ఓ స్వామీజి.. 'బ్లూ' కథ | Techie couple's life is a blow-by-blue account | Sakshi
Sakshi News home page

ఓ స్వామీజి.. 'బ్లూ' కథ

Published Thu, Dec 29 2016 2:46 PM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM

ఓ స్వామీజి.. 'బ్లూ' కథ - Sakshi

ఓ స్వామీజి.. 'బ్లూ' కథ

బెంగుళూరు: ఈ కథ రంగు గురించి. రంగు గురించి కథేంటి అనుకుంటున్నారా?. అవును, బెంగుళూరులోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం 'బ్లూ' కలర్ ను అన్నిటికంటే మిన్నగా ప్రేమిస్తోంది. వారి ఇల్లు, బట్టలు, వాహనాలు అన్నీ బ్లూ కలర్ లోనే ఉంటాయి. నెలకు లక్షల్లో సంపాదించే నితిన్ విశాల్ సింగ్(36) ఎందుకు బ్లూ రంగును అంతలా ఆరాధిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
 
కొద్ది కాలం కిందట సింగ్ ఓ స్వామిని కలిశాడు. ఆయన 'బ్లూ' జీవిత విధానాన్ని అవలంభించాలని సూచించడంతో సదరు టెకీ ఆయన భార్య నవీన(30)ను కూడా అలాగే జీవించాలని ఆర్డర్ వేశాడు. భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన ఆమె విడాకులు కోరింది. కానీ సింగ్ అందుకు నిరాకరించాడు. భార్య తనకు అదృష్ట దేవతని విడాకులు ఇవ్వలేనని పేర్కొన్నాడు. దీంతో షాక్ కు గురైన ఆమె.. భర్త వింత చేష్టలకు గల కారణాన్ని తెలుసుకోవాలని భావించింది.
 
సింగ్ ను నిశితంగా గమనించిన ఆమె.. ఆయన కలలో వచ్చిన ఓ స్వామిజీ 'బ్లూ' జీవితాన్ని ఆరంభించాలని ఉపదేశించినట్లు తెలుసుకుంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్, నవీనలకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఈ జంట డీఎస్ఆర్ లేఔట్ లో సొంత ఫ్లాట్ ను కూడా కలిగివుంది. చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తున్న సమయంలో తాను స్పిరిచ్యువల్ లైఫ్ అనుభవించాలని అనుకుంటున్నట్లు భర్త సింగ్ భార్యతో చెప్పారు.
 
ఆ తర్వాత తన అలవాట్లు పద్దతులు మార్చుకున్నారు. జీవిత భాగస్వామిగా భార్యను కూడా తనను అనుసరించాలని ఆర్డర్ వేశారు. సింగ్ తన బట్టలు మొత్తం ఓ అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి, భార్యను సాధారణ దుస్తులు కాకుండా 'బ్లూ' రంగు దుస్తులే ధరించాలని ఆదేశించారు. అధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టినా.. కార్యాలయానికి మాత్రం నిత్యం వెళ్తునే ఉన్నారు. తన ఇంటి మొత్తాన్ని బ్లూ కలర్ లోకి మార్చివేశారు.
 
ప్రతి రోజూ తెల్లవారు జామున 2.00 గంటలకు మేల్కొని చన్నీళ్ల స్నానం చేస్తారు. భార్యను కూడా తనతో పాటే నిద్రలేచి మెడిటేషన్ చేయమని కోరతారు. స్పిరుచ్యువల్ లైఫ్ ను ఆరంభించగా తన పర్సనాలిటీలో మరిన్ని మార్పులు వచ్చాయని భార్యతో చెప్పారు. భర్త చేష్టలను తట్టుకోలేని నవీన అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. కానీ, సింగ్ అందుకు నిరాకరిస్తుండటంతో పోలీసులు కేసును కోర్టు పంపే యోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement