Actress And Anchor Ashwini Sharma Shares Her Baby Shower Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Ashwini Sharma: తల్లి కాబోతున్న యాంకర్‌ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్‌

Published Wed, Feb 15 2023 8:12 PM | Last Updated on Wed, Feb 15 2023 8:39 PM

Actress, Anchor Ashwini Sharma Shares Her Baby Shower Photos - Sakshi

నటి, యాంకర్‌ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్‌గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్‌ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్‌బై చెప్పింది.

చదవండి: ఆ హీరోయిన్‌ అంటే క్రష్‌.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్‌ చరణ్‌

ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్‌న్యూస్‌ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్‌ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్‌ ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement