తెలుగు సీరియల్‌ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్‌ పోస్ట్‌ | TV Actress Pavithra Jayaram In No More | Sakshi
Sakshi News home page

నటి మృతి.. ఒంటరిగా వదిలేసి పోయావంటూ చివరి ఫోటో షేర్‌ చేసిన నటుడు

Published Sun, May 12 2024 1:33 PM | Last Updated on Tue, May 14 2024 4:35 PM

TV Actress Pavithra Jayaram In No More

తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (మే 12న) జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్‌ నటి పవిత్ర జయరామ్‌ మరణించింది. ఈ విషాద వార్తను ఆమె భర్త, నటుడు చంద్రకాంత్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. 

నాకోసం వచ్చేసేయ్‌
'పాపా.. నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా! నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్‌.. నా కోసం తిరిగి వచ్చేయ్‌రా..' అని ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. కాగా పవిత్ర జయరామ్‌ స్వస్థలం కర్ణాటకలోని మాండ్య. మొదట్లో హౌస్‌ కీపర్‌గా, సేల్స్‌ గర్ల్‌గా పని చేసిన ఈమె తర్వాత కన్నడ సీరియల్స్‌లో అడుగుపెట్టింది. అక్కడి నుంచి నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 

ఒక్క సీరియల్‌తో ఫేమస్‌
'త్రినయని' సీరియల్‌ ద్వారా బాగా క్లిక్కయింది. ఇందులో తిలోత్తమగా విలనిజం పడించింది. అంతకుముందు కన్నడ సీరియల్స్‌ చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క ధారావాహికతో సంపాదించింది. నటుడు చంద్రకాంత్‌ కూడా ఇదే సీరియల్‌లో నటిస్తున్నాడు. నటి మరణవార్త తెలిసిన తారలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement