Leafy Vegetables
-
Malabar Spinach: బచ్చలి ఆరోగ్యానికే కాదు, అందానికి నెచ్చెలి కూడా
మన తీసుకునే ఆహారంలో ప్రధానమైనవి ఆకుకూరలు. ఆకుకూరలు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఆకుకూరలతో అటు ఆరోగ్యాన్ని ఇటు సౌందర్యాన్ని కూడా సొంతం చేసు కోవచ్చు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి బచ్చలి కూర. వీటిల్లో తీగ బచ్చలి, చెట్టు బచ్చలి, ఎర్ర బచ్చలి లాంటి రకాలు ఉన్నాయి. బచ్చలికూరను శాస్త్రీయంగా బసెల్లా ఆల్బా అని పిలుస్తారు. ఇంకా మలబార్ బచ్చలికూర, భారతీయ బచ్చలికూర, సిలోన్ బచ్చలికూర, ఈస్ట్-ఇండియన్ బచ్చలికూర, వైన్ బచ్చలికూర, క్లైంబింగ్ బచ్చలికూర, చైనీస్ బచ్చలి, సైక్లోన్ బచ్చలి, అలుగ్బాటి అని కూడా పిలుస్తారు. కాల్షియం, విటమిన్ ఎ, మెగ్నీషియం, ప్రోటీన్లతో పాటు ఐరన్‌కి అద్భుతమైన మూలం. ఇందులో ఫోలేట్, విటమిన్ బి6, రిబోఫ్లావిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లతో పాటు ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. తాజా ఆకుల్లో లుటిన్ , జియాక్సంతిన్ వంటి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. బచ్చలికూరలోని ఐరన్ రక్త వృద్ధికి తోడ్పడుతుంది. విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయ పడతాయి. బచ్చలి కూరతో శరీరంలో వేడి తగ్గుతుంది. చలవ చేస్తుందని పెద్దలు చెబుతారు. గుండె ,మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి ఎముకలు బలంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయిబచ్చలికూరలో విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖంపై మచ్చలను, మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బచ్చలికూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ రెండూ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి. -
Hyderabad: దిగివచ్చిన ఆకుకూరలు, కూరగాయలు.. 50-80 శాతం తగ్గిన ధరలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా మార్కెట్లో ఒక కూరగాయ ధర ఎక్కువ ఉంటే మరో కూరగాయ ధర తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయల ధరలు చూస్తే బాబోయ్ అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వెళ్తున్న వారు బ్యాగు నిండా కూరగాయలతో ఇంటికి వస్తున్నారు. కూరగాయలతో పాటు ఆకుకూరలు సైతం తక్కువ ధరలకే లభిస్తుండటంతో శాఖాహారులు, ఆరోగ్య అభిలాషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 50 నుంచి 80 శాతం తగ్గిన ధరలు టమాటా నుంచి క్యాబేజీ వరకు చౌకగా లభిస్తున్నాయి. తాజా ఆకుకూరలు అతి తక్కువ ధరకే విరివిరిగా లభిస్తున్నాయి. కూరగాయల దిగుబడి బాగా ఉండటంతో మార్కెట్లో అధికంగా లభ్యమవుతున్నాయి. రిటైల్‌గా కిలో టమాటా రూ.8 నుంచే రూ.10లకి లభిస్తోంది. వంకాయ, కాకరకాయ ధరలు తక్కువ ఉండగా ఒక్క ఆలుగడ్డ తప్పతో మిగతా కాయగూరలు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. మెంతికూర, పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు గతంలో కంటే 80 శాతం ధరలు తగ్గాయి. పుదీనా కొత్తిమీర ధలకు కూడా తగ్గాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.10 నుంచి రూ.15కే పీస్ చొప్పున అమ్ముతున్నారు. ఎప్పుడూ కూడా చుక్కలను అంటే ధరలతో ఉండే బీన్స్ మాత్రం కేజీ రూ.25 నుంచి రూ.30లకే లభ్యమవుతోంది. నేరుగా కాలనీలు, బస్తీల్లోకే.. కరోనా దెబ్బతో ఉద్యోగాలు కోల్పోయిన యువకులు అధిక సంఖ్యలో కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. కాగా కూరగాయల కోసం బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే లభ్యమవుతున్నాయి. ఆటో ట్రాలీలలో గల్లీ గల్లీ తిరిగి విక్రయిస్తున్నారు. సాయంత్రం రోడ్లపక్కన, ప్రధాన కూడళ్ల వద్ద కూరగాయల స్టాళ్లు వెలుస్తున్నాయి. తాజాగా.. చౌకగా లభ్యమవుతుండటంతో ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. -
వైరల్ : ఆకుకూరను ఇలా కూడా తింటారా !
-
వైరల్ : ఆకుకూరను ఇలా కూడా తింటారా !
విమానంలో ఒక మహిళ ఆకుకూరను తింటున్న విధానాన్ని ఒక వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వును ఆపుకోలేరు. ఆ వీడియోలో అంత కామెడీ ఏముంది అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం! ఆ వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన బ్యాగులో నుంచి ఆకుకూర కట్టను బయటికి తీసి కాడను కరకర నమిలిపారేసింది. ఆమె తిన్న విధానం ఎలా ఉందంటే ఎవరి మీదో కోపం ఆకుకూర కట్టమీద చూపించిందా లేక బాగా ఆకలివేయడం వల్ల అలా ప్రవర్తించిందా అన్నట్లుగా ఉంది. అయితే ఆమె తిన్న విధానాన్ని మాలీ మెక్‌గ్లూ అనే వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకు ' ఐయామ్ సో ఫ్రెష్' అనే పాటను కూడా జత చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 'నేను ఆకుకూలను ఎంతో ఇష్టపడతాను. కానీ ఆమె తిన్న విధానం చూస్తే నాకు భయమేసింది' అంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు.' ఆమె తిన్న విధానం చూస్తే నాకు భయమేసిందంటూ' మరొకరు కామెంట్ చేశారు. -
తరగక ముందే కడగాలి
► ఆకు కూరలను ఉప్పునీటితో కడిగితే త్వరగా శుభ్రపడుతాయి. మామూలు నీటితో నాలుగు సార్లు కడగడం కంటే ఉప్పు నీటితో రెండుసార్లు కడిగితే చాలు. ► ఆకుకూరలు, కూరగాయలను కడిగిన తర్వాత మాత్రమే తరగాలి. తరిగిన తర్వాత కడిగితే వాటిలో ఉండే పోషకాలు నీటిలో కలిసిపోతాయి. ► జిడ్డు పట్టిన ఇనుప పెనాలను శుభ్రం చేయడం కష్టం. పెనం మీద ఉప్పు చల్లి, పేపర్‌తో తుడిచి ఆ తర్వాత సబ్బునీటితో శుభ్రం చేయాలి. ► కప్పుల్లో చివరగా మిగిల్చే కొద్దిపాటి కాఫీ, టీల వల్ల కప్పు అడుగున మరకలు పడుతుంటుంది. అలా పట్టేసిన మరకలు పోవాలంటే పొడి కప్పులో ఉప్పు చల్లి రుద్దాలి. ► రిఫ్రిజిరేటర్ లోపల శుభ్ర పరచడానికి ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపిన నీటిని వాడాలి. సోడా బైకార్బనేట్ రిఫ్రిజిరేటర్లో దుర్వాసనను కూడా పోగొడుతుంది. చిన్న కప్పులో (వంటసోడా) వేసి ఫ్రిజ్‌లో ఒక మూల పెడితే కొద్దిగంటల్లోనే దుర్వాసన పోతుంది. ► రాగి పాత్రల మీద మరకలు పోవాలంటే మరకల మీద ఉప్పు చల్లి వెనిగర్‌లో ముంచిన క్లాత్‌తో తుడవాలి. ► ద్రాక్షపండ్ల మీద చల్లిన రసాయనాలు వదలాలంటే ఉప్పు కలిపిన నీటిలో కనీసం గంటసేపు ఉంచి కడగాలి. -
ఉల్లి తప్ప ఏమీ కొనను!
