
పుట్టగొడుగులను పెంచడానికి సాధారణంగా పక్కా భవనంలో లేదా సెమీ పర్మినెంట్ షెడ్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్‌ఆర్) ఆరుబయటే ఉంచి సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను పెంచే ఒక ప్రత్యేక పెట్టె వంటి యూనిట్‌ను రూపొందించింది. ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో కూడా ఈ యూనిట్ ద్వారా రూపాయి కరెంటు ఖర్చు లేకుండా పుట్టగొడుగులు పెంచుకోవచ్చని ఐఐహెచ్‌ఆర్ చెబుతోంది.
ఎవాపరేటివ్ కూలింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా ఈ ‘అర్క మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్’ పనిచేస్తుండటంమే ఇందుకు కారణం. తక్కువ పెట్టుబడి, సులభ నిర్వహణ దీని ప్రత్యేకత ఆకర్షణలు. పుట్టగొడుగులు పెంచే ఈ ఛాంబర్ సైజు: 1.35 “ 0.93 “ 1.69 మీటర్లు. అంటే.. దీన్ని పెట్టుకోవటానికి రెండు చదరపు మీటర్ల స్థలం ఉంటే చాలు. 1’’ సిపివిసి పైపులు, ఫిట్టింగ్‌లతో దీన్ని తయారు చేశారు. సాధారణ గదుల్లో పుట్టగొడుగులు పెంపకంతో ΄ోల్చితే దీనిలో 51–108% వరకు దిగుబడి పెరిగింది. ఈ యూనిట్ ద్వారా నెలకు 25–28 కిలోల ఎల్మ్ అయిస్టర్, వైట్ మష్రూమ్స్ రకాల పుట్టగొడుగుల్ని పెంచవచ్చని ఐఐహెచ్‌ఆర్ తెలిపింది.
ఈ యూనిట్‌లో సులభంగా మిద్దె పైన, ఇంటి పెరట్లో కూడా ఎంచక్కా పుట్టగొడుగులు పెంచి, వాటిని పచ్చివి, ఎండువి విక్రయించవచ్చు. వాటితో తయారు చేసిన పోషక విలువలతో కూడిన పొడులను విక్రయించవచ్చు. ఒక్క ఎండు పుట్టగొడుగులు మాత్రమే విటమిన్ డిని అందించగల ఏకైక ఉత్పత్తి అని డా. ఖాదర్‌వలి వంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాపార దృష్టితో మిద్దె తోటల్లో లేదా ఇంటిపంటల్లో మేడలపైనే పుట్టగొడుగులు పెంపకాన్ని ప్రారంభించదలచిన వారికి ఈ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ వరమని చెప్పవచ్చు. ఫాబ్రికేటర్లు ఇటువంటి యూనిట్లను తయారు చేసి విక్రయించుకోవటానికి అవకాశం ఉంది.
ఇతర వివరాలకు.. 90909 49605, 080 – 23086100 (ఎక్స్‌టెన్షన్ : 348–349)
mushroomiihr@gmail.com
Comments
Please login to add a commentAdd a comment