
దైనందిన ఆహారంలో ఆకుకూరలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అయితే, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు, చిల్లర వర్తకులు ఆకుకూరలను రెండో రోజు వరకు నిల్వ ఉంచడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) శాస్త్రవేత్తలు ఈ సమస్యకో పరిష్కారం కనుగొన్నారు. దాని పేరే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్.
సాధారణంగా 24 గంటల్లోనే ఆకుకూరలు వాడి పోయి పాడైపోతుంటాయి. అయితే, అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పెడితే 36 గంటలపాటు తాజాగా ఉంటాయి. ఈ బాక్స్‌ను గది ఉష్ణోగ్రత(26–28 డిగ్రీల సెల్షియస్, 52% గాలిలో తేమ)లో ఉంచి, అందులో ఆకు కూరలు పెట్టి మూత వేస్తే చాలు. విద్యుత్తు అవసరం లేదు. రిఫ్రిజరేషన్ చేయనవసరం లేకుండానే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో ఉంచితే చాలు.. ఆకుకూరలు 36 గంటలు తాజాగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే రిటైల్ షాపులకు, సూపర్ మార్కెట్లకు, తోపుడు బండ్లు/ ఆటోలపై కూరగాయలు అమ్మే వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పరిశుభ్రమైన స్థితిలో ఆకుకూరలను తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచుకోవ్చు. ఇతర వివరాలకు... 77608 83948
చదవండి: పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!