వ్యవసాయ శాఖలో అదనపు సంచాలకురాలిగా పనిచేస్తున్న ఉషారాణి తమ కుటుంబం కోసం ఇంటిపైనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రైతు శిక్షణా కేంద్రంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఉషారాణి బిహెచ్ఇఎల్ సమీపంలోని తమ స్వగృహంపై ఇంటిపంటలు సాగు చేస్తూ.. ఉల్లిపాయలు తప్ప ఇతరత్రా అన్నీ తానే పండించుకుంటున్నారు. ఆమె భర్త యలమంద వృత్తిరీత్యా బీహెచ్ఈఎల్ ఇంజినీర్. ఆయన సహాయంతో టెర్రస్‌పై ఇనుప ఊచలతో పందిరిని ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయ పాదులను దానిపైకి పాకిస్తూ, నిశ్చింతగా ఇంటిపంటలు పండిస్తున్నారు. 200 లీటర్ల ఫైబర్ డ్రమ్మును మధ్యకు కత్తిరించి రెండు మడులుగా వాడుతున్నారు. వీటితోపాటు ప్లాస్టిక్ కుండీలు, ఖాళీ బక్కెట్లలో కూడా అనేక రకాల ఆకుకూరలతోపాటు కూరగాయలను సాగు చేస్తున్నారు. డ్రమ్ముల అడుగున హాలో బ్రిక్స్ పెట్టడం వల్ల టెర్రస్‌పైన పడిన నీరు వెంటనే పల్లానికి వెళ్లిపోవడానికి వీలవుతోంది. ఎర్రమట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు సమపాళ్లలో వేస్తారు. వేపపిండి, బోన్మీల్, జీవన ఎరువులు కొద్ది మొత్తంలో కలుపుతారు. వంటింటి వ్యర్థాలు, ఎండు పూలతో ఆవు పేడ స్లర్రీని వేసి కంపోస్టును తయారు చేసుకుంటారు. ఈ కంపోస్టును, సముద్రపు నాచుతో తయారైన గ్రాన్యూల్స్‌ను పూత, కాత సమయాల్లో మొక్కలకు అడపా దడపా వేస్తుంటారు. పురుగులు ఏమైనా కనిపిస్తే అవి చిన్నగా ఉన్నప్పుడే పుల్లమజ్జిగ, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం వంటి వాటిని పిచికారీ చేస్తుంటారు. 6 రకాల వంకాయలను సాగు చేస్తున్నారు. బెండ, వంగ, బంగాళదుంపలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. దొండ పాదును ఇనుప పందిరిపైకి పాకించలేదు. ఇది బాగా అల్లుకుపోయి ఇతర కూరగాయ మొక్కలను పెరగకుండా చేస్తుందన్న భావనతో ట్రెల్లిస్పైకి పాకించానని ఉషారాణి తెలిపారు. అనేక పండ్ల మొక్కలను కూడా ఆమె సాగు చేస్తున్నారు. స్వీట్ లైమ్, వాటర్ ఆపిల్, అంజూర, నిమ్మ, దానిమ్మ, మామిడి, ప్యాషన్ ఫ్రూట్ తదితర పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ప్యాషన్ ఫ్రూట్ పాదును ఇంటి ముందు నేలలో నాటి, మేడపైకి పాకించారు. అత్యంత పోషక విలువలున్న ఈ పండ్లు చాలా ఎక్కువ సంఖ్యలో కాస్తున్నాయని ఆమె తెలిపారు. ప్యాషన్ ఫ్రూట్ రసం చాలా రుచికరంగా ఉంటుందన్నారు. ఇంటిపంటలకు అందుబాటులో ఉన్న ఏదో ఒక పోషక పదార్థాన్ని అడపా దడపా వేస్తూ ఉంటే పోషక లోపం లేకుండా మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడులనిస్తాయని ఆమె అన్నారు. ఆపిల్ బెర్ మొక్క ఒకసారి ఎండిపోయింది. శిలీంద్రనాశిని అయిన ట్రైకోడెర్మా విరిడి పొడిని తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత తిరిగి కొత్త చిగుర్లు వేసిందని ఆమె తెలిపారు. కొంచెం ప్రణాళికా బద్ధంగా సీజన్ల వారీగా నార్లు పోసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే ఏడాది పొడవునా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడం సులువేనని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో కాపు పొందాలనుకుంటున్న కూరగాయ మొక్కలకు సంబంధించి ఇప్పటికే తాను నారు పోశానన్నారు. భవనానికి ఇంటిపంటల కుండీలు, డ్రమ్ములు బరువై పోతాయని, భవనానికి ఏదైనా నష్టం జరుగుతుందన్న అపోహలు అవసరం లేదని ఆమె అంటారు. వాటర్ ప్రూఫింగ్ చేసిన టెర్రస్‌పైన హాలో బ్రిక్స్ పెట్టుకొని వాటిపై కుండీలు, డ్రమ్ములు పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని ఉషారాణి (81217 96299) అంటున్నారు. శ్రద్ధ ఉంటే ఇంటిపంటల సాగు కష్టమేమీ కాదని ఆమె అన్నారు. -
ఇంటి మీద 24 కూరగాయల పంట!
