వేడుక వేళ.. ఆనంద హేల  | Amala Paul shared the photos of the Seemantam ceremony on social media | Sakshi
Sakshi News home page

వేడుక వేళ.. ఆనంద హేల 

Published Sun, Apr 7 2024 1:53 AM | Last Updated on Sun, Apr 7 2024 1:53 AM

Amala Paul shared the photos of the Seemantam ceremony on social media - Sakshi

అమలా పాల్, జగత్‌ దేశాయ్‌

హీరోయిన్‌ అమలా పాల్‌ తల్లి కాబోతున్నారు. తాజాగా తన సీమంతం వేడుక ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. భర్త జగత్‌ దేశాయ్‌తో కలిసి అమలా పాల్‌ గుజరాత్‌లోని సూరత్‌లో ఈ వేడుక జరుపుకున్నారు.

‘ట్రెడిషన్‌ అండ్‌ లవ్‌’ అనే క్యాప్షన్‌తో అమలా పాల్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ వేడుక వేళ అమల, జగత్‌ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక కొన్ని సంవత్సరాలు రిలేషన్‌షిప్‌ కొనసాగించి 2023లో అమలా పాల్, జగత్‌ దేశాయ్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement