సీరియల్‌ నటి సీమంతం.. ఫోటోలు వైరల్‌ | Actress Swapna Kondamma Varakavi Shares Her Seemantham Pics | Sakshi
Sakshi News home page

సీమంతం.. వీడియో షేర్‌ చేసిన బుల్లితెర కమెడియన్‌

Published Thu, May 2 2024 4:20 PM | Last Updated on Thu, May 2 2024 5:38 PM

Actress Swapna Kondamma Varakavi Shares Her Seemantham Pics

తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్‌లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వ

సినిమా ఆర్టిస్టులకే కాదు.. సీరియల్‌ ఆర్టిస్టులకూ అంతే క్రేజ్‌ ఉంటుంది. ఒక్క సీరియల్‌ అయిందంటే అందులో ఉన్నవారందరినీ జనాలు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అలా ఎంతోమంది నటీనటులు తర్వాతి కాలంలో సీరియల్స్‌ చేసినా, చేయకపోయినా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. 

బుల్లితెర నటి సీమంతం
ఇటీవల నటి మహేశ్వరి సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకు పండంటి బాబు పుట్టగా.. ఆ వీడియోను సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. తాజాగా మరో బుల్లితెర నటి సీమంతం ఘనంగా జరిగింది. ముత్యాల ముగ్గు సీరియల్‌లో కొండమ్మ పాత్రలో నవ్వులు పూయించిన స్వప్న ప్రస్తుతం గర్భిణి.

వేడుకల ఫోటోలు
2022లో ఆమెకు పెళ్లయింది. త్వరలో ఆమె తల్లి కాబోతోంది. తాజాగా తనకు సీమంతం జరగ్గా ఆ వేడుకల ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మనసిచ్చి చూడు, ముత్యమంత ముగ్గు వంటి ధారావాహికల్లోనూ నటించింది. ప్రస్తుతం ఊహలు గుసగుసలాడె సీరియల్‌ చేస్తోంది.

 

 

చదవండి: ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్‌మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్‌ ఆఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement