Naveena
-
‘కేరాఫ్ రవీంద్రభారతి ’ హిట్ కావాలి: మామిడి హరికృష్ణ
‘తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోని ప్రతి కళాకారుడి యొక్క డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. గత 64 ఏళ్ల నుంచి ఓ సాహిత్య కేంద్రంగా విలసిల్లుతూ.. ఒక ప్రామాణిక ఆడిటోరియంగా ఉంది. అందుకనే ప్రతి కళాకారుడు తన జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ కళా ప్రదర్శన చేయాలని తపన పడతాడు. లక్షలాది కళాకారులకి వేదికగా నిలిచిన రవీంద్ర భారతి నేపథ్యంలో ‘కేరాఫ్ రవీంద్రభారతి ’సినిమా తెరకెక్కడం సంతోషంగా ఉంది’ అన్నారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాత గా , గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కేరాఫ్ రవీంద్రభారతి’.జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన,మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతి లో జరిగింది.తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు,మామిడి హరికృష్ణ ముఖ్య అదితి గా విచ్చేసి డైరెక్టర్ కి కథ ని అందించి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా కష్టపడే వ్యక్తి. తన మొదటి సినీమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ నాకు తెలుసు. ఇప్పుడు ఓ మంచి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ..మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా కేరాఫ్ రవీంద్ర భారతి సినిమా ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా ను నిర్మిస్తున్న టి. గణపతిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. ‘మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు జీవన్. ‘ఓ మంచి కథలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అని హీరోయిన్ నవీన అన్నారు. -
రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి
ఒకప్పుడు సీరియల్స్‌లో రఫ్ఫాడించింది నటి, నిర్మాత యాట నవీన. ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి రీల్స్, వీడియోలు చేస్తూ హడావుడి చేస్తోంది. ఆమె భర్త యాట సత్యనారాయణ దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఇటీవలే రజాకార్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అమ్మ ఎంతో కష్టపడింది తాజాగా నవీన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా చిన్నప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చీరలమ్ముతూ, మిషన్ కుడుతూ పోషించింది. నేను షూటింగ్స్‌కు వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంది. నిజానికి నేను యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఇష్టంగా రాలేదు. పరిస్థితుల వల్ల డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటోషూట్ చేయించుకుని అవి పట్టుకునే తిరిగేవాళ్లం. దానికోసం మా అమ్మ తనదగ్గరున్న ఒకే ఒక బంగారు నగను అమ్మేసి నన్ను ఫోటోలు తీయించింది. అరిస్తే ఏడ్చేశా వీరివీరి గుమ్మడిపండు, కాదంటే ఔననిలే.. సినిమాల్లో హీరోయిన్గా చేశాను. ఇంకో రెండు సినిమాల్లో కథానాయికగా చేశాను కానీ రిలీజ్ కాలేదు. త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు.. నాకు యాక్టింగ్ సరిగా రావడం లేదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్స్‌లో అరిచేశాడు. ఏడ్చి వెళ్లిపోయాను. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కిలో బంగారం.. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. కిలో బంగారం ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పటికే కిలోదాకా గోల్డ్ జమ చేశాను. ఒకసారి మేము పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయాము. ఓ సీరియల్ తీసేందుకు రూ.70 లక్షల దాకా ఖర్చు చేశాం. అగ్రిమెంట్స్ దగ్గర తేడా రావడంతో వంద ఎపిసోడ్లకే ఆ సీరియల్ ఆపేశారు. రూ.20 లక్షలు కూడా వెనక్కు రాలేదు. రూ.50 లక్షలు నష్టం రావడంతో మా దగ్గరున్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేశాం. మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాం' అని పేర్కొంది. చదవండి: ఆ షో వల్లే అంతా తలకిందులు.. విడాకులు.. మానసికంగా దెబ్బతిన్నా! -
అమెరికా చదువులకు ఐదుగురు గురుకుల విద్యార్థులు
సాక్షి, అమరావతి: అమెరికా చదువులకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన సాయం అందించడమే కాకుండా వాళ్లు తిరిగి వచ్చాక కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ (కేఎల్–వైఈఎస్)’ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది దేశంలో 30 మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం దక్కింది.వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లనున్న విద్యార్థులు.. డి.నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్.ఆకాంక్షలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంను కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు.. కె.అక్ష, సి.తేజ కూడా ఉన్నారు. విద్యార్థులను సీఎం జగన్ అభినందించి కుటుంబ నేపథ్యం, విద్యా సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించడంతోపాటు, వారికి శాంసంగ్ ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్య కార్యదర్శి జయలక్షి్మ, ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులున్నారు. కేఎల్–వైఈఎస్ ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్స్ఛంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్‌ను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ సాంస్కృతిక మారి్పడి కోసం నిర్వహిస్తోంది. దీనికి ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలో నమోదు చేస్తారు. ఎంపికైన విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు ఆతిథ్యం ఇస్తాయి. ఒక్కో విద్యార్థికి దాదాపు 200 డాలర్లు (సుమారు రూ.16,500) నెలవారీ స్టైఫండ్‌ను అందిస్తారు. ఈ ఏడాది ఎంపికైన ఐదుగురు విద్యార్థులు సెపె్టంబర్ మొదటివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా, ఈ ఏడాది దేశం మొత్తం మీద 30 మంది ఎంపికైతే మన ఒక్క రాష్ట్రం నుంచే ఐదుగురు గురుకుల విద్యార్థులు ఎంపిక కావడం విశేషమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. పేద కుటుంబం నుంచి అమెరికా మాది విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ. అమ్మానాన్న.. సుకాంతి, ప్రవీణ్‌రాజ్. నాన్న చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. పేద కుటుంబానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే అది ప్రభుత్వ ప్రోత్సాహమే. – రోడా ఇవాంజిలి, ఇంటర్ సెకండ్ ఇయర్ మధురవాడ అంబేడ్కర్ గురుకులం, విశాఖ కలలో కూడా ఊహించలేదు.. మాది అనకాపల్లి జిల్లా జి.కొత్తూరు. నాన్న కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నేను అమెరికా చదువుకు ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయుల సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చాను. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా సీఎం సార్ ప్రోత్సాహమే.. మాది సత్యసాయి జిల్లా మల్లెనిపల్లి. నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్. తల్లి నాగమణి గృహిణి. నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే దానికి సీఎం సార్ ప్రోత్సాహమే కారణం. – బలిగా హాసిని, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈడ్పుగల్లు ఐఐటీ–నీట్ అకాడమీ,ఎస్సీ గురుకులం, కృష్ణా జిల్లా విద్యాలయాలను తీర్చిదిద్దారు.. మాది ప్రకాశం జిల్లా పుచ్చకాయలపల్లి. నాన్న కేశయ్య రైతు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ ఎంతో బాగా తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. – డి.నవీన, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని, మార్కాపురం గురుకులం, ప్రకాశం జిల్లా ఎప్పటికీ మర్చిపోలేను.. మాది విజయవాడ. నాన్న సురేశ్.. అటెండర్. అమ్మ వనజ గృహిణి. ప్రభుత్వ గురుకులంలో చదివిన నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. – ఆకాంక్ష, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈడ్పుగల్లు ఐఐటీ–ఎన్ఐటీ అకాడమీ, కృష్ణా జిల్లా -
పెళ్లిరోజు భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బుల్లితెర నటి, కాకపోతే!
బుల్లితెర నటి నవీన ఇటీవలే తన కలల ఇంట్లోకి గృహప్రవేశం చేసి వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు ఆమె లక్ష రూపాయల చీర కట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్న నవీన తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి కార్ల షోరూంకు వెళ్లిన నటి అక్కడున్న కార్లన్నింటిపై ఓ లుక్కేసింది. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బీఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. ఇప్పటివరకు సన్ రూఫ్ ఉన్న కారు లేదని, దీనికి మాత్రం పైన ఓపెన్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక షోరూమ్‌లోనే కేక్ కట్ చేసి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకుని సంతోషపడిపోయింది. అనంతరం కారుకు పూజ చేయించి నెక్లెస్ రోడ్లో మరోసారి కేక్ కట్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
కొత్తింట్లోకి సీరియల్ నటి, గృహప్రవేశానికి లక్ష రూపాయల చీర
TV Actress Naveena House Warming: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియళ్లలో నటించింది నవీన. తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నవీన ధారావాహికల ద్వారా బాగానే సంపాదించింది. పైసా పైసా పెట్టి కూడబెట్టిన డబ్బుతో కొత్తింటి కల సాకారం చేసుకుంది. తాజాగా తన కలల ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె గృహప్రవేశం పేరిట ఓ వీడియోను సొంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు, ఈ గృహప్రవేశం కోసం మొట్టమొదటి సారిగా లక్ష రూపాయలు పెట్టి కొన్న చీరను కట్టుకుని తెగ మురిసిపోయింది. జీవితంలో ఒక్కసారైనా లక్ష రూపాయల చీర కట్టుకోవాలనుకున్నానని, అది ఎట్టకేలకు నెరవేరిందని చెప్పుకొచ్చింది. అలాగే తను కొన్న బంగారు ఆభరణాలు.. కడియాలు, షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్‌లు సైతం చూపించింది. గృహపూజ అనంతరం ఇల్లు కట్టిన మేస్త్రీ దంపతులకు కొత్త బట్టలు పెట్టి సత్కరించింది. అనంతరం నవీన సంతానమైన ఇద్దరు కొడుకులకు ధోతీ ఫంక్షన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ గృహప్రవేశం వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. -
హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుత్రుల్లో సోమవారం చేరిన విషయం తెలిసిందే. తాజాగా హైదరబాద్‌లోనూ ఇలాంటి పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రియాక్షన్ కావడంతో ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరారు. జనవరి 16న నవీన అనే మహిళ ఉప్పల్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే అనుకోకుండా వంతులు, మైకం కమ్మడం, బలహీన లక్షణాలు ఏర్పడటంతో ఈ రోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నవీన పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. చదవండి: కోవిషీల్డ్ వ్యాక్సిన్.. ఏడుగురికి అస్వస్థత కాగా భారతదేశమంతటా శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు.మొత్తం 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. చదవండి: కరోనా వ్యాక్సిన్ : మరుసటి రోజే విషాదం -
నిరుపేద చిన్నారి.. దాతల సాయం కోరి..!
బుడిబుడి అడుగుల చిన్నారికి పెద్ద జబ్బు చేసింది. తల్లిదండ్రులదేమో సామాన్య కుటుంబం. కానీ లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది లేక అందిన కాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చెన్నూర్: తమ చిన్నారిని కాపాడమని మహేందర్, లక్ష్మి దంపతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తలా కొంత సాయం చేసి తమను ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని ఆశగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభం, శుభం తెలియని చిన్నారి అందరితో కలిసి ఆనందంగా ఆడుకునే అభం, శుభం తెలియని