Outdoor
-
‘సోలో స్టవ్ టవర్’..చలి భయమే అక్కర్లేదు
‘సోలో స్టవ్ టవర్’.. ఇది ఔట్‌డోర్ హీటర్. చలికాలంలో ఆరుబయట పిక్నిక్లు వంటివి జరుపుకోవాలంటే, వణికించే చలికి జంకుతారు చాలామంది. ‘సోలో స్టవ్ టవర్’ వెంట ఉంటే ఆరుబయట చలి భయమే అక్కర్లేదు. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకునే చోట దీనిని వెలిగించుకుంటే చాలు, నిమిషాల్లోనే పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిని వెలిగించిన మూడు నిమిషాల్లోనే పదడుగుల వ్యాసార్ధం పరిధిలోని పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిలోకి ఇంధనంగా కలప పొట్టుతో తయారైన ‘వుడెన్ పెల్లెట్స్’ వాడాల్సి ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘సోలో స్టవ్’ ఈ టవర్ హీటర్‌ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 1000 డాలర్లు (రూ.82 వేలు) మాత్రమే! -
కరోనా ఎఫెక్ట్.. రోడ్డెక్కిన రెస్టారెంట్
వాషింగ్టన్: కరోనా వైరస్ మానవాళి జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బయటి ఫుడ్డు తినడమే ఫ్యాషన్‌గా భావించిన వారు.. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. రెస్టారెంట్లు అన్ని కరోనా దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రెస్టారెంట్లు ఓ వినూత్న ఆలోచన చేశాయి. అవుట్డోర్ డైనింగ్(బహిరంగ భోజనం)ని అమలు చేశాయి. ఇది బాగా క్లిక్ అయ్యింది. దాంతో ఈ విధానాన్ని పర్మినెంట్ చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాత్కాలిక పద్దతిన ప్రవేశపెట్టిన ఈ విధానం బాగా క్లిక్ అయ్యింది. నగర వాసులు కూడా దీన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ఈ పద్దతిని శాశ్వతంగా అమలు చేయాలని భావిస్తున్నం’ అన్నారు. ఈ నెల 30 నుంచి న్యూయార్క్ నగరంలో 25శాతం ఆక్యుపెన్సీ పరిమితితో ఇండోర్ రెస్టారెంట్లు తెరుచుకోనున్న నేపథ్యంలో మేయర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి: క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్..) ‘కీలకమైన ఆహార పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో ఓపెన్ రెస్టారెంట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇది చాలా పెద్ద, ధైర్యమైన ప్రయోగం. పైగా విజయవంతమయ్యింది. దీని ద్వారా 90 వేల మందికి ఉపాధి కల్పించాము’ అని బ్లాసియో తెలిపారు. న్యూయార్క్ నగరాన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిటీగా మార్చడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని శాశ్వతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అవుట్డోర్ డైనింగ్ కోసం ఇప్పటికే 85 వీదులను కార్-ఫ్రీ స్ట్రీట్స్‌గా మార్చింది. అయితే శీతాకాలంలో ఈ అవుట్డోర్ రెస్టారెంట్ విధానానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే ఆ సమయంలో విపరీతంగా మంచు కురుస్తుంది. -
అవుట్డోర్తో ఆ వ్యాధులకు చెక్..
