
‘సోలో స్టవ్ టవర్’.. ఇది ఔట్‌డోర్ హీటర్. చలికాలంలో ఆరుబయట పిక్నిక్‌లు వంటివి జరుపుకోవాలంటే, వణికించే చలికి జంకుతారు చాలామంది. ‘సోలో స్టవ్ టవర్’ వెంట ఉంటే ఆరుబయట చలి భయమే అక్కర్లేదు. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట పిక్నిక్ పార్టీలు చేసుకునే చోట దీనిని వెలిగించుకుంటే చాలు, నిమిషాల్లోనే పరిసరాలను వెచ్చబరుస్తుంది.
దీనిని వెలిగించిన మూడు నిమిషాల్లోనే పదడుగుల వ్యాసార్ధం పరిధిలోని పరిసరాలను వెచ్చబరుస్తుంది. దీనిలోకి ఇంధనంగా కలప పొట్టుతో తయారైన ‘వుడెన్ పెల్లెట్స్’ వాడాల్సి ఉంటుంది. అమెరికన్ కంపెనీ ‘సోలో స్టవ్’ ఈ టవర్ హీటర్‌ను ఇటీవల మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర 1000 డాలర్లు (రూ.82 వేలు) మాత్రమే!