ఆ ఇంటి డాబాపైన 1,800 చదరపు అడుగుల వైశాల్యంలో 24 రకాల కూరగాయ మొక్కలు, రకారకాల దుంపల మొక్కలు, ఆకుకూరలతో, తీగలతో పచ్చదనం ఉట్టిపడే కూరగాయల చిట్టడవిలా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నది హైదరాబాద్ రామంతపూర్ న్యూగోకుల్నగర్లోని లీనానాయర్, గోపక్కుమార్ దంపతుల ఇల్లు. రసాయనిక ఎరువులతో, మురుగునీటిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలతో అనారోగ్యం పాలవుతామన్న భయంతో సొంతంగా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలనే ఈ దంపతులు తింటున్నారు. గ్రోబ్యాగ్స్, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో పాటు వారాంతపు సంతలు ముగిసిన తర్వాత వ్యాపారులు పడేసిన కూరగాయ వ్యర్థాలను సేకరించి కంపోస్టు తయారీకి ఉపయోగిస్తున్నారు. చుక్కకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, బచ్చలికూర, తోటకూరలతో పాటు ముల్లంగి, క్యారెట్, ఆలుగడ్డ, చామగడ్డ, మొరంగడ్డ, బీట్రూట్ తదితర దుంపలు కూడా పండిస్తున్నారు. చిక్కుడు, గోకర కాయ, బెండకాయ, బఠాణి, బీన్స్‌తోపాటు పొట్ల, సొర, కాకర కాయలతో పాటు నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను సైతం మేడమీద ఏడాది పొడవునా పండిస్తున్నారు. కొత్తిమీర, మెంతికూరతోపాటు పెసర, ఆవాలు తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను కూడా సాగు చేస్తున్నారు. అధికంగా కారం, రుచి కలిగిన పచ్చిమిర్చి రకాలను పండిస్తున్నారు. ఒక వంతు పశువుల పేడ, రెండింతల ఎర్రమట్టి, వర్మీకంపోస్ట్‌ను కలిపిన మట్టి మిశ్రమాన్ని ఇంటిపంటల సాగుకు వాడుతున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఇంటిపంటల సాగు, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడంలో కూడా లీనా నాయర్ శిక్షణ ఇస్తుండడం విశేషం. – మునుకుంట్ల అశోక్, సాక్షి, రామంతపూర్ ఇంటిపంటలతో శారీరక రుగ్మతలు పోయాయి వంటింటి వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసుకుంటూ.. కేవలం రూ.10ల ప్లాస్టిక్ కవర్లలో పెద్ద ఖర్చు లేకుండానే అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నాం. అధికంగా కూరగాయలు సాగయినప్పుడు ఆర్గానిక్ మార్కెట్లలో అమ్మి, ఆ డబ్బుతోనే విత్తనాలు కొంటున్నాం. సేంద్రియ ఇంటిపంటల కూరగాయలతో ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి. తరచుగా ఒళ్లు నొప్పులు, ఇతర రుగ్మతలతో బాధపడే నాకు ఈ కూరగాయలు తింటే అనూహ్యంగా, ఆరోగ్యంగా మారిపోయాను. స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు ఇంటిపంటలపై అవగాహన కల్గిస్తూ సేంద్రియ ఎరువుల తయారీలో కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. – లీనా నాయర్ (98857 00644), రామంతపూర్, హైదరాబాద్ -
అతి ‘కీటో’ అనర్థమే..!
ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుళ్లు... బోలెడన్ని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వు... పిడికెడు మాంసం.. కొన్ని పాలు... దీర్ఘాయుష్షు, ఆరోగ్యకర జీవనానికి మేలైన మార్గాలివే! ప్రపంచం మొత్తమ్మీద లక్షల మంది ఆహారపు అలవాట్లను విశ్లేషించి పరిశోధకులు చెబుతున్న విషయమిది! మరి బరువు తగ్గేందుకు, మధుమేహాన్ని దూరం పెట్టేందుకు చాలా మంది అనుసరిస్తున్న కీటోడైట్ మాటేమిటి? ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’అని ఓ సామెత ఉంది. ఏ విషయంలోనైనా అవసరానికి మించి వ్యవహరించడం సరికాదన్నది దీని అర్థం. ఆహారం కూడా దీనికి మినహాయింపు కాదంటున్నారు సారా సైడల్‌మ్యాన్. బ్రిగమ్ అండ్ బోస్టన్ విమన్స్ హాస్పిటల్ (అమెరికా)లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె ఇటీవల ఓ భారీ అధ్యయనాన్ని పూర్తి చేశారు. ప్రపంచం నలుమూలల్లోని దాదాపు 4.5 లక్షల మంది ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య వివరాలను విశ్లేషించి సారా చెప్పేదేమిటంటే ‘‘మన ఆరోగ్యానికి రోజూ తీసుకునే ఆహారం కంటే ముఖ్యమైనది ఇంకోటి లేనే లేదు’’అని! అంతేకాదు పిండి పదార్థాలను దాదాపుగా మానేసి కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న కీటోడైట్‌తో స్వల్పకాలంలో ప్రయోజనం చేకూరవచ్చునేమోగానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది మనల్ని తొందరగా కాటికి పంపేస్తుందని అంటారు ఆమె. ప్రపంచంలో ఏ చోట ఉన్న వారికైనా ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ ఇదీ తర్కం... కీటోడైట్‌లో పిండి పదార్థాలు చాలా తక్కువగా.. వీలైతే అస్సలు తీసుకోరాదన్నది ప్రాథమిక నియమం. శరీరానికి కావాల్సిన శక్తి మొత్తం కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లతోనే అందేలా చేయాల్సి ఉంటుంది. వంద శాతం కార్బోహైడ్రేట్ అయిన చక్కెరకూ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా కీటోడైట్ పాటించే వారు వీలైనంత వరకూ మరపట్టిన అంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారన్నదీ మనకు తెలుసు. చక్కెర తగ్గించడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోవడం అనే రెండు అలవాట్లూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో వివాదం ఏమీ లేదు. కాకపోతే కీటోడైట్ పేరుతో మనకు మేలు చేసే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కూడా దూరంగా పెట్టడంతోనే వస్తుంది చిక్కంతా! పైగా కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. తాజా చిక్కుళ్లు, అరటిపండ్లు, ఓట్స్ వంటి వాటిల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. కీటోడైట్ పేరెలా వచ్చిందంటే... కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వు నుంచి శక్తి పొందే జీవ క్రియను కీటోసిస్ అంటారు. తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు లేకుండా కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి అవసరమైన శక్తిని పొందుతుంది. ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్స్ వెలువడటం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్నే ఈ డైట్లో ప్రధానంగా పాటించాల్సి ఉండటంతో దీనికి కీటోడైట్ అనే పేరు వచ్చింది. మరో రెండు అధ్యయనాలు ఏం చెప్పాయంటే... సారా సైడల్‌మ్యాన్ కీటోడైట్ దీర్ఘకాలిక దుష్ప్రభావాల గురించి ఇటీవల యూరప్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఇదే సదస్సులో మరో రెండు అధ్యయనాలు కూడా కీటోడైట్ ప్రభావశీలతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. పిండి పదార్థాలను పూర్తిగా పరిహరించడం కాకుండా మోస్తరుగా వాటిని ఆహారంగా తీసుకోవడం మేలని ఇవి చెబుతున్నాయి. దీర్ఘకాలపు కీటోడైట్‌తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత సమస్యలు, కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తమ అధ్యయనాల ద్వారా తెలిసిందని పోలండ్‌లోని మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాసెచ్ బనాచ్ అంటున్నారు. యూరప్‌లోని దాదాపు 5 లక్షల మందిపై జరిగిన మరో అధ్యయనం ప్రకారం కూడా తినే తిండిలో పోషకాలు తక్కువగా ఉంటే కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. పిండి పదార్థాలను తక్కువ తీసుకొని వెన్న, మాంసాలను ఎక్కువ తీసుకుంటే రక్తపోటు, కేన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. పాల ఉత్పత్తులు, మాంసం శరీరంలో మంట/వాపులకు కారణమని, ఇది దీర్ఘకాలంలో కేన్సర్ కణతులు ఏర్పడేందుకు/పెరిగేందుకూ దారితీస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కీటోడైట్ అస్సలు పనికిరాదా...? కొన్ని అంశాల్లో కీటోడైట్ అద్భుతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొవ్వు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడే అంశమే. రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించుకోవాలనుకునే వారు కూడా దీన్ని వాడవచ్చు. అంతేకాదు అదుపు చేసేందుకు కూడా సాధ్యం కాని మూర్ఛ లక్షణాలున్న పిల్లలకూ కీటోడైట్‌తో ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. నిపుణుల మార్గదర్శకత్వంలో పాటించే కీటోడైట్‌తో ఈ రకమైన ఫలితాలు సాధించడం సాధ్యమే. అదే సమయంలో ఇది అందరికీ సమానంగా వర్తించే విషయం కాదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కొందరికి మధుమేహం వచ్చే అవకాశముందని కొన్ని పరిశోధనలు సూచిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. పీచు పదార్థాలతోనే దీర్ఘాయువు... కీటోడైట్ కానీ మరో కొత్త ఆహారపు అలవాటుగానీ చక్కటి ఆరోగ్యానికి దగ్గరి దారి ఏదీ లేదు. కడుపు మాడ్చుకున్న పరిస్థితుల్లో మినహా సాధారణ పరిస్థితుల్లో కొవ్వులుతోనే శక్తిని పొందడం మన శరీరానికి అలవాటు లేని పని. కీటోడైట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చిన వారూ చెప్పేది ఇదే. మీ ఆరోగ్య సమస్యకు అనుగుణంగా ఈ ఆహార అలవాటును కొన్ని నెలలే పాటించండి అని! కీటోడైట్‌ను పాటించకపోయినా పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్, మాంసాలను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే కాయగూరలు, ధాన్యాలు, నట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా సరే చిక్కుళ్లను తరచుగా తీసుకోవడం మేలని సారా సైడల్‌మ్యాన్ వంటి వారు సూచిస్తున్నారు. ఈ రకమైన ఆహారం తీసుకునే వారు మిగిలిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని తమ అధ్యయనంలో తేలిందని సారా చెబుతున్నారు. తెల్లగా తళతళలాడే బియ్యం బదులు ముతక బియ్యం వాడటం, పండ్లు, కాయగూరలను పానీయాల రూపంలో కాకుండా వీలైనంత వరకూ తాజాగా తినడం వల్ల వాటిల్లోని పీచు శరీరానికి చేరుతుందని సారా వివరించారు. -
ఆకుకూరలతో ఆ రిస్క్‌కు దూరం