చిన్నారి ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతోంది. కన్నవారు అష్టకష్టాలు పడుతూ స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్ పట్టణం బట్టిగూడెం కాలనీకి చెందిన మహేందర్, లక్ష్మిలకు ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి నవీన (3). రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీరివి. మహేందర్ టాటాఏస్ డ్రైవర్‌గా పని చేస్తుండగా లక్ష్మి కూలీ చేసి బతుకు బండిని లాగుతున్నారు. ఇద్దరూ కష్టపడి పిల్లలను కంటికి రెప్పలా సాకుతున్నారు. కానీ పది రోజుల క్రితం నవీనకు జ్వరం వచ్చింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. నవీనకు డెంగీ లక్షణాలున్నాయని, కరీంనగర్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన చిన్నారిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో చిన్నారిని హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు చిన్నారి నవీనకు పరీక్షలు నిర్వహించి గుండెలాగేలా... ఆ చిన్నారి డెంగీతో పాటు లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని, చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని తెలిపారు. గురువారం నుంచి చికిత్సకు రోజుకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చవుతోంది. ఇప్పటికే రూ. 4.80 లక్షలు ఖర్చయ్యాయని.. ఇన్నాళ్లూ ఎలాగోలా అప్పుచేసి నెట్టుకొచ్చామని, ప్రస్తుతం అప్పులిచ్చేవారు కూడా లేరని చిన్నారి తండ్రి మహేందర్ అంటున్నారు. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు ఇప్పటికే చిన్నారి వైద్య ఖర్చులకు రూ. 5 లక్షలకు పైగా ఖర్చయింది. ఇంకా నాలుగు నుంచి రూ. 5 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారిని కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ఆత్రుత పడుతున్నారు. కానీ అంతంతమాత్రంగా ఉన్న వారి ఆర్థికస్థోమతను చూసి ఎలాగా అని భయపడుతున్నారు. ఆపన్నహస్తం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చిన్నారి నవీన వైద్య ఖర్చుల కోసం చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ అర్చనగిల్డా రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. నెన్నల కృష్ణ, అకౌంట్ నంబర్: 62297400611 ఐఎఫ్ఎస్సీ: SBIN0020128 స్టేట్‌బ్యాంక్, చెన్నూర్ బ్రాంచ్,గూగుల్‌పే: 8096384756 -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
హుస్నాబాద్: ట్రాక్టర్ బోల్తాపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన నవీన(20) వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో తండ్రికి సహాయ పడేందుకు వెళ్లింది. వరినారు చేరవేసేందుకు నవీన ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్‌పై నారు వేసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం ఒడ్డు వద్దకు చేరుకుంది. ఒడ్డుపై ఉన్న ట్రాక్టర్‌ను కొంత వెనుకకు తీసుకురావాలని తండ్రి కోరగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. నవీనపై ట్రాక్టర్ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందింది. -
అనాథలు కావద్దని పిల్లలతో సహా ఆత్మహత్య
కుటుంబ కలహాలు ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేశాయి. మూడేళ్ల పాపను చంకనెత్తుకొని, ఐదేళ్ల బాలుడి చిటికెన వేలు పట్టుకొని అడుగులేస్తుంటే ... అమ్మ ఎక్కడికో తీసుకువెళ్తోందని సంబరపడ్డారు. కోనసీమలోని గోదారి కాలువ గట్టు వెంబడి వెళ్తుంటే పచ్చని పంటపొలాలు, కొబ్బరి తోటలు, ఆ పక్కనే గలగలపారే జలప్రవాహాన్ని చూస్తూ ఆ చిన్నారుల మదిలో సందడి. వారి కళ్లలో సంతోషాన్ని చూసిన ఆ కన్న తల్లి మనసులో మాత్రం అలజడి. కన్నపేగులను గట్టిగా కావలించుకొని ఆ తల్లి ఒక్కసారిగా దూకేసింది. పరుగులు తీసే ప్రవాహంలోనే ఆ ముగ్గురి ప్రాణాలూ కలిసి పోయాయి. సాక్షి, ఆత్రేయపురం (తూర్పు గోదావరి): ఆమెకు ఏకష్టమొచ్చిందో ఏమో తెలియదు. ముక్కు పచ్చలారని పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుంది. భర్తపైన కోపంతో విగతజీవిగా మారిన ఆమె తన తండ్రిని మాత్రం క్షమించమని వేడుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. అందిన సమాచారం ప్రకారం.. ఆత్రేయపురం మండలం వసంతవాడకు చెందిన మిద్దె బాబూరావు, దుర్గల కుమార్తె నవీనకు బావ వరసయ్యే కారింకి శ్రీనుతో వివాహమైంది. వారికి ఐదేళ్ల రాజేష్, మూడేళ్ల నిత్యనందిని పిల్లలు. వీరు కొంతకాలం వసంతవాడలో కాపురం ఉన్నారు. ఆ తర్వాత మండపేటలో నివాసం ఉంటున్నారు. శ్రీను జూదాలకు, వ్యసనాలకు బానిసవడంతో కుటుంబపోషణ కష్టంగా మారింది. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదంటూ ఆమె చాలా సార్లు భర్తతో గొడవపడింది. కుమార్తె కుటుంబంలో కల్లోలం తలెత్తడంతో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ముందు బాబూరావు మండపేటలోని కొండపల్లివారి వీధిలోకి మకాం మర్చారు. ఏం చేసినా ఫలితం లేదని భావించిన నవీన పిల్లలను వదిలేస్తే వారు అనాథలవుతారని భావించి వారితో కలసి లొల్ల లాకుల సమీపంలో అమలాపురం బ్యాంక్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాలువలోకి దూకే ముందు ఆమె పలకమీద ‘నువ్వు చేసిన తప్పుకు నా బిడ్డలు బాధ పడాలి బావా’ అని ‘నాన్నా నన్ను క్షమించండి’ అని వ్రాసి పలకను గట్టుమీద వదిలివేసింది. ఈ ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణం కావచ్చని పలకమీద రాతలను బట్టి తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను వెలికి తీయాలని పోలీసులను ఆదేశించారు. దీనిపై అమలాపురం డీఎస్పీ ఆర్ రమణ ఆధ్వర్యంలో రావులపాలెం సీఐ వి.కృష్ణ, ఎస్సై నరేష్ కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత బాలిక, అనంతరం బాలుడు, చివరగా నవీన మృతదేహలు సంఘటనా స్థలం సమీపం నుంచే వెలికి తీశారు. మృతదేహాలను కొత్తపేట ప్రభుత్వ అసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేష్ తెలిపారు. రోజూ తమతో ఆడుకునే స్నేహితులు విగతజీవులుగా పడి ఉండటం చూసి అర్థం కాక తోటి స్నేహితులు వారిని ఆడుకోడానికి రమ్మని పిలవడం చూపరులను ఆవేదనకు గురిచేసింది. ఆ తండ్రిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేపడితే అసలు విషయాలు వెలుగుచూస్తాయి. -
ఆత్మహత్యాయత్నం చేసిన యువతి..
బషీరాబాద్(తాండూరు): ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసిన యువతి నవీనణ(18) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. బషీరాబాద్ మండలం మాసన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ, లక్ష్మయ్యల కూతురు వడ్డె నవీన వారం రోజుల కిందట తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకుంది. కొత్త సెల్‌ఫోన్ కావాలని మారం చేయడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కూతురు ఆవేశంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని తల్లిదండ్రుల ఎదుటే నిప్పంటించుకుంది. తల్లిదండ్రులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే తల, ముఖం ఛాతి భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ఖమ్మం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జిల్లాలోని రఘునాథపాలెం మండలంలోని కోయచెలకలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న కె. నవీన(25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ స్వామీజి.. 'బ్లూ' కథ
బెంగుళూరు: ఈ కథ రంగు గురించి. రంగు గురించి కథేంటి అనుకుంటున్నారా?. అవును, బెంగుళూరులోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం 'బ్లూ' కలర్ ను అన్నిటికంటే మిన్నగా ప్రేమిస్తోంది. వారి ఇల్లు, బట్టలు, వాహనాలు అన్నీ బ్లూ కలర్ లోనే ఉంటాయి. నెలకు లక్షల్లో సంపాదించే నితిన్ విశాల్ సింగ్(36) ఎందుకు బ్లూ రంగును అంతలా ఆరాధిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కొద్ది కాలం కిందట సింగ్ ఓ స్వామిని కలిశాడు. ఆయన 'బ్లూ' జీవిత విధానాన్ని అవలంభించాలని సూచించడంతో సదరు టెకీ ఆయన భార్య నవీన(30)ను కూడా అలాగే జీవించాలని ఆర్డర్ వేశాడు. భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన ఆమె విడాకులు కోరింది. కానీ సింగ్ అందుకు నిరాకరించాడు. భార్య తనకు అదృష్ట దేవతని విడాకులు ఇవ్వలేనని పేర్కొన్నాడు. దీంతో షాక్ కు గురైన ఆమె.. భర్త వింత చేష్టలకు గల కారణాన్ని తెలుసుకోవాలని భావించింది. సింగ్ ను నిశితంగా గమనించిన ఆమె.. ఆయన కలలో వచ్చిన ఓ స్వామిజీ 'బ్లూ' జీవితాన్ని ఆరంభించాలని ఉపదేశించినట్లు తెలుసుకుంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్, నవీనలకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఈ జంట డీఎస్ఆర్ లేఔట్ లో సొంత ఫ్లాట్ ను కూడా కలిగివుంది. చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తున్న సమయంలో తాను స్పిరిచ్యువల్ లైఫ్ అనుభవించాలని అనుకుంటున్నట్లు భర్త సింగ్ భార్యతో చెప్పారు. ఆ తర్వాత తన అలవాట్లు పద్దతులు మార్చుకున్నారు. జీవిత భాగస్వామిగా భార్యను కూడా తనను అనుసరించాలని ఆర్డర్ వేశారు. సింగ్ తన బట్టలు మొత్తం ఓ అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి, భార్యను సాధారణ దుస్తులు కాకుండా 'బ్లూ' రంగు దుస్తులే ధరించాలని ఆదేశించారు. అధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టినా.. కార్యాలయానికి మాత్రం నిత్యం వెళ్తునే ఉన్నారు. తన ఇంటి మొత్తాన్ని బ్లూ కలర్ లోకి మార్చివేశారు. ప్రతి రోజూ తెల్లవారు జామున 2.00 గంటలకు మేల్కొని చన్నీళ్ల స్నానం చేస్తారు. భార్యను కూడా తనతో పాటే నిద్రలేచి మెడిటేషన్ చేయమని కోరతారు. స్పిరుచ్యువల్ లైఫ్ ను ఆరంభించగా తన పర్సనాలిటీలో మరిన్ని మార్పులు వచ్చాయని భార్యతో చెప్పారు. భర్త చేష్టలను తట్టుకోలేని నవీన అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. కానీ, సింగ్ అందుకు నిరాకరిస్తుండటంతో పోలీసులు కేసును కోర్టు పంపే యోచనలో ఉన్నారు. -
తమిళనాడులో మరో స్వాతి..
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ లో నెల క్రితం ప్రేమించలేందంటూ టెకీ స్వాతిని నరికిచంపిన ఘటన మరువకముందే విల్లుపురం జిల్లాలో శనివారం మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదంటూ ఓ ఉన్మాది ఆమెకు నిప్పంటించబోయాడు. సెంథిల్(32) ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా నవీన అనే అమ్మాయి వెనుకతిరిగాడు. ఈ సమయంలో అతన్ని రైలు ఢీకొనడంతో యాక్సిడెంట్ లో కుడి చేయి, కుడి కాలు పోయాయి. కాలు, చేయి లేకపోవడంతో నవీన తనను రెజెక్ట్ చేస్తుందని భావించిన అతను.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు. శనివారం సెంథిల్ నవీన ఇంటిబయట దాక్కున్నాడు. నవీన్ ఇంట్లో పెద్దలందరూ వెళ్లిపోయే వరకూ వెయిట్ చేశాడు. వాళ్లు ఇల్లు వదిలి బయటకు వెళ్లగానే లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో నవీనతో పాటు ఉన్న ఆమె సోదరి, సోదరులను కత్తి చూపించి బెదిరించాడు. మొదట నవీనకు నిప్పంటిచే ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో, తన మీద తానే పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పంటించుకుని నవీనకు కూడా అంటించాడు. ఈలోగా ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుండంతో స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడారు. అప్పటికే సెంథిల్ అక్కడికక్కడే కాలిబూడిదయ్యాడు. గాయాలపాలైన నవీనను పాండిచ్చేరిలోని జింపర్ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో నవీన ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంది. -
పట్టపగలు.. కేబీఆర్ పార్క్ దగ్గర..
