్న గర్భిణులందరికీ సీమంతాలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులను గుర్తించి వారికి చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పనిని అందులో పనిచేసే వర్కర్లకే అప్పగించినా ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. స్థానికంగానే దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి ఈ నెల 15నుంచి 31వ తేదీ లోపు సీమంతాలు చేయించాలని ఆదేశించింది. దీంతో అంగన్వాడీ వర్కర్లు కాళ్లకు బలపం కట్టుకుని దాతల చుట్టూ తిరిగి బతిమిలాడి సీమంతాలు చేయిస్తున్నారు. రాష్ట్రంలోని 52వేల అంగన్వాడీ కేంద్రాల పరిధిలో సుమారు మూడు లక్షల మంది గర్భిణులు ఉన్నట్లు అంచనా వేశారు. వీరందరికీ సీమంతాలు చేయించడం అంగన్వాడీ వర్కర్లకు పెద్ద పనిగా మారింది. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో శనివారం 600 మంది గర్భిణులకు సామూహికంగా సీమంతాలు చేశారు. విశాఖపట్నంలోని చోడవరం కమ్యూనిటీ ఆస్పత్రిలో 20 మంది గర్భిణులకు ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు దగ్గరుండి సీమంతాలు చేయించారు. ప్రస్తుతం ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా సీమంతాల హడావుడి పెద్దఎత్తున నడుస్తోంది. మూడు నెలలుగా జీతాల్లేవు... గర్భిణులను సంతోషపెట్టే పేరుతో సీమంతాల హడావుడి చేస్తున్న ప్రభుత్వం వారిని కనిపెట్టుకుని ఉంటున్న అంగన్వాడీ వర్కర్లకు మాత్రం మూడు నెలలుగా జీతాలివ్వడంలేదు. రాష్ట్రంలో 97వేల మంది అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని వారు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెంచిన జీతాలను ఇస్తామని చెప్పింది. కానీ అది ప్రకటనకే పరిమితమవడంతో అంగన్వాడీ ఉద్యోగులు కొద్దిరోజుల నుంచి మళ్లీ ఉద్యమబాట పట్టారు. ఆందోళనచేసిన ప్రతిసారి వారిపై ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు చేయించింది. తాజాగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపై మగ పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేస్తున్న ఉద్యోగులను బండబూతులు తిడుతూ అవమానించారు. అయినా ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వారికి జీతాలివ్వకపోగా అవి అడిగినందుకు దౌర్జన్యాలు చేయిస్తున్న ప్రభుత్వం సీమంతాలు చేయించే బాధ్యతలు వారికే కట్టబెట్టడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అంగవాడీలపై దమనకాండ సిగ్గుచేటు’ సాక్షి,హైదరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉందని పీడీఎఫ్ పక్షనేత ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం అన్నారు.ఉద్యమాలను క్రూర నిర్భందకాండతో అణచి వేయాలనుకోవడం ప్రభుత్వానికి తగదని స్పష్టం చేశారు. జీతాలు పెంచుతామని 4 నెలలు గడిచినా ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. టీడీపీకి అనుకూలంగా అంగన్వాడీ సంఘాలుండాలని ప్రభుత్వ ఉద్దేశంగా కన్పిస్తోందన్నారు. ప్రభుత్వం తన వ్యతిరేకవైఖరిని మానుకోని వెంటనే జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
స్నేహ అంతరంగావిష్కరణ
ఇంటర్వ్యూ స్నేహకి ఇప్పుడు రెండు గుండెలు. తనదో గుండె, తన కడుపులోని బిడ్డది మరోగుండె. మరో రెండు నెలల్లో ఆ ఇంట్లో ‘కువా కువా..’ శబ్దం వినిపించనుంది. ఇటీవలే సీమంతం జరుపుకున్న స్నేహ... అంతరంగావిష్కరణ ఈ ‘ఫన్డే’ స్పెషల్. ♦ అమ్మ కాబోతున్నానని తెలిసిన క్షణంలో ఏమనిపించింది? జీవితంలో ఇదో ప్రత్యేకమైన దశ. ‘మీరు అమ్మ కాబోతున్నారు’ అని డాక్టర్ నోటి నుంచి వినగానే ఒళ్లంతా పులకరించింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలున్నాయి. కానీ, ఈ ఆనందం చాలా ప్రత్యేకం. ♦ ఆనందమేనా? భయం కూడానా? భయం కాదు కానీ, ఒక్కసారిగా బాధ్యత పెరిగిపోయినట్లుగా అనిపించింది. జీవితంలో అన్ని బాధ్యతల్లోకెల్లా బిడ్డని కనడం, పెంచడం పెద్ద బాధ్యత. ♦ కొంతమందిని వేవిళ్లు (వాంతులు) తెగ ఇబ్బందిపెట్టేస్తాయ్... మీకలాంటివి? అదృష్టం కొద్దీ అలాంటివేవీ లేవు. కాకపోతే, అప్పుడప్పుడు నీరసంగా అనిపిస్తోంది. అదేం పెద్ద విషయం కాదు. ♦ మొదటిసారి స్కానింగ్‌లో...? మూడో నెలలో తీసినప్పుడు నామమాత్రంగా ఓ రూపం కనిపించింది. ఆ మాత్రానికే సంతోషం పట్టలేకపోయా. ఆనందంతో ఏడుపొచ్చేసింది. ♦ బిడ్డ గుండె చప్పుడు విన్నారా? అది సో స్వీట్. ‘నీకు పుట్టబోయే బిడ్డ హార్ట్ బీట్ వింటావా’ అని డాక్టర్ అడిగినప్పుడు చాలా ఎగ్జయిట్ అయిపోయాను. లబ్ డబ్ అని శబ్దం వినగానే, నా హార్ట్ బీట్ పెరిగినంత పనైంది. అదంతా ఆనందంతోనే. ♦ నెలలు నిండే కొద్దీ...? చిన్న చిన్న కాళ్లు, చేతులు చూసి, ‘జీవితం ఎంత మాయ. ఒక మనిషిలో ఇంకో మనిషి పెరగడమా’ అనుకున్నా. అప్పటికప్పుడు ఆ కాళ్లను ముద్దాడాలని మనసు తపించిపోయింది. ♦ గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? అక్క, వదినలను దగ్గరగా చూశాను. గర్భం ధరించినప్పట్నుంచీ, బిడ్డ పుట్టే వరకూ ఎలాంటి జాగ్రత్తలు పాటించారో, బిడ్డ పుట్టాక ఎలా పెంచారో చూశాను. ♦ బాబు కావాలనుకుంటున్నారా? పాపా? నాకూ, మా ఆయనకు (హీరో ప్రసన్న) ఎవరైనా ఓకే. ఫస్ట్ బేబీ అప్పుడు ఎవరైనా ఫర్వాలేదనుకుంటాం. మొదటిసారి బాబు పుడితే, రెండో సారి పాపను కోరుకుంటాం. అయినా మన చేతుల్లో ఏముంటుంది? ♦ ‘శ్రీరామదాసు’లో అమ్మ పాత్ర చేసే నాటికే మీరు అమ్మ అయ్యుంటే ఇంకా బాగా నటించేదాన్ని-అనుకున్నారా? లేదు, ఎందుకంటే, అప్పటికే ‘అమ్మా’ అనే పిలుపుకి నేను అలవాటు పడిపోయా. ♦ అదెలా? మా అక్క కొడుకు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తాడు. బయటవాళ్లు చూస్తే, వాడు నా కొడుకే అనుకుంటారు. ♦ అత్తవారింట్లో... మా అత్తగారింటికి రాబోతున్న మొదటి గ్రాండ్ చైల్డ్ కావడంతో అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో చాలామందికి ఏవేవో తినాలపిస్తుందట. నాకు మాత్రం ఏమీ తినాలనిపించడం లేదు. మా అత్తగారైతే నేనేం కావాలంటే అది చేసి పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ♦ మరి... మీ భర్త గురించి? ఆయనైతే మరీనూ. కాలు కిందపెడితే కందిపోతానేమో అనే టైప్‌లో చూసుకుంటున్నారు. ఇలా ఇంట్లో అందరూ ప్రత్యేకంగా చూడటం భలే ఉంటుంది. అందుకే, ఈ దశ జీవితాంతం గుర్తుండిపోతుంది. ♦ పసిపిల్లలకు స్నానం... అదీ...? మా అక్క పిల్లాడికి నేనే స్నానం చేయించేదాన్ని. శుభ్రంగా స్నానం చేయించి, కాసేపు ఎండ సోకేలా బిడ్డను కాళ్ల మీద పడుకోబెట్టుకుని, ఒంటి నిండా పౌడరు వేసి, మురిసిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరి సహాయమూ లేకుండా నా బిడ్డను నేనే పెంచగలుగుతాను. ♦ మీరు ప్రెగ్నెంట్ అని వినగానే అభిమానులు పటాసులు కాల్చి పండగ చేసుకున్న విషయం తెలుసా? అవునవును. ఆ ఫొటోలు మా ట్విట్టర్‌కి కూడా పంపించారు. కుప్పలు తెప్పలుగా శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ అందాయి. ‘స్నేహా సిస్టర్.. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ జాగ్రత్తలు చెప్పారు. ఆ అభిమానానికి కదిలిపోయాను. ♦ మళ్లీ సినిమాలు చేస్తారా? అసలు కెరీర్ గురించి ఏమీ ఆలోచించడంలేదు. ఇది ఎంజాయ్ చేసే దశ. దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. ♦ ఓకేనండీ.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాం... చాలా చాలా థ్యాంక్సండీ. - డి.జి. భవాని -
సౌందర్య రజనీకాంత్‌కు సీమంతం
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య సీమంతం సోమవారం స్థానిక రాయపేటలోని పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి లో నిరాడంబరంగా నిర్వహించారు. సౌందర్య కు వ్యాపారవేత్త అశ్విన్‌కు 2010లో వివాహం జరిగింది. రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉం డాలని కోరుకుంటున్నానన్నారు. అదే వేదికపై తన తొలి చిత్రం విడుదలానంతరం నాన్న మాటను పాటిస్తానని సౌందర్య అన్నారు. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరం గా ఉన్న సౌందర్య ఇటీవల గర్భం దాల్చారు. ఆమె సీమంతాన్ని సోమవారం రజనీ కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. -
టిడిపి సీమంత రాజకీయం..!
జన్మభూమి - మా ఊరు సభలో భాగంగా గర్భిణులకు చేస్తున్న సీమంతంలోనూ అధికార పార్టీ రాజకీయ ప్రచారం చేస్తోంది. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చీర, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన వాయనం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆ వాయనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ ఫొటోలు ఉండటంతో జన్మభూమికి వచ్చిన పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. చివరికి సీమంతం కార్యక్రమాల్లో సైతం అధికార పార్టీ తమ ప్రచారం మానుకోలేదంటూ ఎద్దేవాచేస్తున్నారు. - కృత్తివెన్ను