వాషింగ్టన్ : సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహార ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తరచూ ఆకుకూరలు తీసుకునేవారికి స్ర్టోక్ రిస్క్ 64 శాతం తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటు కలిగిన వారిలో ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ ముప్పు అధికంగా ఉన్న క్రమంలో వీరిలో తాజా ఆకుకూరలు అధికంగా తీసుకునేవారికి స్ర్టోక్ ముప్పు 64 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. 682 మంది రోగుల రికార్డులను విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ విషయం పసిగట్టారు. మెదడులో రక్తస్రావాన్ని (బ్లీడింగ్ స్ర్టోక్స్) తాజా ఆకుకూరలు తీసుకోవడం ద్వారా అడ్డుకోవచ్చని ఈ పరిశోధన వెల్లడించింది. స్ర్టోక్స్లో 32 శాతం బ్లీడింగ్ స్ర్టోక్స్ కాగా వీటిలో 93 శాతం అధిక రక్తపోటు దీనికి మూల కారణంగా పరిశోధకులు గుర్తించారు. ఇక డయాబెటిస్ రోగులకు స్ర్టోక్ ముప్పు 2.3 రెట్లు అధికమని, ఒత్తిడికి గురయ్యేవారికి 2.2 రెట్లు అధికమని తేల్చారు. కొలెస్ర్టాల్ లెవెల్స్ అధికంగా ఉండే వారికి స్ర్టోక్ ముప్పు 1.6 రెట్లు, పొగాకు సేవించేవారికి 10 రెట్లు స్ట్రోక్ ముప్పు అధికమని పరిశోధనలో పేర్కొన్నారు. -
వారంలో 5 రోజులు ‘ఇంటి’ కూరలే!
చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తి ఆమెను ఇంటిపంటల వైపు దృష్టి మళ్లించేందుకు పురికొల్పింది. మేడపైన ఉన్న కొద్ది పాటి స్థలాన్ని పొందికగా ఉపయోగించుకొని 20 రకాలకు పైగా ఇంటిపంటలను సాగు చే స్తున్నారు రాయకంటి లీలారవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమలానగర్ కాలనీలో స్వగృహంలో నివసిస్తూ.. గత రెండేళ్లుగా గృహిణిగా తనకున్న ఖాళీ సమయాన్ని ఇంటిపంటలకు వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు గల తమ కుటుంబానికి వారానికి ఐదు రోజులకు సరిపడా సేంద్రియ కాయగూరలు, ఆకుకూరలు తమ ఇంటిపైనే పండిస్తున్నారు. 350కు పైగా మట్టి, సిమెంట్ కుండీల్లో కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతున్నారు. వంగ, టమాట, చెట్టు చిక్కుడు, మిరప, సొర, బీర, కాకర, దోస వంటి కూరగాయలతోపాటు పుదీనా, కొత్తిమీర, తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలు పెంచుతున్నారు. మొక్కలను పెంచేందుకు రెండు పాళ్లు ఎర్రమట్టి, ఒక పాలు మాగిన ఆవు పేడ, కొంచెం ఇసుక, వేపపిండి కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. కుండీ అడుగున రంధ్రాలు పూడిపోకుండా ఉండేందుకు ముందు రెండంగుళాల మందాన గులక రాళ్లు వేసి ఆపైన మట్టి మిశ్రమం నింపుతారు. ఈ మట్టి మిశ్రమాన్ని రెండేళ్లకోసారి పూర్తిగా మార్చేస్తానని ఆమె తెలిపారు. వంటింటి వ్యర్థాలు, గంజి, బియ్యం కడిగిన నీళ్లను మొక్కల పోషణకు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఆవు పిడకల బూడిదకు.. వేపాకు పిండి, పసుపు కలిపి మొక్కలపై చల్లి, చీడపీడలను నివారిస్తున్నారు. పూల మొక్కలు, కూరగాయ మొక్కలను కొన్ని కుండీల్లో కలిపి వేశారు. దీని వల్ల తక్కువ కుండీల్లోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చంటున్నారావిడ. తీగ జాతి కూరలు పాకేందుకు రెయిలింగ్‌కు ప్లాస్టిక్ వైర్లు కట్టి పందిళ్లు ఏర్పాటు చేశారు. ‘ఆరోగ్యకరమైన కూరలను ఇంటిపట్టునే పెంచుకోవటం సంతృప్తినిస్తోంది. ఆ కూరల రుచిని కుటుంబ సభ్యులు మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అంటున్నారు లీలారవి (99498 94433).