విమానంలో ఒక మహిళ ఆకుకూరను తింటున్న విధానాన్ని ఒక వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వును ఆపుకోలేరు. ఆ వీడియోలో అంత కామెడీ ఏముంది అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం! ఆ వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన బ్యాగులో నుంచి ఆకుకూర కట్టను బయటికి తీసి కాడను కరకర నమిలిపారేసింది. ఆమె తిన్న విధానం ఎలా ఉందంటే ఎవరి మీదో కోపం ఆకుకూర కట్టమీద చూపించిందా లేక బాగా ఆకలివేయడం వల్ల అలా ప్రవర్తించిందా అన్నట్లుగా ఉంది. అయితే ఆమె తిన్న విధానాన్ని మాలీ మెక్‌గ్లూ అనే వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్ చేశాడు.