లండన్ : పచ్చని తోటల్లో ఆహ్లాదకర వాతావరణంలో విహరిస్తే మానసిక ఉల్లాసమే కాదు మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు సహా చివరికి ఒత్తిడీ దరిచేరదని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. కలివిడిగా ఉండటం మానసిక, శారీరక ఆరోగ్యాలపై పెనుప్రభావం చూపుతుందని ఈ భారీ సర్వేలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అథ్యయనం నేపథ్యంలో పచ్చని వాతావరణంలో గడపాలని రోగులకు ఇక వైద్యులు సూచించే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్‌తో పాటు దాదాపు 20 దేశాలకు చెందిన కోట్లాది మందిపై జరిపిన పరిశోధన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిగ్గుతేల్చారు. ప్రకృతి సహజమైన పచ్చిక బయళ్లలో సమయం గడపడం ద్వారా అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని తమ సర్వేలో వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. ప్రకృతి ఒడిలోఅధిక సమయం వెచ్చించడం ద్వారా టైప్ టూ డయాబెటిస్, గుండె జబ్బులు, అకాల మరణం ముప్పును నిరోధించవచ్చని, నిద్ర లేమిని నివారించవచ్చని అథ్యయన రచయిత కోమి బెన్నెట్ పేర్కొన్నారు. పార్కులు, ఉద్యానవనాలు, పచ్చికబయళ్లతో కూడిన సహజమైన ప్రకృతితో సహవాసం హృదయ స్పందనలను సమన్వయం చేయడంతో పాటు ఒత్తిడినీ దూరం చేస్తుందన్నారు. ప్రకృతి ఒడిలో సేదదీరే వారు సహజంగానే శారీరక శ్రమతో పాటు నలుగురితో కలివిడిగా ఉంటారని ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. సహజసిద్ధమైన వాతావరణంలో ఉండే వైవిధ్య బ్యాక్టీరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వాపులను నిరోధిస్తాయన్నారు. ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ జర్నల్‌లో తాజా అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. -
కొడుకులా.. కర్కోటకులా..!
మునుగోడు: నవమాసాలు మోసి కనిపెంచారు.. కంటికి రెప్పలా కాపాడారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని బోలెడన్ని ఆశలూ పెట్టుకున్నారు. చెట్టంత కొడుకులు చేదోడుగా ఉంటారని వారు ‘కన్న’కలలు కల్లలయ్యాయి. ఆ కొడుకులే కర్కో టకులయ్యారు. కనికరం లేకుండా తల్లిదండ్రులను గెంటేశారు. సామానంతా బయట పడేయడంతో ఎముకలు కొరికే చలిలో ఆ వృద్ధ దంపతులు పడిన ఇబ్బందులు చూసి చలించనివారుండరు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిగూడేనికి చెందిన నారగోని ముత్యాలు(65), మంగమ్మ (62) దంపతులకు నలుగురు కుమారులు. ఇరవై ఏళ్ల క్రితం నలుగురిలో ముగ్గురికి వివాహం చేశారు. ఆ సమయంలోనే ఆస్తులను సమ భాగాలుగా పంచి ఇచ్చి వేరు కాపురం పెట్టించారు. వివాహం కాని చిన్న కొడుకుకు కూడా భాగం ఇచ్చి తల్లిదండ్రులు అతనితో ఉండేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇంట్లో ఒక గది తీసుకొని అతనితోపాటు ఉంటున్నారు. చిన్న కుమారుడికి వివాహం కాగానే, అతను కూడా వేరు పడ్డాడు. అదే ఇంట్లో ఉంటున్న ముత్యాలు, మంగమ్మ దంపతులు నలుగురు కుమారుల వద్ద ఖర్చులకు డబ్బులు తీసుకుని సొంతంగా వండుకుంటున్నారు. నెల రోజులుగా చిన్న కుమారుడు తన ఇంట్లో ఉండ వద్దని నిత్యం గొడవ పడుతున్నాడు. వారికి వేరే చోట ఉండేందుకు గూడు లేకపోవడంతో అదే ఇంట్లో మాటలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. దీంతో తాను ఎంత చెప్పినా వినడంలేదని ఆగ్రహించిన చిన్న కుమారుడు తల్లిదండ్రుల సామగ్రిని బుధవారం రాత్రి వీధిలో పడేశాడు. ఏం చేయాలో దిక్కుతోచక రాత్రంతా చలికి వణుకుతూ ఆరుబయటే తల్లిదండ్రులు ఉండిపోయారు. గురువారం సామాన్లు పెట్టుకుని వంట చేసుకున్నారు. నలుగురిలో ఇద్దరు కుమారులు మాత్రం మీకు ఇచ్చిన ఇంట్లోనే ఉండాలని, తామెలా తీసుకెళ్తామని అంటుండగా, మరో ఇద్దరు మాత్రం చడీచప్పుడు చేయడం లేదని వృద్ధ దంపతులు ముత్యాలు, మంగమ్మ తెలిపారు. తమను కుమారులు పట్టించుకోవడం లేదని, వారిని చట్టపరంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఔట్‌డోర్ ఆటలే అన్నిటికన్నా బెస్ట్!
