
తాజా పుట్టగొడుగులను నగర, పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారి ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అందించే లక్ష్యంతో సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే ట్రైసైకిల్ సాంకేతికతను బెంగళూరులోని బారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) రూపొందించింది. వేరే చోట పుట్టగొడుగులను పెంచి, తీసుకెళ్లి విక్రయించడటం వల్ల అవి తాజాదనాన్ని కోల్పోతుంటాయి. కోసిన తర్వాత వినియోగదారులకు చేరటం ఆలస్యమైతే రెండు, మూడు రోజుల్లో పుట్టగొడుగులు రంగు మారి వృథా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించటంతో పాటు పౌష్టికాహారాన్ని ప్రజలకు తాజాగా అందించటం ద్వారా ఉపాధి పొందగోరే యువతకు ఆదాయ వనరుగా ఈ మష్రూమ్ సోలార్ ట్రైసైకిల్ సాంకేతికతను ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
పెరట్లో, మేడపైన కొద్ది ఖాళీలోనే అవుట్‌డోర్ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఇంతకుముందే ఐఐహెచ్‌ఆర్ రూపొందించింది. ఈ యూనిట్‌లో పెరిగిన పుట్టుగొడుగులతో కూడిన గ్రోబాగ్స్‌ను సోలార్ ట్రైసైకిల్‌లోకి మార్చుకొని... వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తీసుకు వెళ్లి విక్రయించడానికి ట్రైసైకిల్ ద్వారా అవకాశం కలిగిస్తోంది. తద్వారా పోషకవిలువలతో కూడిన పుట్టగొడుగులను ప్రజల దైనందిన ఆహారంలో భాగం చేసుకోగలుగుతారని ఐఐహెచ్‌ఆర్ ఆశిస్తోంది.
చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
ఈ ట్రైసైకిల్ ఛాంబర్ 1.5“1“1 మీటర్ల సైజులో ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్‌లలో పుట్టగొడుగులు పెరిగే బ్యాగులను అమర్చుకోవచ్చు. గాలి ఆడటం కోసం, పురుగులు, ఈగలు వాలకుండా నైలాన్ 40 మెష్‌ను, గోనె సంచులను చుట్టూతా ఏర్పాటు చేశారు. కిలో/2 కిలోల పుట్టగొడుగులతో కూడిన 36 బ్యాగ్‌లు ఇందులో పెట్టుకోవచ్చు. 30 వాట్స్ డిసి మిస్టింగ్ డయాఫ్రం పంప్ నిరంతరం గోనె సంచులపై నీటి తుంపర్లను చల్లుతూ చల్లబరుస్తూ ఉంటుంది. ఇది విద్యుత్తుతో లేదా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. 300 వాట్స్ ΄్యానల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజ్ బ్యాటరీ, టైమర్ ఇందులో అమర్చారు. ట్రైసైకిల్‌కి 48వి, 750 వాట్స్ డిసి గేర్‌డ్ మోటార్ అమర్చారు. వోల్టేజి కంట్రోలర్, సౌర విద్యుత్తును నిల్వ చేయటానికి 24ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు.
ఇతర వివరాలకు.. ఐఐహెచ్‌ఆర్ మష్రూమ్ లాబ్ (బెంగళూరు) – 070909 49605.