చైన్ కొట్టేయబోయి.. పట్టుబడ్డ స్నాచర్ * మార్నింగ్‌వాక్ చేస్తుండగా చైన్ దొంగిలించేందుకు యత్నం * ప్రతిఘటించిన బాధితురాలిపై కత్తితో దాడి * నిందితుడిని వెంటాడి పట్టుకున్న హోంగార్డులు హైదరాబాద్: మార్నింగ్ వాక్ చేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించేందుకు ఓ స్నాచర్ ప్రయత్నించాడు. ప్రతిఘటించిన బాధితురాలిపై కత్తితో దాడి చేసి పరారవ్వాలనుకున్నాడు. కానీ, ఇద్దరు హోంగార్డులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో చోటు చేసుకున్న ఉదంతం ఇదీ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలనీలో నివసించే అంకెం నవీన(32) బుధవారం ఉదయం 9.30 సమయంలో హెచ్ఎండీఏ వాక్‌వేలో మార్నింగ్‌వాక్ చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో నిందితుడు కాలాపు సంతోష్(19) ఆమెను అడ్డగించి మెడలో ఉన్న ఐదు తులాల గొలుసును లాక్కునేందుకు యత్నించాడు. తేరుకున్న నవీన గొలుసును గట్టిగా పట్టుకోవడంతో అది విరిగిపోయింది. సగం గొలుసు నవీన చేతిలో ఇంకో సగం నిందితుడి చేతిలో ఉండిపోయాయి. అప్రమత్తమైన నవీన దొంగా.. దొంగా అని అరవడంతో ఆమెపై సంతోష్ కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునేందుకు నవీన చేయిని అడ్డుపెట్టడంతో చేతికి గాయాలయ్యాయి. కళింగ ఫంక్షన్ హాల్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు పి. చంద్రశేఖర్ నవీన అరుపులు విని అటువైపు వచ్చాడు. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డి కూడా అటు వైపు వచ్చాడు. నవీన అరుపులతో సంతోష్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ భవన్‌వైపు హెచ్ఎండీఏ వాక్‌వే గ్రిల్‌ను ఎక్కి ప్రధాన రోడ్డువైపు దూకాడు. అయితే ట్రాఫిక్ హోంగార్డు చంద్రశేఖర్, బంజారాహిల్స్ హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డి వెంటాడి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో సంతోష్ నందీనగర్‌లో నివసిస్తున్నట్లు తేలింది. రెండు వారాల క్రితమే బంజారాహిల్స్ పోలీసులు బైక్ దొంగతనం కేసులో అతడిని జైలుకు పంపించగా విడుదలైనట్లు తెలిసింది. హోంగార్డులకు రివార్డు స్నాచర్ సంతోష్‌ను చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ హోంగార్డు పి.చంద్రశేఖర్‌ను ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ అభినందించారు. అలాగే మరో హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డిని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు అభినందించడమే కాక రూ. వెయ్యి నగదు బహుమతి అందించారు. -
’ఏడుస్తూనే ధైర్యంగా పోరాడాను’
-
కేబీఆర్ పార్క్‌లో మహిళపై దాడి
హైదరాబాద్ : నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న మహిళపై ఓ దుండగుడు చైన్ స్నాచింగ్‌కు యత్నించాడు. అయితే ఆ మహిళ... అతడిని ధైర్యంగా ఎదుర్కొంది. ఈ సందర్భంగా ఆమెపై దుండగుడు దాడి చేసి, గాయపరిచాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మహిళ వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు ఫోన్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా అతడితో మహిళ పెనుగులాడింది. దీన్ని గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా అతడిని కలాపి సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నాయని.... బైకులు ఎత్తుకెళ్లటంతో పాటు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడని, గత నెల 31న జైలు నుంచి సంతోష్ విడుదల అయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా దొంగతనం చేసేందుకు ఈ రోజు ఉదయం 7 గంటలకే కేబీఆర్ పార్క్ వద్ద అతడు కాపు కాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత మహిళ నవీన మాట్లాడుతూ ...వాకింగ్ చేస్తున్న సమయంలో తనను దొంగ కత్తితో బెదిరించాడని, నీ చైన్ ఇస్తావా?...చచ్చిపోతావా? అని బెదిరించాడని తెలిపింది. తన వద్ద ఉన్న బంగారు గొలుసు, ఫోన్ ఇచ్చేయమన్నాడని, అందుకు తాను నిరాకరించటంతో దాడి చేశాడని, తనను కింద పడేశాడని ఆమె పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేబీఆర్ పార్క్‌లో మహిళపై దాడి
-
న్యాయం కోసం నవీన పోరాటం!