పూర్వం పిల్లలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే స్నేహితులతో కలిసి హాయిగా ఆటలాడుకునేవారు. కబడ్డీ, కోతికొమ్మచ్చి, నేలాబండా, ఒంగుళ్లు- దూకుళ్లు, క్రికెట్టు, కర్రాబిళ్లా, ఏడుపెంకులాట, రాళ్లాట వంటివి వారు ఆడుకునే ఆటల్లో ఉండేవి. అయితే ఈ కాలం పిల్లలు బయటికెళ్లి ఆడుకోవడం తగ్గిపోయింది. అస్తమానం టీవీలకూ, కంప్యూటర్లకూ అతుక్కుపోతున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, కళ్లద్దాల బారిన పడుతున్నారు. తలిదండ్రులు కూడా పిల్లలు బయటికెళ్లి అటలాడుకుని ఏ కొట్లాటో తెచ్చిపెట్టేకంటే, ఓ సిస్టమ్ వాళ్ల ముందు పడేస్తే సరిపోతుంది, హాయిగా కళ్ల ముందే ఉంటారు కదా అని అనుకుంటున్నారు. అయితే అది చాలా తప్పు. ఎందుకంటే బయటికెళ్లి ఆటలాడుకునే పిల్లల కు శారీరక వ్యాయామంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందట. తెలివితేటలు, సోషల్ స్కిల్స్ పెంపొందుతాయట. ఎగరడం, దుమకడం, సైక్లింగ్ చేయడం, మోటుగా ఆటలు ఆడటం వంటి వాటి వల్ల వారిలో ఐక్యూ పెరుగుతుందట. సాధారణ అధ్యయనం చెబుతున్న మాటలు కావివి. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో బాలల శారీరక, మానసిక ఆరోగ్యాలపై మేటి శాస్త్రవేత్తలు తేల్చిన పరిశోధనాంశాలు. వీరే కాదు, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు కూడా పిల్లలను ఔట్‌డోర్ గేమ్స్ ఆడుకోవడాన్ని తలిదండ్రులు తప్పక ప్రోత్సహించాలంటున్నారు. అలా ప్రోత్సహించబట్టే కదా మొన్నటికి మొన్న పి.వి. సింధు, సాక్షి మాలిక్ వంటి వారు ఒలింపిక్ గేమ్స్‌లో మన పరువు నిలబెట్టింది! అందుకే ఎప్పుడూ చదువు చదువు అని పిల్లల్ని సతాయించకుండా, వారిలో ఉన్న ఇతర సామర్థ్యాలని కూడా వెలికి తీయడం బెస్టంటున్న సర్వే రిపోర్టులను కూడా కాస్త తలకెక్కించుకోక తప్పదు మరి! -
అవుట్డోర్ ‘సాక్షి’గా...
