ఒకప్పుడు సీరియల్స్‌లో రఫ్ఫాడించింది నటి, నిర్మాత యాట నవీన. ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి రీల్స్, వీడియోలు చేస్తూ హడావుడి చేస్తోంది. ఆమె భర్త యాట సత్యనారాయణ దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే రజాకార్ సినిమాకు దర్శకత్వం వహించాడు.
అమ్మ ఎంతో కష్టపడింది
తాజాగా నవీన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా చిన్నప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చీరలమ్ముతూ, మిషన్ కుడుతూ పోషించింది. నేను షూటింగ్స్‌కు వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంది. నిజానికి నేను యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఇష్టంగా రాలేదు. పరిస్థితుల వల్ల డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటోషూట్ చేయించుకుని అవి పట్టుకునే తిరిగేవాళ్లం. దానికోసం మా అమ్మ తనదగ్గరున్న ఒకే ఒక బంగారు నగను అమ్మేసి నన్ను ఫోటోలు తీయించింది.
అరిస్తే ఏడ్చేశా
వీరివీరి గుమ్మడిపండు, కాదంటే ఔననిలే.. సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. ఇంకో రెండు సినిమాల్లో కథానాయికగా చేశాను కానీ రిలీజ్ కాలేదు. త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు.. నాకు యాక్టింగ్ సరిగా రావడం లేదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్స్‌లో అరిచేశాడు. ఏడ్చి వెళ్లిపోయాను. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.
కిలో బంగారం..
నాకు బంగారం అంటే చాలా ఇష్టం. కిలో బంగారం ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పటికే కిలోదాకా గోల్డ్ జమ చేశాను. ఒకసారి మేము పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయాము. ఓ సీరియల్ తీసేందుకు రూ.70 లక్షల దాకా ఖర్చు చేశాం. అగ్రిమెంట్స్ దగ్గర తేడా రావడంతో వంద ఎపిసోడ్లకే ఆ సీరియల్ ఆపేశారు. రూ.20 లక్షలు కూడా వెనక్కు రాలేదు. రూ.50 లక్షలు నష్టం రావడంతో మా దగ్గరున్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేశాం. మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాం' అని పేర్కొంది.
చదవండి: ఆ షో వల్లే అంతా తలకిందులు.. విడాకులు.. మానసికంగా దెబ్బతిన్నా!
Comments
Please login to add a commentAdd a comment