-
వర్మ బలవంతపెట్టలేదు..ఒత్తిడి చేయలేదు: నవీన
ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు ఒత్తిడి తీసుకువచ్చారని, వేధించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ చిత్ర హీరోయిన్ నవీన ఖండించారు. పాట చిత్రీకరణకు ముందే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది. రాము గారు ఎన్నడూ వేధించలేదు.. బలవంత పెట్టలేదు, ఒత్తిడి చేయలేదు అని ఆమె అన్నారు. షూటింగ్ కు ముందే పాట గురించి వివరించారని.. ఆతర్వాత తాను చేయడానికి ఒప్పుకున్నానని నవీన స్పష్టం చేశారు. అశ్లీలానికి, గ్లామర్ కు ఓ చిన్న విభజన రేఖ ఉందన్నారు. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు. -
'ఐస్ క్రీం 2' కిస్ మిక్స్ సాంగ్ ఆవిష్కరణ
-
వర్మ కొత్త కథానాయిక
ఇటీవలే ‘ఐస్‌క్రీమ్’ మేకింగ్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన రామ్‌గోపాల్ వర్మ, మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ‘ఐస్‌క్రీమ్’ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. వర్మ నూతనంగా ఏర్పాటు చేసిన ‘న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ ద్వారా నిర్మాణమవుతోన్న తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవీన అనే కొత్తమ్మాయిని వర్మ నాయికగా పరిచయం చేస్తున్నారు. జేడీ చక్రవర్తి, జీవా, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. -
తప్పటడుగు మూవీ స్టిల్స్
-
తుపాకీ పోగొట్టుకున్న పోలీస్ పాపారావు
అరకు ప్రాంతంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ అతను. ప్రమోషన్ వచ్చేసి ఏకంగా ఎస్.ఐ అయిపోయాడు. ఈ పోలీస్గారు వృత్తిలో భాగంగా తన తుపాకీని పోగొట్టుకుంటాడు. దాన్ని తిరిగి ఎలా సంపాదించుకున్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘పోలీస్ పాపారావు’. నటుడు శివాజీరాజా ఇందులో కథానాయకుడు. నిర్దేశ్ నెర్స్ దర్శకుడు. సునీతా శ్రీనివాసరావు బొమ్మి నిర్మాత. తారకరామారావు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కేఎస్ రామారావు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని హీరో శ్రీకాంత్‌కి అందించారు. వీరితో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న పరుచూరి బ్రదర్స్, మురళీమోహన్, ముత్యాల సుబ్బయ్య, సి.కల్యాణ్, సాయికుమార్, తరుణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ తయారు చేసుకోగానే మేం ముందు కలిసింది రావికొండలరావుగారిని. ఆయన కథ విని కథానాయకునిగా శివాజీరాజా పేరును సూచించారు. శివాజీరాజాగారు కూడా ‘ఓకే’ అనడం, ముప్ఫై రోజుల్లో షూటింగ్ చేసేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇందులో రెండే పాటలుంటాయి. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అన్నారు. వినోదంతో పాటు ఉత్కంఠను కూడా కలిగించే ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని శివాజీరాజా నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో నిర్మాతగా మారడం పట్ల సునీతా శ్రీనివాసరావు సంతోషం వెలిబుచ్చారు. నవీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: రావికొండలరావు, కెమెరా: చంద్రశేఖర్, ఎడిటింగ్: విజయానంద్ వడిగి.