బాపు తీసిన తొలి బొమ్మ బొమ్మలతో సున్నితమైన హావభావాలను పలికింపజేయడమే కాదు, ఒక రచయిత పుంఖాను పుంఖాలుగా రాసే కథలోని ఆంతర్యం మొత్తాన్ని ఒక్క బొమ్మతో చెప్పేసే బాపు... రెండున్నర గంటల కథను తెరపై రక్తికట్టించలేడా? కచ్చితంగా రక్తికట్టించగలడు. బాపుపై ముళ్లపూడి వెంకటరమణకి ఉన్న ఆపారమైన నమ్మకం అది. ఆ నమ్మకమే ‘సాక్షి’ నిర్మాణానికి కారణమైంది. బాపుకి కేరీ కూపర్ నటించిన ‘హై నూన్’ సినిమా అంటే ఇష్టం. రెండున్నర గంటల్లో జరిగే కథ అది. తన సినిమాను అలాగే చేద్దామనుకున్నారు బాపు. అందుకు తగ్గట్టే ముళ్లపూడి ‘సాక్షి’ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ స్క్రిప్టులో పాటలుండవ్. అప్పటికే నవయుగ పంపిణీదారులు కొన్ని సినిమాల వల్ల నష్టపోయి ఉన్నారు. వారి వద్దకెళ్లి ‘సాక్షి’ కథ వినిపించారు ముళ్లపూడి. ‘మూగమనసులు’ రచయితగా ముళ్లపూడి అంటే నవయుగావారికి వల్లమాలిన ప్రేమ. ‘మీరు కొత్తవారితో సినిమా చేద్దామంటున్నారు. సంతోషం. సినిమా అంతా అవుట్డ్డోర్లోనే అంటున్నారు. ఇంకా సంతోషం. కానీ... పాటల్లేకుండా సినిమా అంటున్నారు. అది మాత్రం బాలేదు. మన ప్రేక్షకులకు పాటలు చాలా ముఖ్యం’ అని ముళ్లపూడికి నచ్చజెప్పారు. పంపిణీదారుల సహకారం లేకుండా సినిమా పూర్తి చేయలేం కాబట్టి... పాటలు, నృత్యాలు... ఇలా అన్నీ కలిసొచ్చేట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు ముళ్లపూడి. దాంతో నవయుగ వారి భరోసా లభించింది. ి సనిమా సెట్స్‌కి వెళ్లింది. షూటింగ్‌కి వారం రోజుల ముందు ఆదుర్తి దగ్గర సహాయదర్శకుడైన కబీర్దాస్... బాపుని కూర్చోబెట్టి, లాంగ్ షాట్స్, మిడ్లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, సజషన్ షాట్స్ ఇవన్నీ... ఎలా తీయాలో సూచించారు. ‘అమ్మ కడుపు చల్లగా’ పాటతో చిత్రీకరణ స్టార్ట్. సాయంత్రానికలా పాటను పూర్తి చేసేశారు బాపు. ఆయన షాట్స్ పెట్టిన తీరు చూసి కెమెరామేన్ సెల్వరాజ్ విస్తుపోయారు. భవిష్యత్‌లో బాపు దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని జోస్యం చెప్పారు. ఇక ‘సాక్షి’ కథ విషయానికొస్తే... హంతకుడు చంపుతాడేమోనని ప్రాణభయంతో వణికిపోతున్న కథానాయకుడికి హంతుకుని చెల్లెలైన కథానాయికే భరోసా ఇస్తుంది. హీరోని పెళ్లాడుతుంది. తర్వాత ఏం జరిగిందనేది కథ. సినిమా ఆద్యంతం కోనసీమలోని పులిదిండి అనే గ్రామంలో తీశారు బాపు. కృష్ణకు ఇది రెండో సినిమా. విజయనిర్మల కూడా ‘రంగులరాట్నం’ తర్వాత నటించిన సినిమా ఇదే. విజయలలిత, సాక్షి రంగారావు, కనకదుర్గ, జగ్గారావులకు ఇదే తొలి సినిమా. కేవలం రెండున్నర లక్షల్లోనే సినిమాను పూర్తి చేశారు బాపు. సినిమా కూడా మంచి లాభాలే వచ్చాయి. అవార్డులను కూడా కైవసం చేసుకుంది.